పూర్వం రాజుల పాలనలో రాజులు తమ రాజ్యం లోని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారు వేషాలలో తిరిగి వారి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల మనసెరిగి పరిపాలన సాగించారని విన్నాం.కాని ప్రజల కోసం ,ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెప్పబడుతున్న ప్రస్తుత ప్రభుత్వాలు ,పాలకులు ప్రజల కోసం ఏమి చేస్తున్నారో గమనించాలి.ప్రజలు కట్టగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చూడకుండా నిత్యం ఏదో ఒక రూపానా పన్నులు పెంచేస్తున్నారు.మొన్న వ్యాట్ ,తరచుగా పెట్రోల్ ,గ్యాస్ ధరలు,నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి.మెజారిటీ ప్రజలు ఏ విధంగా బ్రతుకుతున్నారో పాలకులకు పట్టడం లేదు.ప్రజలను ప్రభుత్వాలు ఏమీ పోషించడం లేదు.వాళ్ళ కష్టం వాళ్ళు పడి తమ బ్రతుకులు బ్రతుకుతూ ప్రభుత్వాలను,పాలకులను "వివిధ రకాల పన్నులు "కట్టి ప్రజలు పోషిస్తున్నారు.ఇప్పటికైనా పాలకులు ప్రజల మనసెరిగి పరిపాలన సాగించాలి లేదంటే తమ మనస్సులలోన ఉండే ఆవేదన ,ఆక్రోశం బ్రద్దలై పాలకులకు బుద్దిచెప్పే రోజు వస్తుంది.
16, సెప్టెంబర్ 2011, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి