2, నవంబర్ 2011, బుధవారం

కళ్ళు బైర్లు కమ్మే ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు.

నేను రోజు మా అమ్మాయిని ప్రస్తుతం చదువుతున్న స్కూలు నుండి వేరే స్కూల్లో చేర్పిస్తామని విచారించడానికి వెళ్లి ఫీజు గురించి అడిగితే ఐదంకెల ఫీజు చెప్పారు.అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు.ఎందుకు అంత ఫీజు అడుగుతున్నారని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు మేము తీసుకుంటున్నాము అని వాళ్ళ సమాధానం.నేను ఏమీ ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూల్లో చదివాను.కానీ వాళ పరిస్థితి మధ్య తరగతి మానవునికి చాలా ఇబ్బంది గా తయారైంది. మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళతోనే పరిస్థితి.వీళ్ళు డబ్బు ఎంత ఎక్కువ కడితే అంత బాగా చదువు చెబుతారనే భ్రమలో ఉన్నారు.ఒక వేల స్కూలు యాజమాన్యాలు తక్కువ ఫీజు తీసుకుంటే వీళ్ళకు రుచించదు.దాని కోసమే స్కూలు యాజమాన్యాలు ఫీజు పెంచిన సందర్భాలు ఉన్నాయి.ఒకవైపు ప్రభుత్వ స్కూళ్ళ ను నాశనం చేసారు.అలా అని ప్రైవేట్ స్కూళ్ళు అంత బాగా ఏమీ చెప్పడం లేదు.తిరిగి పిల్లలతో పాటు మనము కుస్తీ పట్టాలి.మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ఎలా చదివించు కోవాలో అర్థం కావడం లేదు.ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజుకు ప్రభుత్వ నియంత్రణ ఉండాలి.లేకపొతే సామాన్య ప్రజలు స్కూలు వైపు వెళ్ళే పరిస్థితి ఉండదు.

6 కామెంట్‌లు:

Indian Minerva చెప్పారు...

ఒకవిషయం నాకెప్పటికీ అర్ధంకాదండీ.

తల్లిదండ్రులు సంపాయించిన డిగ్రీలు పిల్లలకు ఎల్కేజీ చదువులు చెప్పడానిక్కూడా సరిపోవా? నలుగురితో మెలగడం తెలీకుండా పోతుంది అనే ఒక్కకారణం మినహాయిస్తే స్కూళ్ళలో పిల్లలని ఏవిధంగా ఉధ్ధరించేస్తారో నాకు ఇంతకూడా అర్ధంకాదు.

chanukya చెప్పారు...

అధిక జనాభా మహత్యమే ఇది

మయూఖ చెప్పారు...

"@ indian minarvaa "
గారు మనము వాల్ల కంటే బాగా చెప్పవచ్చు.కానీ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉందికదా,దాని కోసమైనా స్కూల్ కు పోవాలి కదా?నేను ఇప్పటి వరకూ మా అమ్మాయిని అందుకే ఎక్కువ డబ్బులడిగే స్కూలుకు పంపలేదు ,మామూలు స్కూలు కు పంపి, నేనే ఇంటి దగ్గర చెబుతూ ఉంటాను.మా అమ్మాయి బాగా చదువుతుంది.అయినా చదివే వాల్లకే చదువు వస్తుంది గానీ ,డబ్బులు ఎక్కువ కడితే చదువు రాదు.డబ్బులు ఎక్కువ కడితే బాగా చదువు వస్తుందనుకునే తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలి.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

హ్మ్మ్... కాస్త తీరిక చేసుకొని ఇంట్లో మీరే చదువు చెప్తే ఆ స్కూల్స్ వాళ్ళకంటే బాగా చెప్పగలరు. ఒక సంవత్సరం ట్రై చేసి చూడండి.

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అంటే ఇంటికి దగ్గర్లో ఏదో ఒక చిన్న స్కూల్ లో జాయిన్ చేసి ( సర్టిఫికేట్ కోసం ).... బోలెడంత సమయం..వేరే యాక్టివిటీస్ కు కూడా.

మయూఖ చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గారు ప్రస్తుతం చేస్తున్నది అదే నండి.