26, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ఏడు కేజీలకు మూడు కేజీలు ఉచితం

ఈ మధ్యన కొవ్వు తగ్గిస్తామని పేపర్ లో బాగా ప్రకటనలు వస్తున్నాయి. విపరీతంగా తిని బరువు పెరిగి వాటి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి ,తిరిగి డబ్బులిచ్చి బరువు తగ్గించు కుంటున్నారు.
ఆ ప్రకటనలలో డిస్కౌంట్ స్కీములు కూడా ఉన్నాయి.ఎలాగంటే ఉదాహరణకు ఏడు కేజీలకు మూడు కేజీలు ఉచితం అని.

ప్రపంచ జనాభా లో ఒక పూట భోజనానికి లేని వాళ్లు ఎందరో ఉన్నారు.కావున అనవసర తిండి తగ్గిస్తే రెండు విధాలు గా ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళం అవుతాము.ఒకటి వృధా ధాన్యం ఖర్చు మరియు డబ్బు పొదుపు .

20, సెప్టెంబర్ 2008, శనివారం

ఈ మధ్యన ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలుతున్నాయి.ప్రజలు భగవంతుని మీద భారం వేసి బ్రతకవలసి వస్తుంది.ప్రజల ఆస్తి, ప్రాణాలకు రక్షణ ఇవ్వవలసిన భాద్యత ప్రభుత్వాలకు ఉంది.కుల మతాలకు అతీతంగా నిజమైన లౌకిక వాదులుగా రాజకీయనాయకులు మారి ,నేరస్తులను కఠినంగా శిక్షించాలి.నేరస్తులు ఏ మతస్తులైనా వోటు బ్యాంకు రాజకీయాలు మాని శిక్షించాలి.లేకపోతే రాజకీయపార్టీలు మెజారిటీ భారతీయుల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

16, సెప్టెంబర్ 2008, మంగళవారం

చిరంజీవి గారు పార్టి పెట్టినారు .సంతోషం.ఆయన మార్పు కోసం వచ్చానని చెబుతున్నారు.కాని ఆయన మిగతా పార్టీ లకు చెందిన వారిని చేర్చు కుంటున్నారు.కొత్త పార్టీ ,కొత్త మరియు మంచివాళ్ళతో ప్రారంభిస్తే ప్రజలకు ఏదో మేలు చేస్తారని అనుకోవచ్చు.కానీ ఆయన వాలకం చూస్తుంటే మిగతా పార్టీ లకు ఆయన పార్టీ కి ఏమీ తేడా కనిపించడంలేదు.ఆయన కూడా అధికారమే పరమావధిగా వస్తున్నారనిపిస్తుంది.జయప్రకాష్ నారాయణ గారి లోకసత్తా లాగ నిజంగా మార్పును కాంక్షించే వారిని పార్టీ లోకి తీసుకుమ్తారనుకున్నాం.చిరంజీవి గారు నిజాయితీ పరులయిన వ్యక్తులను రాజకీయాల్లో కి తీసుకొని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసి సమాజంలో మార్పును తీసుకోనిరావాలని కోరుకుంటున్నాను.

5, మార్చి 2008, బుధవారం

నయా కుబేరులు

నేను ఈ మధ్య షాపింగ్ చేసి అక్కడే ఉన్నచెరుకు రసం షాప్ కు వెళ్ళాను.చెరుకు రసం తాగుదామని టోకెన్ తీసుకొన్నాను.రకరకాల రుచులలో అక్కడ చెరుకు రసం దొరుకుతుంది.దాని విలువ పది రూపాయలు . షాప్ ఒక్క ఈగ కూడా లేకుండా చాలా శుబ్రంగా ఉంది.రసం త్రాగుతూ అక్కడే నిల్చున్నాను.అంతలో ఒక నవ నాగరిక యువతి (?) అక్కడికి వచ్చి ఎంత అని ఇంగ్లిషు లో అడిగింది.షాపతను పది రూపాయలు అని చెప్పాడు.అప్పుడు ఆ యువతి దట్సాల్ అని ఆశ్చర్యంగా అంది .

ఇటువంటి వాళ్లు ఈమధ్య ఎక్కువయ్యారు.ఒక వైపు ద్రవ్యోల్బణం ఎక్కువవుతుందని ప్రభుత్వం గోల పెడుతుంటే ,వీళ్ళు వస్తువు ధరను అమాంతం పెంచేస్తున్నారు .ఆ అమ్మాయి అదే రసం వంద రూపాయలు అంటే చాలా ఆనందంగా త్రాగుతుంది.తిరిగీ ఆ అమ్మాయి ఆ రసం షాపు వైపు రాకపోవచ్చు .ఎందుకంటే వస్తువు విలువ ఎంత ఎక్కువ వుంటే అంత మంచిదనే అభిప్రాయం తో వున్నారు.

ఇటువంటి వాళ్ల వల్లనే స్కూలు ఫీజులు ,వైద్యం ,ఇంటి స్థలాల విలువలు అమాంతం పెరిగినాయి.ఇటువంటి నయా కుబేరులు కళ్లు భూమి మీద పెట్టుకొని నడిస్తే అందరికి మంచిది.

పేద,మధ్యతరగతి వాళ్ళను కూడా భూమ్మీద కొన్నాళ్ళు బ్రతికేందుకు అవకాశం ఇద్దాం..