11, జనవరి 2010, సోమవారం

"అదుర్స్" సినిమాను అడ్డుకుంటా మనడం అప్రజాస్వామికం

రోజు సాయంత్రం సాక్షి టి.వి. లో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత గారి (కే.సి.ఆర్ గారి కుమార్తె) మాటలు విన్న తర్వాత పోస్ట్ వ్రాయకుండా ఉండలేక పోయాను."అదుర్స్" సినిమాను ఆంధ్ర వాళ్ళు నిర్మించి నటించారు కాబట్టి సినిమాను తెలంగాణాలో అడ్డుకుంటామంటున్నారు. సినిమా నిర్మాత లగడపాటి నిరాహారదీక్ష శిబిరంలో కూర్చున్నారని ఒక సాకు చెబుతున్నారు.తెలంగాణా వాళ్ళు వాళ్ళ వాదాన్ని ఎంత బలంగా వినిపిస్తున్నారోఆంధ్రా వాళ్ళు కూడా వాళ్ళ వాదాన్నిఅంతే బలంగా వినిపించే హక్కు ఉంది.దీన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరు.ఆంధ్రా వాళ్ళు వీళ్ళాలాగ వేర్పాటు వాదం వినిపించడం లేదు.అందరం సమైఖ్యంగా ఉందాం అంటున్నారు. ప్రజాస్వామ్య దేశం లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ భావాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రకటించవచ్చు.తెలంగాణా సమస్య కే.సి.ఆర్.కుటుంబ సమస్య మాత్రం కాదు.అందరూ తెలంగాణా వాళ్లకు నచ్చినట్లు మాత్రమే మాట్లాడాలి,అనుకూలంగా మాట్లాడక పోతే అడ్డుకుంటా మంటే కుదరదు. విషయం చూస్తే తెలుస్తున్నది ,తెలంగాణా ఉద్యమం లో ఎంత మేర ప్రజాస్వామ్యం ఉందో.వీళ్ళంతా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.ఇటువంటి ఉద్యమ కారుల వలన వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మాత్రం మన జాలదు,నిరంకుశత్వం లోకి జారుకుంటుంది.సామాన్య ప్రజలు వీళ్ళఉక్కు కౌగిళ్ళలో నలిగి పోవలసి వస్తుంది.ఇటువంటి అప్రజాస్వామిక,నియంతృత్వ,బ్లాక్మెయిల్ రాజకీయాలను , ఉద్యమాలను,ఉద్యమ కారులను నిజమైన ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి .

8, జనవరి 2010, శుక్రవారం

అంబానీల,రామోజీల ఆస్తులు ధ్వంసం అయినప్పుడు మాత్రమే చంద్రబాబు గారు స్పందిస్తారా?

గత నెల రోజులుగా అటు సమైఖ్యాంధ్ర ఉద్యమం ,ఇటు తెలంగాణా ఉద్యమం లో ప్రభుత్వ,ప్రజల ఆస్తులు ఎన్నో ధ్వంసం అవుతున్నా , ఉద్యమాలతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా మీడియాకు,ప్రజలకు ముఖం చాటేసిన చంద్రబాబు గారు ,నిన్న రిలయన్స్ వారి ఆస్తులు ధ్వంసం అయినాయని తెలిసి రోజు మీడియా ముందుకు వచ్చిఖండనలు ఇస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు గారికి రిలయన్స్ వారి ఆస్తులు,రామోజీ గారి ఆస్తులు,తన మరియు తన వాళ్ళ ఆస్తులు మాత్రం బాగుంటే సరి ,ప్రజల,ప్రభుత్వాల ఆస్తులు ఏమై పోయినా పరవాలేదని అనిపిస్తుంది.నెల రోజులుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా ఒక్క రోజు కూడా ఆయన ఖండనలు ఇవ్వలేదు.దీన్నిబట్టి చూస్తే అర్థం అవుతుంది ,చంద్రబాబు గారు పెట్టుబడి దారులకు మాత్రమే కొమ్ముకాసే వ్యక్తి అని ,సామాన్య ప్రజల గోడు మాత్రం పట్టించుకోడని .ఇటువంటి భాధ్యతా రాహిత్యమైన ,అవకాశవాద ,స్వార్థపరమైన రాజకీయనాయకులు ఉండబట్టే వాళ మన రాష్ట్రం పరిస్థితులలోకి నెట్టి వేయబడినది.

3, జనవరి 2010, ఆదివారం

పాఠ్య పుస్తకాలు కూడా తెలంగాణా మాండలికంలో ఉండాలా?

మధ్యన తెలంగాణా వాదులు వాళ్ళ భాషను సినిమాలలో విలన్ల మరియు కమేడియన్ల చేత మాట్లాడిస్తున్నారని ,హీరోలచేత మాట్లాడించలేదని ఆరోపణలు చేస్తున్నారు.సినిమా వాళ్ళు ఏదో ఒక మాండలికాన్ని ప్రామాణికం చేసుకొని మాట్లాడిస్తుంటారు.అలాగే కొన్ని రోజుల వరకూ ఫ్యాక్షన్ సినిమాల నేపథ్యంలో రాయలసీమ మాండలికాన్నివాడారు.సినిమా వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం వినోదాన్ని ప్రేక్షకులకు పంచడమే. ఇలా ప్రతి దానిలో సెంటిమెంటు నురెచ్చకొట్టడం సరి కాదు. ఇవాళ తెలంగాణా సినీ రచయతలు వ్రాసే పాటలు కూడా తెలంగాణా మాండలికంలో లేవు.దీనికితెలంగాణా వాదులు ఏమంటారో ? అలా అనుకుంటూ పోతే చివరికి పాఠ్య పుస్తకాలలో కూడా తెలంగాణా మాండలికాన్నిప్రవేశ పెట్టాలని డిమాండ్ రావచ్చు.