రాజశేఖరరెడ్డి గారు అధికారం లో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా లబ్ది పొంది కుమారుని కంపెనీలలో పెట్టుబడి పెట్టినారని జగన్ మీద ఆరోపణ.అప్పుడు పెట్టుబడి పెట్టినారు ఇప్పుడెందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు హరికృష్ణ ను హీరో గా పెట్టి సినిమాలు తీసినారు,ఇప్పుడెందుకు తీయడం లేదు అంటే ఏమి చెప్పాలి. అలా లాజిక్ లు తీసు కుంటూ పొతే అంతం ఉండదు.
సోమవారం 28 మే 2012
శనివారం 12 మే 2012
పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలందరూ నైతికంగా వ్యాపారాలు చేసి పైకి వచ్చారా?
ఇప్పుడు మన దేశం లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్త లని మనం ఘనంగా ,గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళు అందరూ చాలా చిన్న స్థాయి నుండి వచ్చినవారే. ప్రపంచంలోని ధనవంతులలో మన వాళ్ళు ఇన్నో స్థానంలో ఉన్నారు,అన్నో స్థానంలో ఉన్నారు,అని మన దేశం లోని వాళ్ళు ఉప్పొంగి పోతుంటారు.మనదేశం లోని వాళ్లైనా ,ఇతర దేశం లోని వాళ్లైనా పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకుల లేక బ్యూరోక్రసీ యొక్క అండదండలు లేకుండా ఇంత స్థాయి కి వచ్చేవారా? బడా పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వాలు చట్టాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి.అవన్నీ రాజకీయ నాయకులు ,బ్యూరోక్రాట్లు తమ స్వలాభం మానుకొని చేసి ఉంటారా?ఆ పారిశ్రామిక వేత్తలు రాజకీయాలలోకి రాలేదు.అందువలన వాళ్ళు పొందేది వాళ్ళు పొందుతూ వీళ్ళకు ఇచ్చేది వీళ్ళకు ఇచ్చి ఆనందంగా ఉన్నారు.అంత నైతికంగా వ్యాపారాలు చేస్తే ఏ పారిశ్రామిక వేత్త ఎవరూ అంత పెద్ద స్థాయి కి పోలేరు. చివరికి సామాన్య ప్రజలు కూడా దేవస్థానం లో దేవుని దర్శనానికి ,వసతికి కూడా రాజకీయ నాయకులనో ,అధికారులనో ఆశ్రయించ వలసి వస్తున్నది.మనకు రావలసిన కనీస అవసరాలు కూడా రెకమెండేషన్ లేకుండా రావడం లేదు.వ్యవస్థ ఆ విధంగా అయినది.కొంత మంది ప్రజలు ,కొంత మంది రాజకీయ నాయకులు కడుపు మంట తో ఆత్మ ద్రోహం చేసికొని మాట్లాడుతున్నారు.
శనివారం 28 ఎప్రిల్ 2012
కౌగిలింతల భయం పట్టుకున్న తెలుగుదేశం పార్టీ .
ఒక కౌగిలింత తెలుగుదేశం పార్టీ లో వణుకు పుట్టించింది.నిన్న జగన్, వంశీల పరస్పర పలకరింపులు,కౌగలింతలు తెలుగుదేశం పార్టీ వెన్నులో చలి పుట్టించింది , అని అనడానికి నిన్నటి నుండి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన చూస్తే తెలుస్తుంది.ప్రజాస్వామ్యం గురించి నిత్యం మాట్లాడే తెలుగుదేశం పార్టీ ,రాజకీయాలలో వేరు వేరు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు శత్రువులు లాగా ఉండాలని అనుకుంటుందా? రాజకీయాలు వేరు వ్యక్తిగత పలకరింపులు వేరు కాదా?ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?అంత బలహీన మైన పునాదుల మీద ఉందా తెలుగుదేశం పార్టీ?
ఆర్గానిక్ మోసం
పూర్వం రైతులు తాము పండించిన విత్తనాలనే మళ్ళీ విత్తడం కోసం దాచిపెట్టుకొని తర్వాత సంవత్సరం విత్తుకునేవాళ్ళు.విత్తన శుద్ది కూడా రొచ్చు(పశువుల మూత్రం ) తో చేసుకునేవారు.పంటలకు పశువుల ఎరువును వాడే వారు.
తర్వాత కాలంలో బహుళ జాతి కంపినీలు తమ లాభాల కోసం మార్కెట్ లో దిగి ఒకసారి విత్తిన విత్తనాలు తర్వాత పనికి రాకుండా చేసి తప్పని సరిగా ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే వాళ్ళు చెప్పిన ధరకు విత్తనాలను కొనేలా చేసినారు.
రైతులకు రసాయనిక ఎరువులను దగ్గర చేయడం వలన వాళ్ళు పశువులను పెంచకుండా పోయినారు.దీనివలన రైతులు తప్పని సరిగా రసాయనిక ఎరువుల మీద ఆధార పడేలా చేసినారు .పూర్వం రైతులు దేని కోసం ఎవరి మీద ఆధార పడకుండా ఉండేవారు.కానీ ప్రభుత్వాల కున్న బహుళజాతి సంస్థల మీద ప్రేమ వలన రైతులు ఆర్థికంగా దెబ్బతిని పోయినారు.ఇన్ని చేసినా రైతులు పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనారు.
కానీ అవే బహుళ జాతి సంస్థలు ఈ మధ్యన "ఆర్గానిక్ ఫుడ్ "అనే ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని తిరిగి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అదేం కొత్త విషయం కాదు.మన రైతులు పూర్వం సంప్రదాయకంగా చేస్తున్న పనిని ,వారిని దారి మళ్ళించి నాశనం చేసి తిరిగి అదే పద్దతి లోకి వచ్చి ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.బహుళ జాతి సంస్థల విష కౌగిలి నుండి రైతులను కాపాడడానికి ప్రభుత్వాలు రైతు పక్షపాతిగా పని చేయాలి.
ప్రజల విముక్తి కోసం పోరాడిన ఒక విప్లవ కారుణ్ణి హత్య చేసి తిరిగి అదే విప్లవకారుని ఫోటో లు పెట్టుకొని టి -షర్టులు అమ్ముకుంటున్న దుర్మార్గమైన బహుళ జాతి సంస్థల కాపు కాసే ద్వంద విధానాలున్న ప్రభుత్వాలు ఉన్నంత వరకూ రైతులకు మేలు జరగదు.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)





