29, జనవరి 2011, శనివారం

జగన్ రాజశేఖరరెడ్డి గారి లాగే చరిత్ర సృష్టిస్తాడు.

చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది.ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖరరెడ్డి గారి కి ఉన్న జనాదరణ ను చూసి కొన్ని మీడియా సంస్థలు ,కొన్ని పార్టీల పెద్దలు ఆయన్ను ఫ్యాక్షనిస్టు అని రాష్ట్రం లో ఏం జరిగినా ఆయనకే ఆపాదిస్తూ ఆయన్ను ప్రజల మనస్సులలో నుండి దూరం చేయాలని నానా ప్రయత్నాలు చేసినా , ఎవరెన్ని కుట్రలు పన్నినా ఒక ధీరుని వలె ఒంటి చేత్తో పార్టీ ని అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించి ప్రజల మనస్సులలో ఒక దేవుని వలె నిలిచి పోయినాడు.ఆయన ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు, మీడియా సంస్థలకు వంగి వంగి సలాములు చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేసికొని పరిపాలన సాగించ లేదు.ప్రత్యర్థులు సైతం పొగిడే విధంగా పరిపాలన సాగించారు.ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన మీడియా సంస్థల ,మరియు ప్రతిపక్ష నేతల మరియు అధికార పక్షం లోని ఆయన వ్యతిరేకుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం లో పడేసారు.
వాళ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఆయన్ను అడ్డుకోవడానికి అన్ని పార్టీ లు చాలా మీడియా సంస్థలు ఏకం అయ్యాయి.కొన్ని మీడియా లో ప్రశ్నార్థక చిహ్నం(?) పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేసిందే చేస్తున్నారు.ఇలా చేసి వాళ్ళ విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలా విష ప్రచారం చేసి ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని నవ్వుల పాలయ్యాయి.ఇలా ఎన్ని చేసినా ప్రజల మనస్సులలో నుండి రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్ ను తీసి వేయలేరు.ఎప్పటికైనా వాళ్ళ నాన్న గారి లాగే జగన్ కూడా ఇవన్నీ చేదించుకొని బయట పడి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు.

17 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

meelantivaarunte ayana tappaka saadhisttaadu

Praveen Mandangi చెప్పారు...

ఈ లింక్ చదువు నాయన: http://stalin-mao.net.in/39541912

అజ్ఞాత చెప్పారు...

Meelanti chaduvukunna murkapu medhavule support unte elanti vallu PM kud try cheyyochu , me peru reddy ane oka thoka lekapote e story ni rase vallu kademo

asha చెప్పారు...

ఏం సార్, మీరు చదువుకున్నతనే కదా! మీకు అర్ధం కాదా? కోర్టు కూడా ఊరికనే అతనికి ఉత్తర్వులు జారీ చేసిందంటారా?

ఒకప్పుడు మీలాంటోళ్ళని చూస్తే జాలి వేసేది. కానీ ఈరోజున అసహ్యం కలుగుతుంది. ఏమిటండి రాజశేఖర్ రెడ్డి చేసిన నిర్వాకం? ఆదాయపు పన్ను 11 లక్షల నుండి 84 కోట్లు కట్టేంత ఆస్తులు పెంచుకోవడమేనా? అవి మన ఖజానా నుండి వెళ్ళినవని మీకు తెలీదా? జనాన్ని నమ్మించి, వంచించినవాడు మీ దృష్టిలో గోప్ప నాయకుడు.

ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించంది. ఎవరి వరకో అక్కర్లేదు. మన రైతులు నిర్దాక్షిణ్యంగా ఆత్మ హత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. వాళ్ళకివ్వడానికి డబ్బు లేదని చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కాదు కదా ఉన్నది అని అమాయకంగా వాదించకంది. ఖజానా ఖాలీ అయిపోయింది. డబ్బులేక చనిపోవటం అంటే మీకు తెలుసా? కానీ ఆ పేదోల్లకు తెలుసు. వాళ్ళకు తరతరాలకు ఉపయోగపడే ఒక్క పని చేశాడా? కంటితుడుపు చర్యగా పెన్షన్లు ఇవ్వడం తప్ప. ఈ రోజు అవినీతి మీ జీవితాన్ని బలి తీసుకోకపోవచ్చు. రేపు మిమ్మల్ని కూడా తీసుకుంటే తెలుస్తుంది.

ఈ బానిసత్వ మనస్తత్వం నుండి బయటపడండి. ఎంతో మంది నిస్సహాయుల గురించి ఆలోచించండి.ఓదార్పు యాత్రల్లో ఎవరికైనా ఒక పైసా ఇస్తున్నాడా? వాళ్ళవే కదా ఆ డబ్బులు. దేవుడి మనకి బుద్దినిచ్చింది ఉపయోగించడానికే. ఉపయోగించండి.

మయూఖ చెప్పారు...

ఆశ గారు మరియు మిగతా పెద్దమనుష్యుల కు మీ వ్యాఖ్యలకు ధన్యవాదములు.ఇప్పుడువున్న రాజకీయనాయకులలో నిజాయతీ పరులు ఎవరో చెబుతారా.మీడియాలలో ఉన్న వారిలో ఎవరు నిజాయతీ పరులో చెబుతారా .వాళ్ళే ఒక వైపు కళ్ళకు కట్టినట్లు చట్ట పరిధిని అతిక్రమించి ,స్వంత బంధువులను వంచించి ఎదిగి వాళ్ళేదో నిజాయితీ పరులలాగా పరుల మీద నిందలు వేయడం బావుందంటారా? ముందున్న ప్రభుత్వం వాళ్ళు ఒకటైనా శాశ్వత పథకం చేపట్టారా?ఇంకుడు గుంతల లాంటి పథకాలు చేపట్టి ప్రజల డబ్బులు నాశనం చేయలేదా?కేవలం మీడియా మీద ఆధార పడి పరిపాలన సాగించలేదా?ప్రజల కోసం మనస్పూర్తిగా ఒక రోజైనా పరిపాలన సాగించారా?రైతుల గురించి ఒక్క రోజైనా ఆలోచించారా?అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయలేదా?అన్నింటినీ ప్రైవేట్ బాట పట్టించలేదా?ఎక్కడో అమెరికాలో కూర్చొని అంచనా వేయడం కాదు ,ఒక సారి క్షేత్ర స్థాయిలో కి వచ్హి పల్లెల్లోకి వచ్హి రాజశేఖర రెడ్డి గారి పాలన సమయం లో మరి యు ముదున్న ప్రభుత్వాల సమయంలో ప్రజలను తేడా అడిగితే తెలుస్తుంది. కేవలం రాజశేఖర రెడ్డి గారు వచ్హిన తర్వాతనే ఎలెక్షన్ మానిఫెస్టో కు పవిత్రత వచ్హింది.అంతకు ముందు అధికారమే పరమావధిగా మానిఫెస్టో లో వట్టి డ్రామాలు వినిపించే వాళ్ళు,అవి మాత్రం అమలుకు నోచుకునేవి కావు.ఎన్నికలముందు తిరిగి డ్రామాలు వినిపింఛి ఎలాగోలా అధికారాన్ని ఎక్కేవారు.రాజకీయ నాయకుల్లో విశ్వసనీయత అనే పదం ఉందని తెలిపింది ఒక్క రాజశేఖరరెడ్డి గారే.ఆయన వచ్హిన తర్వాతనే ఆ పదం ఒకటి ఉందనేది రాజకీయనాయకులకు తెలిసింది.ప్రజలమీద ఎంత అభిమానం లేక పోతే ఆరోగ్యశ్రీ ,ఫీజు రీఎంబర్సుమెంటు పథకాల్లాంటివి ఆలోచిస్తారు.ముందున్న పాలకులకు ఆ ఆలోచన ఎందుకు రాలేదు.కావున కులం లాంటి సంకుచిత మనస్తత్వాల నుండి బయట పడి ఆలోచన చేస్తే నిజాలు తెలుస్తాయి.మనలను మనం మోసం చేసుకోకూడదు.ముందున్న పాలకులు దాడికి గురైన తర్వాత ఆ సానుభూతిని పొంది ఎలెక్షన్లలో గెలవాలని విఫల యత్నం చేసారు.కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఏ జిమ్మిక్కులు చేయకుండా మొన్నటి ఎన్నికలలో ముందు చేసిన మేలు చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా ఒంటి చేత్తో గెలిపించు కొని వచ్హారు.దీన్ని బట్టే తెలుస్తుంది ,ప్రజల్లో ఎవరికి విశ్వసనీయత ఉందో తేలిపోయింది.

mirchbajji చెప్పారు...

Oh Sorry, '... laage charithra lo kalasipothaadu' ani chadivesaa... emanukokandi Reddy gaaroo...

మయూఖ చెప్పారు...

తెలుగు దేశం హయాంలో నక్సలిజాన్ని శాంతి భద్రత అంశం గానే పరిగణించి అణచివేయడానికి అప్పటి పాలకులు విపరీతంగా ప్రయత్నించి విఫలమై దానికే బలి కాబోయారు.కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం దాన్ని సామాజిక ఆర్థిక అంశంగానే పరిగణించి ప్రజలను ఆర్హికంగా బలపరచే ప్రయత్నం చేసి విజయవంత మైనారు.వివిధ అభివౄద్ది మరియు సంక్షేమ పథకాలు మొదలు పెట్టి ఇదు సంవత్సరాల వ్యవధి లోనే ప్రజలను నక్సలిజం వైపు మళ్ళకుండా చేసి విజయవంత మైనారు.అందువలనే నక్సలిజం సమస్య మన రాష్త్రం లో పూర్తిగా సమసి పోయింది.ఇదొక్క ఉదాహరణ చాలు ఎవరు ప్రజా రంజకంగా పరిపాలించారో.కొంచం తల ఉపయోగిస్తే తెలుస్తుంది.

మయూఖ చెప్పారు...

మిర్చి బజ్జి గారూ ఎవరైనా చరిత్రలో కలసి పోవలసిన వాళ్ళే.కానీ చరిత్రలో చెరిగి పోని ఒక పేజీ సౄష్టించుకోవాల.రాజశేఖరరెడ్డి గారు అమిత మైన ప్రజాభిమానం చూరగొని చరిత్రలో సువర్ణాక్షరాలతో ఒక పేజీ లిఖించుకున్నారు .ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న మీడియా వాళ్ళు మరియు ప్రతిపక్షం వాళ్లు వాళ్ళ మీద ఆరోపణలు వచ్హినప్పుడు ఒక రోజైనా వివరణ ఇచ్హుకున్నారా?కానీ జగన్ మాత్రం వాళ్ళు చేసే ప్రతి ఆరోపణకు సాక్షి లో దమ్ముగా వివరణ ఇస్తున్నారు.ఎప్పుడూ కోర్టులకెళ్ళి స్టే లు తెచ్హుకోలేదు. అదీ వై.ఎస్.కుటుంబానికి మరియు ఇతరులకు ఉన్న తేడా.

అజ్ఞాత చెప్పారు...

Reddy gaaru, manchi pani cestunnaaru. meeru telugudesaanni pogadandi.. entamandi egesukuntu vacchi kamentu taaro cudandi. kadaa aasa mirchibajji?

mirchbajji చెప్పారు...

naaku TDP, Sonia ante chiraaku. naaku PV Narasimha Rao, Vajpaye, Manmohan Singh laanti nisvaardhaparulaina Nayakulante ishtam. Mana Desam aardhikam gaa ee rakamaina sthithiku techchina PV Narasimha Rao, Manmhan Singh laanti vaallu jagan laagaa dochukoledu. Sonia, Jagan laanti vaalla valla ee desam bhrushtu pothondi. TDP vaallu venakesukunnaarani Jagan koodaa venakesukunte inka Jagan goppemundi. Chandra Baboo dochukuni, Jaganoo dochukuni... yemitidanthaa... ee roju Egypt... repu... ??? India koodaa Egypt avvaalaa...? ippude Jagan laanti vaallanu avoid chesthe polaa...

అజ్ఞాత చెప్పారు...

"కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం దాన్ని సామాజిక ఆర్థిక అంశంగానే పరిగణించి"

YSR partnered with "నక్సలిజం" and allowed them to loot the State. Earlier they were in forests and used blackmail as a tool to loot business people.

During YSR time, YSR allowed them to come into Cities and openly loot land and money. It was a unholy alliance between YSR and "నక్సలిజం".

"నక్సలస్" never attacked మిషనరి YSR and any కిరస్తాని మిషనరి in anywhere in India. The reason was "మిషనరి YSR" and "కిరస్తాని మిషనరిస్" funding "నక్సలిజం" and use it as a tool in ఆత్మ హరణ మిషనరి activities.

People know every thing. God Bless you soul.

asha చెప్పారు...

ఇక్కెడెవరో మేధావి చెప్పినట్టు టీ.డీ.పి గురించి కూడా వ్రాయండి. కాకపోతే ఇలాంటి గుడ్డి భజనతో కాదు.

సార్! నేను మీ పట్ల అంత తీవ్రంగా స్పందించడానికి కారణాలు లేకపోలేదు. మీకు బాధ కలిగుంటే క్షమించండి.

ఇప్పుడు మీ తర్కం గురించి మాట్లాడుకుందాం. ముందువాళ్ళెవరూ ఏదీ చెయ్యలేదు కనుక, ఇతను చెడు చేసినా మంచవుతుందా?

ఆరోగ్యశ్రీ వల్ల ప్రభుత్వాసుపత్రులు ఇంకా చెడిపోయాయి. రేపు జ్వరమన్నా ప్రైవేట్ ఆసుపత్రులకు పరిగెట్టాల్సి వస్తుంది. మీకు అదో కష్టం కాకపోవచ్చు. కానీ పేదోల్లకు అది కూడా కష్టమే. ముందోళ్ళు అన్నీ ప్రైవేట్ పరం చేశారని చెప్పిన మీరు, మనకు కనీస ఆరోగ్య భద్రత లేకుండా మెజారిటీ ప్రజలకు తరుచుగా వచ్చే వ్యాధులూ, వాటి వల్ల జరిగే నష్టం చూడకుండా, మైనారిటీ ప్రజలకు అరుదుగా వచ్చే జబ్బులకు డబ్బులంతా కేటాయించి, అది కూడా కార్పోరేట్ ఆసుపత్రులకు మరల్చుతుంటే మీకేమీ అనిపించడం లేదా? ప్రభుత్వాసుపత్రులకు ఇంక నిధులెక్కడుంటాయి?ఇలాగే కొనసాగితే వాటికి మనుగడ ఎలా ఉంటుంది?

ఇవి మీరెందుకు ఆలోచించలేదు -
--అతను ప్రభుత్వాసుపత్రులను ఎందుకు బలోపేతం చెయ్యలేదు?
--ఈ రోజు ఉన్నదంతా ఈ ఖరీదైన జబ్బులకు ఊడ్చిపెట్టడం వల్ల రేపు అవి బాగుపడతాయా?
--రేపు కోట్ల మంది పేదోల్లకు వచ్చే జబ్బులకు నివారణ కానీ, చికిత్స కానీ ఎలా కొనసాగుతుంది ప్రభుత్వాసుపత్రులు మూతపడితే

ఇది కేవలం జనాకర్షక పథకం. జనాలను పిచ్చివాళ్ళను చేసే పథకం. ఇది అమలు జరగటం వల్ల అతనికి ఏ విధంగానూ నష్టం లేదు.చాలా కొద్ది మందికి తప్ప లాభమూ లేదు. ఇది ఎవరైనా అమలు చెయ్యగలరు.

ఇందులో మీరు ఆ కొద్ది మందికీ వెళ్ళే సహాయాన్నే చూస్తున్నారు. కానీ ఇంతలా తనని నమ్మిన జనాన్ని ఇంత ఘోరంగా మోసం చెయ్యటం కన్నా దారుణం లేదు. తనను ఇంతలా నమ్మినందుకైనా "ఒక్క" మంచి పని చెయ్యాలనిపించలేదు అతనికి. రేపు వాళ్ళు ఎలా పోతే నాకేం అని ఈ దోచుకునే మార్గమే అవలంబించాడు.

asha చెప్పారు...

ఇదేం ఖర్మ సార్ మనకి?! ఎవ్వరూ నిజాయితీపరులు కాదు కాబట్టి, అతను కోట్లు తినేసినా పరవాలేదు. వాళ్ళందరూ అసత్య దాడులు చేస్తున్నారు కాబట్టి, అతను దోచుకున్నా దేవుడే. వాళ్ళు ఏ పథకమూ అమలు చెయ్యలేదు కనుక, ఇతను పిచ్చి పథకాలు అమలు చేసి ప్రజలకు అవసరమయ్యే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసినా దేవుడే. వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచించలేదు కాబట్టి, ఇతను మన భవిష్యత్తుని కుల్లబొడిచి, ఈ రోజు ప్రయోజనాలను తాత్కాలికంగా
నెరవేర్చినా పరవాలేదు.

మయూఖ చెప్పారు...

మిర్చి బజ్జి గారూ నరసిమ్హరావు గారి టైం లోనే యూరియా కుంభకోణాలు ,ఎం.పి.ల కొను గోలు కుంభకోణాలు బయట పడ్డాయి.
ఆశ గారు అరవై సంవత్సరాలనుండి ప్రభుత్వ ఆసుపత్రులు బాగు పడలేదు,అవి బాగు పడేంత వరకూ పేద వాడు వైద్యం చేయించు కోకూడదా?వాడు అలానే చని పోవాలా?ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు అందుతున్నాయి ,అయినా కూడా అక్కడ ఎవరూ పని చేయడం లేదు.ప్రభుత్వ ఆసుపత్రిలో నా అనుభవాన్ని ఒక పోస్ట్ లో వ్రాసాను,చదవండి.అంతకు ముందున్న ప్రభుత్వాల అస్తవ్యస్త పాలన వలన ప్రజలకు చావొక్కటే పరిష్కారంగా ఉండేది.వాటికి తక్షణ పరిష్కారాలుగా ఉచిత విద్యుత్,ఋణ మాఫీ ఉపయోగ పడ్డాయి.తర్వాత రైతులకు ఋణాలు ఉపయోగ పడ్డాయి.మనం కంపూటర్ల దగ్గర కూర్చొని వ్యాఖ్యలు చేయకూడదు.లబ్ది పొందిన ప్రజలను అడిగితే తెలుస్తుంది.నేను అవినీతిని ప్రోత్సహించలేదు.జగన్ చట్ట పరిధి లో వ్యాపారాలు చేసారు.ముఖ్యమంత్రి కొడుకు అయినంత మాత్రాన వ్యాపారాలు చేయకూడదా?అలా అయితే ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నమరియు ప్రపంచంలో నే కుబేరులమని చెప్పుకుంటున్న వాళ్ళంతా నైతికంగా వ్యాపారాలు చేసారనే నా మీ అభిప్రాయం? జగన్ మీద ఆరోపణలు వచ్హినప్పుడు ఆయన వివరణ ఇస్తున్నారు.ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద ఆరోపణ లు వచ్హినప్పుడు తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు.అక్కడే తేడా ఉంది.

asha చెప్పారు...

అయ్యా! నేనూ మీరు చెప్పిన మాటే చెప్తున్నాను. ఈరోజు కేన్సరో, గుండెజబ్బో ఉన్నవాళ్ళని రక్షించటం కోసం రేపు జ్వరంతోనైనా పేదోళ్ళు చచ్చిపోయే పరిస్థితి తీసుకురావొచ్చా? అతను నిజాయితీపరుడైతే ప్రభుత్వాసపత్రులను ఉద్దరించాలి. అంతేకానీ అక్కడేమీ జరగలేదని, ఆరోగ్యాన్ని కూడా ప్రైవేటీకరణ చెయ్యకూడదు.

మొన్నటికి మొన్న, సదరు మహానుభావుడు కొల్లగొట్టిన ఖజాన వల్ల ఏ విధమైన లబ్ది పొందలేక పదేపది రోజుల్లో 84 మంది రైతులు నిర్దాక్షిణ్యంగా చనిపోయారు.

రాజశేఖర్ రెడ్డి ముందోళ్ళకంటే ఎక్కువగా చంపలేదు అంటారేమో. మీకో పెద్ద నమస్కారం. అలా మాత్రం అనకండి.

mirchbajji చెప్పారు...

Urea dabbu PV jebu loki vellaledu, aayano balaheena pradhaani, kaani chaanakya neethi tho Soniya nu kooda edurkuntoo, jaagraththa gaa handle chesi paalana saaginchi India nu Manmohan saayam tho ee sthithi ku raavadaaniki apude punaadi vesaadu. PV chepattina samskaranalu amalu kaavaalante PV adhikaaram lo undaali kaabatti MP lanu konnaadu. idi chaanakya neethi lo bhaagam. thana svalaabham kosam chesindi kaadu. PV Manmohan nu desam kosam vjraayudham laa vaadaadu, kaani ipudu Sonia elaa vaaduthodo thelusthoone undi. Jagan ku kommulu raavadaaniki kaaranam Sonia ne..., YSR ilaa dochukuntaadane PV YSR nu dooram pettaadu. kaani Sonia...

రక్తచరిత్ర చెప్పారు...

దొందు దొందే.
తండ్రి శ.వాన్ని కాల్చకుండా సీఎం పదవి కోసం సంతకాలు పెట్టించుకునే పని లో ఉన్నాడు. తండ్రి తరహా లోనే గు.రిగింజ లాగా మాట్లాడుతాడు. తండ్రి కృష్ణ ట్రిబ్యునల్ లో సరిగా వాదించక రాష్ట్రానికి శాశ్వత అన్యాయం చేస్తే కొడుకు ఆ తప్పు ని కాంగ్రెస్ పార్టీ కి అంట కట్టి రాజకీయం చేస్తున్నాడు.

ఆ.సుపత్రులు, సొం.త భీ.మా కం.పెనీ కోసం ఆ.రోగ్య శ్రీ ప.ధకం పెట్టి, అ.దేదో ప్ర.జలకి మే.లు చే.సినట్లు చెప్పు.కుంటున్నారు. ఇప్పటి వరకు ఆ.రోగ్య శ్రీ మీద ఖ.ర్చు చేసిన దానిలో ప.ది శా.తం తో ప్ర.భుత్వ ఆ.సుపత్రులని సూ.పర్ స్పె.షాలిటి గా చె.య్యచ్చు.

రెండ ఎకరాల ఆసామి - రెండు వేల కోట్లు అని పక్కన వాడిని విమర్శిస్తూ, తను మాత్రం రెండు లక్షల ఆదాయ పన్ను నుంచి రెండు కోట్ల ఆదాయ పన్ను కి ఎదిగాడు. ప్ర్యత్యర్ది ని దెబ్బ తీయటానికి తండ్రి-బిడ్డ ల మధ్య చిచ్చు పెట్టటానికి వెనుకాడ లేదు (రామోజీ-సుమన్). అవసరం తీరాక అన్న-తమ్ముల మధ్య గొడవలు పెట్టించాడు (సంఘి కుటుంబం). ఇక కొడుకు విషయానికి వస్తే, సోనియా పాదాలు నాకిన తన తండ్రి కి మాత్రం ఆత్మా గౌరవం ఉన్నట్లు, అదే పని వేరే వాళ్ళు చేస్తే లేనట్లు. దొందు దొందే.

He is only appearing to have guts because he got nothing to lose at this point. It will take at least 15 years before he can become CM, provided Congress continues the blunders it is doing under Rahul Gandhi's planning.

ఎమార్ ఉదంతం లో ఏమి జరిగింది? చంద్ర బాబు వంద కోట్లు తింటే వీళ్ళు పది వేల కోట్లు తిన్నారు. అయినా మొదలు పెట్టింది చంద్ర బాబు అని వంక పెట్టి తప్పించుకొని తిరుగుతున్నారు. గాలి విచ్చలవిడి గా గనులు తవ్వుకోవటానికి సహాయం చేసి, గనులు లీజ్ ఇచ్చింది చంద్ర బాబు అని నెట్టేస్తున్నారు. వీళ్ళకి ఉన్నది రెండు నాలుకలు, పది తలలు.

CBN Fan:-ఏడుపుల పాయలో దీక్ష చేస్తే, ysr జగన్ ని పట్టుకుంటాడు పదవి కోసం తండ్రినే చంపుతావా అని..జగన్ కి ఇంక ఆ ఆలోచన రాలేదేమో.. లేఖ పోతే, వాళ్ళ నాన్న ఎముకలు ఎమన్నా దొరికితే, వాటిని మేడలో వేసుకుని వెళ్ళేవాడు ఓడర్ప్పులకి, దీక్షలకి

Jagan Fan:- బాబు నువ్వు NTR సమాధి దగ్గరా చెయ్యాలి ధర్నా. నీ మాదిరా జగన్ సింగపూరే పెట్టలేదు డబ్బులు. దొంగ వెధవ, నీకు బుద్ధి రాదురా బొల్లి నాయాలా!

bokkalu vethakatam modalu pedithe chandra babu gaadiki vunna bolli machala kante ysr ki antina burada machalu ekkuva avuthayi.