22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాజకీయాలు ప్రజల కోసం కాకుండా అధికారాన్ని అనుభవించడానికేనా?

ముందు జరిగిన గోకుల్ చాట్ ,లుంబిని పార్క్ లో  జరిగిన పేలుళ్లు  ప్రజలు మరచి పోక ముందే  నిన్న హైదరాబాద్ లో పేలుళ్ళు  జరిగి ప్రాణనష్టం ,క్షతగాత్రులు కావడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజలకు తమ ధన ,మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది . ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేసున్నాయి. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి. అఫ్జల్ గురు ,కసబ్  ఉరి నేపథ్యంలో వివిధ తీవ్రవాద సంస్థలు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలిసి కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజల ప్రాణాలను తీవ్రవాదులకు వదిలేసి ఇంత చేతగాని తనంగా ఉండడం చాలా ఆశ్చర్యకరం.ఒకరేమో తమ పదవిని నిలబెట్టు కోవడానికి ,ఇంకొకరు ఆ పదవిని లాగడానికి  ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారే తప్ప ప్రజల గురించి చాలా తక్కువ సమయం పట్టించు కుంటున్నారు .  రాజకీయాలు  ప్రజల కోసం ,ప్రజల సేవ కోసం అని  కాకుండా అధికారాన్ని అనుభవించడానికి ,డబ్బులు సంపాదించడానికి మాత్రమే అని  రాజకీయ నాయకులు అనుకున్నంత  వరకు వాళ్ళ మైండ్ సెట్ మారనంతవరకు  ప్రజలు ఇలా బాధలు పడవలసిందే!

13, ఫిబ్రవరి 2013, బుధవారం

అసాధారణ పనులు చేసి ,మైనర్ పేరు చెప్పి చట్టాల నుండి తప్పించు కుంటున్నారా ?

మొన్న ఢిల్లీ లో సంచలనం సృష్టించిన సామూహిక  అత్యాచారం చేదు జ్ఞాపకాలు మరచి పోక ముందే,ఈ రోజు  పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలో  మైనర్ పిల్లలు  ఒక మైనర్ విద్యార్థినిని  లైంగికంగా  వేధించి ఆ దృశ్యాలను కెమరాల  లో  బంధించి పైశాచిక ఆనందం పొందే దృశ్యాలను టి.వి.లలో చూసి రక్తం మరిగి పోయింది.మైనర్ లు చేయ కూడని పనులు చేస్తూ ,మైనర్ ల మని చట్టం నుంచి తప్పించు కుంటూ పోతా ఉన్నారు.బయటకు వచ్చినవి కొన్ని మాత్రమే.బయటకు రానివి ఎన్ని ఉన్నాయో.ఇంత తీవ్రమైన పనులు చేస్తూ మైనర్ అన్న నెపంతో చట్టం నుండి  తప్పించు కోవడం సమంజసమేనా?కావున మైనర్ అయినా సరే వీళ్ళు అసాధారణ పని చేసినారు కాబట్టి శిక్షలు కూడా అసాధారణంగా నే  ఉండాలి.ఇటువంటి వాళ్ళను కనీస శిక్షలతో బయటకు  వదిలితే సమాజానికి వీళ్ళ వలన చాలా ప్రమాదం .వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులను కూడా  శిక్షించాలి.ఎందుకంటే వాళ్ళ బాధ్యతా రాహిత్యమే వీళ్ళు ఈ విధంగా తయారు కావడానికి కారణం. ఇంత ప్రత్యక్షంగా దొరికిన తర్వాత కూడా వీరికి కఠిన శిక్షలు వేయక పొతే ,ఇంకో మైనర్  బయలు దేరతాడు.వీళ్ళను ఎన్ కౌంటర్ చేసినా కూడా తప్పులేదు.అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు.

7, ఫిబ్రవరి 2013, గురువారం

ఎవరికోసం !

నాడు మే నెలలో ఎర్రటి ఎండలో ప్రజల కోసం ..
నేడు ఫిబ్రవరి నెలలో చలికాలంలో సోలార్ క్యాప్ తో ఎవరి కోసం ....  


6, ఫిబ్రవరి 2013, బుధవారం

రిజర్వేషన్ ఫలాలు ఒకసారి పొందిన వారే తిరిగి తిరిగి లబ్ది పొందుతున్నారు !

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

ఇంకేముంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చు!

సహకార ఎన్నికలలో విజయం సాధించామని కాంగ్రెస్స్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చెబుతున్నారు.ఇంకేముంది ఇంతకు మునుపు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళినట్లు ముందస్తు ఎన్నికలకు వెళితే  సరి,స్వీప్ చేయచ్చు.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఇది కూడా ఓట్ల రాజకీయమే!

షర్మిల 6 వ తేది నుండి పాదయాత్ర తిరిగి మొదలు పెడతామనగానే ,ముందు చేసిన పాద యాత్రలో ఆమెకు లభించిన ప్రజాభిమానం చూసి  ఆమె మీద ఆమె భర్త మీద ఆరోపణలు ఎక్కు పెట్టించినారు.తాము ఆరోపణలు చేస్తే తమకు మైనారిటీ ల ఓట్లు పోతాయనే భయంతో మెజారిటీ భావాలను భుజానికి ఎత్తుకున్నతమ పూర్వపు మిత్రపక్ష పార్టీ వాళ్ళ చేత విమర్శలు చేయిస్తున్నారు.విమర్శలు చేసేటప్పుడు కూడా తమ ఓట్ల కు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.ఇది కూడా ఓట్ల  రాజకీయమే!