1, డిసెంబర్ 2011, గురువారం

పట్నం మింగేసింది !

మా ఊరి పేరు మారి పోయింది.ఏదో నోరు తిరగని పేరుతొ పిలుస్తున్నారు.
మా ఇరుగు పొరుగు లేరు .మా ఇంటి చుట్టూ పక్కలా ఎవరెవరో ఉన్నారు.
మాకు అర్థం కాని రకరకాల భాషలు మాట్లాడుతున్నారు.
మా భాషను మా యాసలో నోరారా మాట్లాడుకోవడానికి ఎవరూ కనపడ్డం లేదు.
మా పండుగలు కనపడ్డం లేదు ,వేరే పండుగలు చేస్తున్నారు.
మా సంస్కృతీ కనపడ్డం లేదు.
మా బాధను మన అనే వాళ్ళతో పంచుకుందామంటే ఎవరూ కనపడ్డం లేదు.
అంతా యాంత్రికంగా పరుగులు పెడుతున్నారు.
మా ఊరిని మమ్మల్ని పట్నం మింగేసింది.

5 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

చాలా ఊర్లను పట్నాలు మింగేస్తున్నాయండీ..మిగిలిన ఊర్లు కూడా పట్నం దారిలోనే నడక..బాధాకరమైన విషయం.

రసజ్ఞ చెప్పారు...

ప్రశాంతంగా ఉండాల్సిన పల్లె కూడా రణగొణ ధ్వనులతో నిండిపోయింది! వీధి బావులయితే కనుమరుగయ్యాయి. పల్లెలు, పల్లె పదాలు, పల్లెల అందాలు అడుగంటుతున్నాయి! చాలా చక్కగా వ్రాశారు!

మయూఖ చెప్పారు...

జ్యోతిర్మయి గారు, రసజ్ఞ గారు ధన్యవాదములు.

Jai Gottimukkala చెప్పారు...

Where are the baghs?
Where are my lakes?
Where is the call of the azaan?
What happened to the mushairas?

My lament on Hyderabad, the city lost to real estate mafia & migrant "camels"

మయూఖ చెప్పారు...

yes jai gaaru.It is very painful.