ప్రజల చేత ,ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని మనం ఘనంగా చెప్పుకుంటున్న మన ప్రభుత్వాలు నిజంగా సామాన్య ప్రజల కోసం పని చేస్తున్నాయా ?సామాన్య ప్రజలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు గౌరవంగా  కూలో,కుల వృత్తులో  ,వ్యవసాయమో చేసుకొని బ్రతుకుతున్నారు.దాన్ని కూడా ప్రభుత్వాలు చేసుకోనీయడం లేదు.ఈ వాళ శ్రీకాకుళంలో థర్మల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన సంఘటన లో కొందరు సామాన్యులు మృతి చెందినారు.వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు.కేవలం తమ బతుకులను తమను గౌరవంగా బతక నీయమని  కోరుతున్నారు.సామాన్యుల కనీస అవసరాలైన కూడు ,గుడ్డ, నీడ,విద్య,వైద్యం  లు కల్పించడం లో ప్రభుత్వాలు విఫల మైనాయి.ఈ ప్రభుత్వాలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయో ఒక సారి పరిశీలించు కోవాలి.మెజారిటీ ప్రజల ప్రయోజనాలు విస్మరించి ,కొద్దిమంది పెట్టుబడి  దారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పని చేస్తే  ప్రజాస్వామ్యానికి  పరమార్థమే ఉండదు.
1, మార్చి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
 
 

 
 


 




 
 పోస్ట్‌లు
పోస్ట్‌లు
 
 
2 కామెంట్‌లు:
YSR బంధుగణం అనుచరగణం వల్లనే కదా అక్కడ ఇలాంటి పరిస్ధితి వచ్చింది?
వై.ఎస్.ఆర్ వాళ్ళది ఉంటే ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించేది కాదు.అది మినిమం కామన్ సెన్స్.ప్రభుత్వం జగన్ కు అంత సపోర్ట్ ఇవ్వదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి