3, డిసెంబర్ 2011, శనివారం

ఐదు రకాల ప్రజలు !సరదాగా !

నేను మధ్య ఎక్కడో చదివాను.దాన్ని ఇక్కడ రాస్తున్నాను.ఎవరినీ నొప్పించడానికి కాదు.సరదాగా తీసుకోండి.అన్ని సందర్భాలలో ను ఇది నిజం కాక పోవచ్చు.
స్కూల్లో...
1) మొదటి తరగతి లో పాస్ అయిన చాలా మంది ఇంజనీరులో లేక డాక్టర్లో అవుతారు.

2) రెండవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు ఎం.బి. లు చేసి అడ్మినిస్ట్రేషన్ లో చేరి పైన వారిని కంట్రోల్ చేస్తారు.

3)
మూడవ తరగతి లో పాస్ అయిన వాళ్ళు రాజకీయాలలో చేరి ఎం.ఎల్. గానో మంత్రి గానో అయ్యి పై ఇద్దరినీ కంట్రోల్ చేస్తారు.

4)
ఫెయిల్ అయిన వాళ్ళు మాఫియా లోనో ,లేక రౌడిజం లోనో చేరి పై ముగ్గురినీ కంట్రోల్ చేస్తారు.

5)
ఇంక చివరగా అసలు స్కూలు మొఖం చూడని వాళ్ళు బాబా లుగా స్వామీజీ లు గా మారి పైన నలుగురినీ తమ చుట్టూ తిప్పుకుంటారు.

1, డిసెంబర్ 2011, గురువారం

పట్నం మింగేసింది !

మా ఊరి పేరు మారి పోయింది.ఏదో నోరు తిరగని పేరుతొ పిలుస్తున్నారు.
మా ఇరుగు పొరుగు లేరు .మా ఇంటి చుట్టూ పక్కలా ఎవరెవరో ఉన్నారు.
మాకు అర్థం కాని రకరకాల భాషలు మాట్లాడుతున్నారు.
మా భాషను మా యాసలో నోరారా మాట్లాడుకోవడానికి ఎవరూ కనపడ్డం లేదు.
మా పండుగలు కనపడ్డం లేదు ,వేరే పండుగలు చేస్తున్నారు.
మా సంస్కృతీ కనపడ్డం లేదు.
మా బాధను మన అనే వాళ్ళతో పంచుకుందామంటే ఎవరూ కనపడ్డం లేదు.
అంతా యాంత్రికంగా పరుగులు పెడుతున్నారు.
మా ఊరిని మమ్మల్ని పట్నం మింగేసింది.

25, నవంబర్ 2011, శుక్రవారం

దయచేసి సమాధానాలు చెప్పగలరు.

1) వేగంగా వెళ్ళే బస్సు లో గానీ ఏదైనా వాహనం లో గానీ ఒక ఈగ గానీ ఒక కీటకం గానీ ఎగురుతూ ఒకే స్థానంలో ఉంటే కీటకం బస్సుకు కొట్టుకుంతుందా?కొట్టుకోదా ? కారణం ఏమి?

2) ఒక పంజరం లో ఒక పక్షి ని ఉంచి పక్షి పంజరం లో కూర్చున్నప్పుడు పంజరం తో సహా బరువును త్రాసులో తూచినప్పుడు , పక్షి అదే పంజరంలో కూర్చోకుండా ఎగురుతూ ఉన్నప్పుడు ఉన్న బరువు సమానంగా ఉంటాయా? ఎందుకు?

దయచేసి బ్లాగు మిత్రులు వివరంగా సమాధానాలు చెప్పగలరు.

3, నవంబర్ 2011, గురువారం

పెద్ద పెద్ద మానేజ్మెంట్ గురులు ఏమంటారో!

మన పల్లెటూర్లలో రజక వృత్తి చేసే వాళ్ళ పని చాలా అద్బుతంగా ఉంటుంది.ఎందుకంటే వాళ్ళు చాలా మందివి, చాలా ఊర్లవి బట్టలు ఉతుకుతూ ఉంటారు.వాళ్ళు చాలా మటుకు నిరక్షరాస్యులు.అయినా కానీ ఒకరి బట్ట ఒకరికి మారకుండా తీసుక వచ్చి అప్పగిస్తుంటారు.పెద్ద పెద్ద మేనేజ్మెంట్ కళాశాలల్లో చెప్పే సిక్స్ సిగ్మా స్టాండర్డ్స్ గురించి వారికేమీ తెలవదు.అయినా కానీ వాళ్లకు పుట్టుకతో అబ్బిన విద్య వలన వాళ్ళ పనులలో వాళ్ళు చాలా అద్బుతంగా రానిస్తుటారు.వీరిని చూస్తే మన గొప్ప గొప్ప మానేజ్మెంట్ గురులు ఏమంటారో.

2, నవంబర్ 2011, బుధవారం

కళ్ళు బైర్లు కమ్మే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు.

నేను రోజు మా అమ్మాయిని ప్రస్తుతం చదువుతున్న స్కూలు నుండి వేరే స్కూల్లో చేర్పిస్తామని విచారించడానికి వెళ్లి ఫీజు గురించి అడిగితే ఐదంకెల ఫీజు చెప్పారు.అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.ఎందుకు అంత ఫీజు అడుగుతున్నారని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు మేము తీసుకుంటున్నాము అని వాళ్ళ సమాధానం.నేను ఏమీ ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూల్లో చదివాను.కానీ వాళ పరిస్థితి మధ్య తరగతి మానవునికి చాలా ఇబ్బంది గా తయారైంది. మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళతోనే పరిస్థితి.వీళ్ళు డబ్బు ఎంత ఎక్కువ కడితే అంత బాగా చదువు చెబుతారనే భ్రమలో ఉన్నారు.ఒక వేల స్కూలు యాజమాన్యాలు తక్కువ ఫీజు తీసుకుంటే వీళ్ళకు రుచించదు.దాని కోసమే స్కూలు యాజమాన్యాలు ఫీజు పెంచిన సందర్భాలు ఉన్నాయి.ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళ ను నాశనం చేసారు.అలా అని ప్రైవేట్ స్కూళ్ళు అంత బాగా ఏమీ చెప్పడం లేదు.తిరిగి పిల్లలతో పాటు మనము కుస్తీ పట్టాలి.మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఎలా చదివించు కోవాలో అర్థం కావడం లేదు.ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుకు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.లేకపొతే సామాన్య ప్రజలు స్కూలు వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు.

22, సెప్టెంబర్ 2011, గురువారం

ఎవరికోసం రూపాయికి కిలో బియ్యం ?

ఒక రూపాయకే కిలో బియ్యం అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.కానీ క్షేత్ర స్థాయిలో బియ్యం మెజారిటీ లబ్దిదారులు రేషన్ బియ్యం మేము తినడం లేదు ,మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.రేషన్ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. బియ్యం రీసైకిల్ అయ్యి వాటిని సిటీ లోపట్టణాలలో ఉండే ప్రజలు కిలో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు ,.కావున పథకం చాలా దుర్వినియోగం అవుతున్నది.నిజమైన అవసరమైన లబ్దిదారులకు మాత్రమే అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మీడియా అత్యుత్సాహం !

రోజు ఉదయం నుండి ఒక చానల్ అంబటి గురించి అదే పనిగా ప్రసారం చేస్తుంది.దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా అంబటి విషయమే దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన విషయం అన్నట్లు అతి విలువైన మీడియా కాలాన్ని వృధా చేస్తున్నారు.అంబటి అనే మనిషి ఒక వ్యక్తి మాత్రమే,అతను విధమైన రాజ్యాంగ పదవులలో లేడు.అతను ఒక వేళ తప్పు చేసి ఉన్నట్లయితే ఇబ్బందులకు గురైన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది.అలా కాకుండా చానల్ అదే పనిగా విషయాన్నే ఉదయం నుండి చర్చను కొనసాగిస్తా ఉంటే భాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కాకుండా ఇంకేదో ఉద్దేశ్యం ఉన్నట్లు చూసే వాళ్లకు అనిపిస్తుంది.ఇప్పటికే మీడియా వాళ్లకు రకరకాల రాజకీయాలు అంటకట్టబడిఉన్నాయి.వాటిని నిజం చేయాలని చూడకూడదు.

రాజరిక పాలనే నయమా!

పూర్వం రాజుల పాలనలో రాజులు తమ రాజ్యం లోని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారు వేషాలలో తిరిగి వారి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల మనసెరిగి పరిపాలన సాగించారని విన్నాం.కాని ప్రజల కోసం ,ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెప్పబడుతున్న ప్రస్తుత ప్రభుత్వాలు ,పాలకులు ప్రజల కోసం ఏమి చేస్తున్నారో గమనించాలి.ప్రజలు కట్టగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చూడకుండా నిత్యం ఏదో ఒక రూపానా పన్నులు పెంచేస్తున్నారు.మొన్న వ్యాట్ ,తరచుగా పెట్రోల్ ,గ్యాస్ ధరలు,నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి.మెజారిటీ ప్రజలు విధంగా బ్రతుకుతున్నారో పాలకులకు పట్టడం లేదు.ప్రజలను ప్రభుత్వాలు ఏమీ పోషించడం లేదు.వాళ్ళ కష్టం వాళ్ళు పడి తమ బ్రతుకులు బ్రతుకుతూ ప్రభుత్వాలను,పాలకులను "వివిధ రకాల పన్నులు "కట్టి ప్రజలు పోషిస్తున్నారు.ఇప్పటికైనా పాలకులు ప్రజల మనసెరిగి పరిపాలన సాగించాలి లేదంటే తమ మనస్సులలోన ఉండే ఆవేదన ,ఆక్రోశం బ్రద్దలై పాలకులకు బుద్దిచెప్పే రోజు వస్తుంది.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అశ్రునివాళి.

భౌతికంగా మా మధ్యన నీవు లేకున్నా ,మా మనసంతా నీవే ...రాజశేఖరా ,నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇవే మా అశ్రునివాలులు .

8, జులై 2011, శుక్రవారం

ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ..

ప్రజా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి 62 వ జయంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ....

23, జూన్ 2011, గురువారం

ఎవరి మెప్పు కోసం ఈ గోబెల్స్ ప్రచారం......

జగన్ గారు ఓదార్పు యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ప్రాంతం లో పర్యటించినపుడు ,ఎంతో మంది భక్తుల ఆరాధ్య దైవమైన సాయిబాబా గారు పరమ పదించిన తర్వాత ఆయన కుమారుడైన రత్నాకర్ గారిని జగన్ గారు మానవతా దృక్పథం తో పరామర్శించడం కొంత మీడియా బురద చల్లడానికి ఒక అవకాశంగా తీసుకొని తిరిగి తమ విశ్వసనీయతను మరొక సారి పోగొట్టుకున్నాయి.జగన్ గారి ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందన చూసి దాన్ని తగ్గించి చూపడానికి కొన్ని మీడియా సంస్థలు ఈ పనికి పూను కొన్నాయి.జగన్ గారు ఓదార్పు యాత్ర కు ఒక ప్రాంతానికి వెళ్ళినపుడు ప్రాంతంలో ఉన్న ప్రముఖులు అనారోగ్యం పాలైనపుడు గాని ,వాళ్ళ బంధువులు చనిపోయినపుడు గాని వాళ్ళు తమతో రాజకీయంగా విభేదించినప్పటికీ వాళ్ళను పరామర్శిం చడం ఆనవాయితీ.అది వాళ్ళ మానవత్వానికి ఒక నిదర్శనం.ఉదాహరణకు ఎం.పి . హర్షకుమార్ గారు సుపత్రి లో ఉన్నప్పుడు కూడా జగన్ గారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరామర్శించారు.జగన్ గారు మాత్రమే కాదు,వాళ్ళ తండ్రి రాజశేఖరరెడ్డి గారికి కూడా శత్రువులకు కూడా సహాయం చేసే లక్షణం ఉంది.అందుకే వాళ్లకు ప్రజలలో విశ్వసనీయత ఉంది. మిగతా రాజకీయ నాయకుల లాగా ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలకు డ్రామాలు వినిపించి తర్వాత ప్రజలను పట్టించు కోకుండా ఉండే రకం కాదు.సాయబాబా గారు జీవించి ఉన్నప్పుడు ఆయన చుట్టూ చీటికీ మాటికి తిరిగి ఆయన దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి ఆయన ద్వారా పనులు చేయించుకొని ,ఆయన మరణ శయ్య మీద ఉన్నప్పుడు తమ తమ ఆర్ధిక లావాదేవీలు పరిష్కరించుకొని తర్వాత అటువైపు చూడని పెద్దమనుషులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.వై.ఎస్.వాళ్ళు ఎప్పుడూ అటువంటి పనులు చేయలేదు,మీడియా ద్వారా నాయకులు కాలేదు .దమ్ముగా ప్రజలలో నుండి వచ్చారు,ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారు.ఇప్పటికైనా మీడియా సంస్థలు ప్రజలు నవ్వుకునేటట్లు ఉన్న తమ గోబెల్స్ ప్రచారం మానుకుంటే కొంతవరకైనా వాళ్ళ విశ్వసనీయతను నిలుపుకుంటారు.

31, మే 2011, మంగళవారం

డబ్బుల కోసం ఏమైనా చేస్తారా?

మన రాష్ట్రంలో పేరున్న ఒక చానల్ ఇంకొక చానల్ యాజమాన్యానికి సంభంధించిన తలకు పెట్టుకునే ఆయుర్వేద మందు గురించి , మందు పనికి రానిదని ప్రజలను మోసం చేస్తున్నారని ఒక రోజంతా నిపుణులతో చానల్ లో చర్చా కార్యక్రమం పెట్టి మందు పనికి రానిదని తేల్చేసారు.కానీ అదే చానల్ కు సంభందించి పత్రికలో మాత్రం మందు కు సంభంధించిన ప్రకటన మొదటి పేజీ లో చూసి నేను ఆశ్చర్య పోయాను.ప్రకటనకు డబ్బులిస్తే ఏమైనా వేస్తారా ? ఇతరులకు నైతిక విలువలు భోదించే వరకేనా ?తమకు నైతికత అక్కరలేదా?ఇటువంటి వాటి వలెనే పత్రికలు విశ్వసనీయత కోల్పోయాయి.

14, మే 2011, శనివారం

మీసాలు తెగి పడ్డాయి,తొడలు బొబ్బలెక్కాయి.

మీసాలు తెగిపడ్డాయి.తొడలు బొబ్బలెక్కాయి.అధికార ,ప్రతిపక్షాలు కుమ్మక్కై ముప్పేట దాడి చేసినా వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్స్ పార్టీ కడప ,పులివెందుల ఉప ఎన్నికలలో భారీ మెజార్టీ తో బోణీ కొట్టింది.జగన్ పేరుతో మరియు విజయమ్మ పేరుతో పదిమంది చేత నామినేషన్లు వేయించి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వై.ఎస్.ఆర్. పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా బైండోవర్ కేసులు పెట్టించి ,విచ్చల విడిగా డబ్బులు పంచి ,గెలవడానికి అధికార పార్టీ చేయని కుట్ర అంటూ ఏమీ లేదు.అయినా కూడా కడప వోటర్లు వాళ్ళ ప్రలోభాలకు లొంగ కుండా విశ్వసనీయతలో రాజశేఖర రెడ్డి గారి వారసులమని మరోసారి చాటి చెప్పారు.అధికార ,ప్రతిపక్షాలు ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది.అపజయాన్ని ఇప్పటికైనా హుందా గా ఒప్పుకుంటే ప్రజలు వాళ్ళను మన్నిస్తారు.

1, మే 2011, ఆదివారం

మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్లు....

మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ,మరియు ఇప్పుడు జరుగుతున్న కడప,పులివెందుల ఉప ఎన్నికలల్లో ప్రచారానికి వెళ్ళిన బాలకృష్ణ,చిరంజీవి మరియు ఇప్పుడు నిల్చున్న తెలుగుదేశం అభ్యర్థి తొడగొట్టి ,మీసాలు తిప్పి తమ కున్న ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.రాజశేఖర రెడ్డి గానీ,జగన్ గానీ ఎప్పుడూ తొడగొట్టి మీసాలు మెలేయలేదు.ఎవరు ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళో,దీన్ని బట్టి అర్థం అవుతున్నది, .కానీ తెలుగుదేశం నాయకులు మరియు ఇతర ప్రతిపక్షం వాళ్ళు రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఫ్యాక్షన్ కుటుంబంగా ముద్ర వేసి గోబెల్స్ ప్రచారం చేసారు.అందుకే ప్రజలు వీళ్ళ ప్రచారాన్ని ఎవరూ నమ్మకుండా వై.ఎస్. నాయకత్వాన్ని రెండు సార్లు బలపరిచారు.ఇది ఎలాగుందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి నట్లుంది.ఇప్పటికైనా ప్రతిపక్షం వాళ్ళు గోబెల్స్ ప్రచారం మానుకుంటే మంచిది.

24, ఏప్రిల్ 2011, ఆదివారం

నడిచే దైవం నడక ఆగింది.

రాయలసీమలోని అత్యంత వెనుకబడిన జిల్లాలో పుట్టి లక్షలాది ప్రజలు చేత భగవంతుని స్వరూపంగా కీర్తింపబడి ఒక చరిత్ర సృష్టించిన సత్యసాయిబాబా గారు పరమ పదించారు.ఆయన మీద వచ్చిన విమర్శలను పక్కన పెడితే ఆయన చేసిన సేవలు మాత్రం మరువలేనివి.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ...

5, ఏప్రిల్ 2011, మంగళవారం

ఇదేమి నైతికత ?

నిన్న మొన్నటి వరకు వై.ఎస్. ఫోటో వలన తాము గెలవలేదని కేవలం సోనియా గాంధి ఫోటో వలన మాత్రమే గెలిచామని ప్రగల్బాలు పలికి ,అధికార మరియు పార్టీ కార్యక్రమాల్లో కూడా వై.ఎస్ . ఫోటో పెట్టకుండా చేసి ప్రజల మనస్సుల్లో నుండి ఆయనను తీసి వేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్స్ పార్టీ నాయకులు రోజు కడప ,పులివెందుల ఉప ఎన్నికల కోసం వై.ఎస్. తమ వాడే అంటున్నారు.వై.ఎస్. ను కాంగ్రెస్స్ వాళ్ళే తిట్టినప్పుడు కూడా పార్టీ వాళ్ళు ఏమీ అన లేదు.అటువంటి వాళ్ళు జగన్ పార్టీ జెండా లో వై.ఎస్. ఫోటో పెట్టకూడదు అని అంటున్నారు.ఇది ఏమి నైతికత .ప్రజలు అసహ్యించుకుంటారని కూడా లేకుండా మొన్న ఎం.ఎల్.సి.ఎన్నికలలో జగన్ ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకొని ,అధికార దుర్వినియోగం చేసినారు .అయినా కూడా జగన్ వర్గం మూడు స్థానాలు గెలుచుకుంది.వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కడప,పులివెందుల స్థానాలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపించడానికి ప్రజలు సిద్దపడి ఉన్నారు.

12, మార్చి 2011, శనివారం

"కాంగ్రెస్స్" అనే పదం కాంగ్రెస్స్ పార్టీ సొత్తు ఏ మాత్రం కాదు.

జగన్ గారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ జెండా ను ఆవిష్కరించినారు.కానీ పార్టీ పేరు మీద కొంత మంది కాంగ్రెస్స్ వాళ్ళు తప్పు పడుతున్నారు.వాళ్ళ అభ్యంతరమంతా కాంగ్రెస్స్ అనే పదం మీదే.కానీ "కాంగ్రెస్స్" అంటే డిక్షనరీ అర్థం "ఫార్మల్ మీటింగ్" అని.కావున కాంగ్రెస్స్ అనే పదం కాంగ్రెస్స్ పార్టీ సొత్తు మాత్రం కాదు.దీన్ని విమర్శలు చేస్తున్న నాయకులు గుర్తించాలి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికలలో బోణీ కొట్టి ,తర్వాత జరిగే శాసన సభ,పార్లమెంట్ ఎన్నికలలో ఘనవిజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.

11, మార్చి 2011, శుక్రవారం

తెలుగుతల్లి కంట మరొక సారి కన్నీరొలికింది.

తెలుగు జాతి మరొక సారి అవమానాల పాలైంది.ఆఫ్గనిస్తాన్ లోని బమియాన్ బుద్ద విగ్రహాల కూల్చివేత కు ఏమాత్రం తీసిపోకుండా టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి సాంస్కృతిక సంపదకు మరియు పౌరుషానికి ప్రతీకలైన మహాపురుషుల విగ్రహాలను పనిగట్టుకొని ధ్వంసం చేసారు. దృశ్యం చూసిన నిజమైన ప్రతి తెలుగువాడి గుండె మండి పోయింది.ఇది ముందే ప్రణాళిక ప్రకారం చేసినట్లుంది. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?ఉంటే ఏం చేస్తుంది..ఇటువంటి పని చేసిన ముష్కరులను కఠినంగా శిక్షించి మహాత్ముల విగ్రహాలను తిరిగి పునరుద్దరించాలి.

1, మార్చి 2011, మంగళవారం

ఏ ప్రజల కోసం .........

ప్రజల చేత ,ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని మనం ఘనంగా చెప్పుకుంటున్న మన ప్రభుత్వాలు నిజంగా సామాన్య ప్రజల కోసం పని చేస్తున్నాయా ?సామాన్య ప్రజలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు గౌరవంగా కూలో,కుల వృత్తులో ,వ్యవసాయమో చేసుకొని బ్రతుకుతున్నారు.దాన్ని కూడా ప్రభుత్వాలు చేసుకోనీయడం లేదు. వాళ శ్రీకాకుళంలో థర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సంఘటన లో కొందరు సామాన్యులు మృతి చెందినారు.వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు.కేవలం తమ బతుకులను తమను గౌరవంగా బతక నీయమని కోరుతున్నారు.సామాన్యుల కనీస అవసరాలైన కూడు ,గుడ్డ, నీడ,విద్య,వైద్యం లు కల్పించడం లో ప్రభుత్వాలు విఫల మైనాయి. ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయో ఒక సారి పరిశీలించు కోవాలి.మెజారిటీ ప్రజల ప్రయోజనాలు విస్మరించి ,కొద్దిమంది పెట్టుబడి దారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేస్తే ప్రజాస్వామ్యానికి పరమార్థమే ఉండదు.

26, ఫిబ్రవరి 2011, శనివారం

కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజు...

చాలా రోజుల తర్వాత వర్మ గారి సినిమా కు వెళ్లాను. కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం అప్పలరాజు సినిమాను మధ్యనే మార్నింగ్ షో కి వెళ్లి చూశాను.థియేటర్ మొత్తానికి పది మంది ఉన్నారు.ఒక డైరెక్టర్ తను తీయాలనుకునే విధంగా సినిమాను తీయలేని నిస్సహాయ స్థితిని వర్మ గారు చాలా బాగా చూపించారు.సమకాలీన సినీ పరిశ్రమ మీద సినిమా ఒక మంచి సెటైర్.

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

తెలంగాణా వాదుల దాడులనుండి రక్షణ కు ఒక మార్గం.

హైదరాబాదు లో ఉన్న మార్వాడీలు,హిందీ వాళ్ళు ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు బాగానే ఉన్నారు .కానీ సీమామ్ధ్ర ప్రజలు మాత్రం దాడులకు గురవుతామని బాధ పడుతున్నారు.వీళ్ళు కూడా ఇటువంటి భయాల నుండి దూరం కావడానికి తెలుగు భాష మాట్లాడడం మానుకొని 'ఎం చాట ' లాంటి అలీ గారు చెప్పిన కొత్త భాషను సృష్టించు కొని మాట్లాడడం ప్రారంభించాలి.అప్పుడు వాళ్ళు ప్రాంతం వారో తెలుసు కోవడం తెలంగాణా వాళ్లకు కష్టం అవుతుంది.ఒక కొత్త భాషను సృష్టించిన క్రెడిట్ దక్కుతుంది మరియు దాడుల నుండి కూడా రక్షణ పొంద వచ్చు. విధంగా తెలంగాణా వాదులు ఒక కొత్త భాష పుట్టుక కు కారణ మవుతారు.వారికి ధన్య వాదాలు.

17, ఫిబ్రవరి 2011, గురువారం

జే.పి.గారి పై దాడి ప్రజాస్వామ్యం పై దాడి.

జే.పి. గారి మీద దాడిని ప్రజాస్వామ్యం మీద దాడి గా పరిగణించాలి.దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించి వారిని రాజకీయాలలో పాల్గొనకుండా నిషేధించాలి.ఇప్పుడు రాష్ట్రం లో పరిపాలన స్తంభించి అన్ని వ్యవస్థలు నిర్విర్యమై పోయినాయి.రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే టి.ఆర్.ఎస్. వాళ్ళు జే.పి. పై దాడికి ధైర్యం చేసే వారా? ఇప్పుడు రాష్ట్రంలో చేతగాని వాళ్ళ పాలన నడుస్తా ఉంది.ముఖ్యంగా టి.ఆర్.ఎస్. వాళ్లకు ఇప్పుడే తెలంగాణా రావడం ఇష్టం లేదు.వాళ్ళు బలపడి మిగతా పార్టీలు బలహీనము ఐన తర్వాత మాత్రమే తెలంగాణా రావాలని కోరుకుంటున్నారు.దాని కే ఇటువంటి అప్రజాస్వామిక పనులకు పాల్పడుతున్నారు.తెలంగాణా వస్తే ఇటువంటి ఫ్యూడలిస్టుల చేతుల్లోకి పరిపాలన వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు కోవచ్చు.జే.పి. గారు ఇటువంటి వాటికి భయపడకుండా ధైర్యంగా రాజకీయాలలో ముందుకు వెళ్లి సమాజంలో ఇటువంటి అనైతిక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలి.జే.పి. గారి పై దాడిని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి.

12, ఫిబ్రవరి 2011, శనివారం

టి.డి.పి. పార్టీ మరొక సారి విశ్వసనీయత కోల్పోయింది.

జగన్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్స్ కు తెలుగు దేశానికి మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఇన్ని రోజులు కొంత మంది అంటూ ఉండే వాళ్ళు,ఇప్పుడు అది నిజమని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది.ఎందు కంటే వాళ టి.ఆర్.ఎస్. వాళ్ళు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతాము మద్దత్తు ఇవ్వమంటే టి.డి.పి వాళ్ళు వెనకడుగు వేస్తాఉన్నారు. వాళ టి.డి.పి వాళ్ళు ఒక వైపు ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదని ఊర్లు పట్టు కొని తిరుగు తున్నారు,మరొక వైపు అవిశ్వాస తీర్మానానికి మద్దత్తు ఇవ్వమని చెబుతున్నారు.ఒక వేళ అవిశ్వాసానికి మద్దత్తు ఇవ్వకుంటే ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పనైనా చెప్పాలి ,లేక పొతే ఊర్లలో వీళ్ళు చెప్పే నాటకాలను ప్రజలు ఎవరూ విశ్వసించరు.ఇటువంటి పనులు చేసి టి.డి.పి. మరియు వాళ్ళ అధినాయకుడు ప్రజలలో విశ్వసనీయత మరొక సారి పోగొట్టు కున్నారు .

6, ఫిబ్రవరి 2011, ఆదివారం

హోల్ సేల్ గా అమ్మేశారు

ఎలెక్షన్ల ముందు టిక్కెట్లను రీటైల్ గా అమ్ముకొని ,ఇప్పుడు పార్టీనే హోల్ సేల్ గా అమ్మేశారు.

1, ఫిబ్రవరి 2011, మంగళవారం

బాక్స్ బద్దలైంది..

చిరంజీవి తో పొత్తు విషయం తెలియగానే కాంగ్రెస్స్ నేత వెంకట స్వామి ఫైర్ అయ్యారు.నేరుగా అధినేత మీద నే విమర్శనాస్త్రాలు సంధించారు.ఆమెనే అధ్యక్ష పదవినుండి దిగిపోయి భారతీయునికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.కాంగ్రెస్స్ పార్టీ లో లుకలుకలు మొదలయ్యాయి.చివరికి అది మునిగి పోతుంది.జగన్ పార్టీ నే సరికొత్త పార్టీ గా అవతరిస్తుంది.

అమ్మయ్య ..భారాన్ని దింపేసు కుంటున్నాను..

ఏదో ప్రజలను ఉద్దరిస్తానని సినిమా డైలాగులు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసిన చిరంజీవిని ఆంధ్ర ప్రదేశ్ తెలివైన ప్రజలు ఆయన్ను పద్దెనిమిది సీట్లకు మాత్రం పరిమితం చేసారు.ఆయనతో పాటు ఉన్న మేధావులంతా ఈయన వ్యవహారం నచ్చక ఎప్పుడో వెళ్లి పోయారు.ఆయన వ్యక్తిత్వాన్ని మన రాష్ట్ర ప్రజలు చాలా బాగా అంచనా వేసారు.అందుకే అధికారానికి దూరంగా పెట్టినారు.ఆయన కు పార్టీ భారంగా పరిణమించింది.ఎప్పుడె పుడు కాంగ్రెస్ లో విలీనం చేయాలని మునిగాళ్ళ మీద నిలబడి ఉన్నాడు.వాళ్ళు అడిగినా అడగక పోయినా మద్దత్తు ఇస్తానని చెబుతున్నాడు.ఈయన మన రాష్ట్రం లో ఇంకొక విశ్వసనీయత లేని నాయకుడిగా మిగిలి పోయారు.చివరకి భారాన్ని దింపుకుంటున్నారు .తమ స్వార్థ ప్రయోజనాల కోసం దినం ఒక మాట మాట్లాడే ఇటువంటి అవకాశవాదులని ప్రజలు జాగ్రత్తగా గమనించి అవకాశం వచ్చినపుడు తగిన బుద్ది చెబుతారు.

29, జనవరి 2011, శనివారం

జగన్ రాజశేఖరరెడ్డి గారి లాగే చరిత్ర సృష్టిస్తాడు.

చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది.ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖరరెడ్డి గారి కి ఉన్న జనాదరణ ను చూసి కొన్ని మీడియా సంస్థలు ,కొన్ని పార్టీల పెద్దలు ఆయన్ను ఫ్యాక్షనిస్టు అని రాష్ట్రం లో ఏం జరిగినా ఆయనకే ఆపాదిస్తూ ఆయన్ను ప్రజల మనస్సులలో నుండి దూరం చేయాలని నానా ప్రయత్నాలు చేసినా , ఎవరెన్ని కుట్రలు పన్నినా ఒక ధీరుని వలె ఒంటి చేత్తో పార్టీ ని అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించి ప్రజల మనస్సులలో ఒక దేవుని వలె నిలిచి పోయినాడు.ఆయన ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు, మీడియా సంస్థలకు వంగి వంగి సలాములు చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేసికొని పరిపాలన సాగించ లేదు.ప్రత్యర్థులు సైతం పొగిడే విధంగా పరిపాలన సాగించారు.ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన మీడియా సంస్థల ,మరియు ప్రతిపక్ష నేతల మరియు అధికార పక్షం లోని ఆయన వ్యతిరేకుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం లో పడేసారు.
వాళ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఆయన్ను అడ్డుకోవడానికి అన్ని పార్టీ లు చాలా మీడియా సంస్థలు ఏకం అయ్యాయి.కొన్ని మీడియా లో ప్రశ్నార్థక చిహ్నం(?) పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేసిందే చేస్తున్నారు.ఇలా చేసి వాళ్ళ విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలా విష ప్రచారం చేసి ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని నవ్వుల పాలయ్యాయి.ఇలా ఎన్ని చేసినా ప్రజల మనస్సులలో నుండి రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్ ను తీసి వేయలేరు.ఎప్పటికైనా వాళ్ళ నాన్న గారి లాగే జగన్ కూడా ఇవన్నీ చేదించుకొని బయట పడి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు.