6, అక్టోబర్ 2013, ఆదివారం

ఓటుకు డబ్బులు తీసుకోవడం ధర్మమేనా!

చాలా మంది  డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదని చెబుతూ ఉంటారు.కానీ వివిధ పార్టీల నాయకులు ఇచ్హే  డబ్బులు వాల్లేమీ స్వంతం చెమటోడ్చి కష్టపడి సంపాదించినవి కావు.అవి ప్రజలవే.ప్రజలు తమ డబ్బు తాము తీసుకొని పోటీ చేసిన వాల్లలో తమకు నచ్హిన వాల్లకు ఓటు వేస్తుంటారు.ఎందుకంటే అందరు అభ్యర్థులు డబ్బులు ఇస్తున్నారు.ఇది తప్పు కాదనుకుంటాను.ఒక వేల వీల్లు డబ్బులు తీసుకోకున్నా అవినీతి చేసే నాయకులు చేయకుండా ఉండరు.ప్రజలు డబ్బులు తీసుకోవడం వలన రాజకీయ నాయకులను కొంచమైనా ఆర్థికంగా తగ్గించ గలుగుతున్నారు.

10, సెప్టెంబర్ 2013, మంగళవారం

కాంగ్రెస్స్ కొత్త నాటకానికి తెరతీయవచ్చు!

కాంగ్రెస్స్ కొత్త నాటకానికి తెరతీయవచ్చు. వచ్చే ఎన్నికల వరకూ సమైక్య ఆంధ్ర ఉద్యమ వేడి అలాగే ఉండనిచ్చి లేక పోతే అందరిచేతా రాజీనామా చేయించి ,సీమాంధ్ర కాంగ్రెస్స్ నాయకులతో ఒక ప్రతిపాదన తెర  పైకి తీసుకు రావచ్చు. (ఎందుకంటే ఇప్పటికే సమైఖ్య ఉద్యమకారులు ప్రజా ప్రతినిధుల  రాజీనామాలు కోరుకుంటున్నారు ,ఒకవేళ రాజీనామాలు చేస్తే తిరిగి గెలిపించుకుంటామని హామీలు కూడా ఇస్తున్నారు.) .   అదేమంటే  సమైఖ్య ఆంధ్ర కోరుకునే వాళ్ళందరూ పార్టీలకతీతంగా జెఎసి తరపున ఇప్పుడున్న తమతమ స్థానాలలో  తిరిగి ఎన్నికలలో  పోటీ చేసి గెలవడం. తిరిగి కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్స్ లో కలవడం . దీని వలన సీమాంధ్ర  లో కాంగ్రెస్స్ మెజారిటి కి ఏమీ ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్స్ కు  ఇంతకంటే ఏం  కావాలి.      

2, ఆగస్టు 2013, శుక్రవారం

.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది!

అప్పుడు కర్నూల్ రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ ఏమీ వసతులు లేవని హైదరాబాదుకు రమ్మన్నామని చెబుతూ ఉండేవారు . ఇప్పుడు ఏమి వసతులు ఉన్నాయని తిరిగి పొమ్మంటున్నారు . అంతా స్వార్థం . కావున ముందు సీమాంధ్ర  ప్రాంతంలో పరిశ్రమలు వికేంద్రీకరించి  , పొలాలకు నీటి వసతి కల్పించి  అందరి సమ్మతి తో హైదరాబాదుకు దీటుగా ఒక రాజధానిని  నిర్మించి తర్వాతనే రాష్ట్ర విభజన చేసి పొమ్మనాలి. అంత వరకు ఇప్పుడెలా గుందో  అలాగే ఉండనివ్వాలి.అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది.      

31, జులై 2013, బుధవారం

సీమాంధ్రులు ద్రోహులు ,దోపిడీ దారులని కాంగ్రెస్స్ నాయకత్వం నమ్మిందా?

ఇన్నాళ్ళు తెలంగాణా నాయకులు సీమాంధ్ర వాళ్ళను ద్రోహులు,దోపిడీ దారులు అని చెబుతూ వచ్చారు . వాళ్ళ దోపిడీ నుండి  కాపాడుకోవడానికే తెలంగాణా కావాలని అందరికీ చెబుతూ వచ్చారు . ఇప్పుడు కాంగ్రెస్స్ వాళ్ళు ఆ మాటలు నిజమని  నమ్మి తెలంగాణా ఇచ్చారా లేక ఏదైనా ప్రాతిపదిక ఉందా ,సీమాంధ్రు లకు తెలప వలసిన బాధ్యత ఉంది .

30, జులై 2013, మంగళవారం

భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ!

తెలంగాణా తెచ్చుకున్నట్లు కాదు,ఒక వేల ఇస్తే ! భావోద్వేగాలను  రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ  పండగ,ఎందుకంటే తెలంగాణా ఇస్తే తాము ఏదో ఊడ పొడుస్తామని  తెలంగాణా ప్రజలందరికీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు . ఇప్పుడు తెలంగాణా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు. ఇంత భావోద్వేగం తో తెచ్చుకున్న తర్వాత ప్రజలు మార్పును చాలా తొందరగా కోరుకుంటారు . వాళ్ళను ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళు ఏమీ పని చేయకుండానే ఇంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పారు. కోరుకున్నన్ని ఉద్యోగాలు ,బంగళాలు దొరుకుతాయని ఆశ పెట్టారు. అక్కడి ప్రజలు ఒకటి ,రెండు సంవత్సరాలు చూస్తారు,వాళ్ళు కోరుకున్న మార్పు ఏమీ కనపడదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతగా అభివృద్ధి చెందలేదు .కావున తెలంగాణా  ఇచ్చిన పార్టీకి, తెచ్చామని చెప్పిన పార్టీకి ఇద్దరికీ ప్రజలు వాతలు పెట్టి తాము ఎవరికీ ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు.  

సీమాంధ్ర నిరుద్యోగులు ఇంక అడుక్కుతినాలి!

తెలంగాణా ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లే ఉంది . ఎంత సేపు కాంగ్రెస్స్ పార్టీకి తమ ఓట్లు ,సీట్ల గురించి,జగన్ ఫోబియా నుండి  బయట పడే మార్గం గురించే ఆలోచించి దే తప్ప ,ఒక వేల విభజిస్తే మిగతా ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి ఆలోచన చేసినట్లు లేదు. రాయలసీమ ,మరియు కొన్ని కోస్తా జిల్లాల్లో కరువు వుంది . ప్రజలకు పనులు లేక వలసలు పోవు చున్నారు. కలసి ఉన్నప్పుడే హైదరాబాదులో సీమాంధ్రు లు ఉద్యోగాల కోసం వస్తే వారి సర్టిఫికెట్లను చించి వేసిన సంధర్భాలు ఉన్నాయి. అలాంటిది  విడిపోయిన తర్వాత సీమాంధ్రుల నిరుద్యోగుల పరిస్థితి ఏంటి . ముందు సీమాంధ్ర లో పరిశ్రమలు ,నీటి వసతి అభివృద్ధి చేసిన తర్వాత విడగొడితే బాగుండేది . లేక పోతే హైదరాబాదును ఎవరికీ చెందకుండా పెట్టాలి .  

22, జూన్ 2013, శనివారం

ప్రభుత్వాలు చేయలేని పనిని ప్రకృతే చేసింది!

ఈ మధ్యన కేదార్ నాథ్ లో జరిగిన ప్రకృతి  విలయాన్ని చూసైనా ప్రజలు ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి.తమ స్వార్థం కోసం  కాలుష్యాన్ని పెంచి ,నదీ పరీవాహక ప్రాంతాల్లో రకరకాల కట్టడాలు కట్టి ,అడవులను ధ్వంసం చేసి ,వివిధ రకాల ప్రాజెక్టులు కట్టి ప్రకృతిని  నాశనం చేయడం మానుకోవాలి. అలా కాదంటే ప్రభుత్వాలు ,అధికార వ్యవస్థ చేయలేని పనిని ప్రకృతే తన చేతుల్లోకి తీసుకొని అక్రమమైన వాటినన్నింటినీ ధ్వంసం చేస్తుంది . 

1, మే 2013, బుధవారం

అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి.ఎవరిని నమ్మాలి?

సి.బి.ఐ  మీద సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మన దేశం లో వ్యవస్థలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలియ చెబుతుంది . ఒక్క సి.బి.ఐ  మాత్రమే కాదు చాలా వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్లకు ,డబ్బున్న వాళ్లకు మాత్రమే  చాలా సందర్భాలలో పని చేస్తున్నాయి. చివరికి సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెలితే ,ముందు కంప్లైంట్ తీసుకోకుండా నిందితుని స్థితిగతులు,రాజకీయ ప్రాబల్యం చూసుకున్న తర్వాతే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి.ప్రజల పన్నులతో పని చేస్తున్న అన్ని వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం   పోయింది .చివరికి ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ బడుతున్న  మీడియా ను కూడా నమ్మే పరిస్థితి లేదు. వాటికి కూడా రకరకాల రాజకీయాలు ,వివిధ అవలక్షణాలు అబ్బాయి. చివరికి సామాన్యుడు ఈ దేశం లో ఎవరిని నమ్మాలో అర్థం  కాని పరిస్థితి.

10, ఏప్రిల్ 2013, బుధవారం

శుభాకాంక్షలు

అందరికీ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు . 

8, ఏప్రిల్ 2013, సోమవారం

ఏ దాహం కోసం తమ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసారు?

అధికార  డబ్బు దాహం వల్లనే జగన్ కు ఇబ్బందులు వచ్చాయంటున్న  పెద్ద మనిషి ,ఏ దాహం కోసం తన పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసారో చెబితే బావుంటుంది .ఇలా డబల్ స్టాండర్డ్స్ మాట్లాడే చాలా మంది రాజకీయ నాయకులు తమ విశ్వసనీయతను పోగొట్టుకొన్నారు.

20, మార్చి 2013, బుధవారం

ప్రజల కన్నీళ్ళ గురించి చర్చలు పెడితే బాగుంటుంది !

ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాలో జరుగుతున్న చర్చలు ఈ మధ్యన ఎటుపోతున్నాయో అర్థం కావడం లేదు. నాయకుల కన్నీళ్ళ గురించి చర్చలు పెడతారు. రాజకీయ నాయకులు ఒకరినొకరు  వ్యక్తిగతంగా దూషించుకున్న తర్వాత ఫలానా  ఆయన ఫలానా  ఆయన గురించి అలా తిట్టాడు,ఆ తిట్టుకు అతడు అర్హుడేనా , నిజమేనా అని sms లు అడుగుతారు. కోర్టులలో జరుగుతున్న విషయాల మీద ఇక్కడ చర్చలు పెడతారు,వీళ్ళే ఎవరు దోషో ,ఎవరు నిర్దోషో  తేల్చేస్తారు. భార్యా భర్తల మధ్యన వచ్చే చిన్న చిన్న తగాదాలను కూడా ఇక్కడ తీసుకు వచ్చి చర్చకు పెడతారు.  భార్యా భర్తలు మద్యన చిన్న చిన్న సమస్యలు వచ్చి  అభిప్రాయభేదాలు రావచ్చు ,తర్వాత వాళ్ళే కలసి పోయే అవకాశం  ఉంది . కానీ లైవ్ లో వీళ్ళు పెట్టే  చర్చల  లో భార్యాభర్తలు ఒకరిమీద ఒకరు పై చేయి సాధించుకోవడానికి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు.ఇంకా మానసికంగా దూరమవుతారు . వీళ్ళు చేసే నిర్వాకం వలన కలసి పోయేదానికంటే ,దూరమయ్యే అవకాశమే ఎక్కువ. ఈ చర్చలు చూడాలంటేనే వెగటు పుడుతూ ఉంది . ప్రజల కన్నీళ్ళ గురించి,వాళ్ళ బాధల గురించి మీడియా చర్చలు పెడితే బాగుంటుంది.

16, మార్చి 2013, శనివారం

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టారు.

తమ తాత్కాలిక స్వార్థ ,రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను బలిపెట్టి అధికార పక్షానికి భుజం భుజం కలిపి దన్నుగా నిలబడ్డారు.కానీ ప్రజల జ్ఞాపక శక్తిని తక్కువగా అంచనా వేయరాదు. ప్రజల కోసం కాకుండా తమ స్వార్థాల కోసం పని చేసే రాజకీయ పార్టీ లను తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రజలు  రాజకీయంగా భూస్థాపితం చేయడానికి ఎల్లప్పుడూ సర్వ సన్నద్దులై  ఉంటారు .  

13, మార్చి 2013, బుధవారం

పీఒన్ దచ్చిగిరి చెబితేనే సెలవు!

చిన్నప్పుడు పాఠశాలలో క్లాసు జరుగుతున్నప్పుడు  పీఒన్ (ప్యూన్)దచ్చిగిరి ఏదో ఒక బుక్ పట్టుకొని  సార్  దగ్గరికి వస్తూనే పిల్లలందరికీ  ఒక ఆనందం ,దచ్చిగిరిని చూస్తూనే కృష్ణ పరమాత్మున్ని చూస్తున్నట్లు ఉండేది .ఎందుకంటే  మరసటి రోజున సెలవని సర్కులర్ తెచ్చి ఉంటాడని పిల్లలందరి ఆశ. సారు ఏం  చెబుతారా అని  పిల్లలందరూ ఆతృతగా ఎదురు చూసే వాళ్ళు. ఒక వేల సెలవని సార్  చెబితే పిల్లలు సంతోషంతో దచ్చిగిరి వైపు కృతజ్ఞతగా   ఒక చూపు చూసేవారు .లేక పొతే అది వేరే విషయం.అప్పుడు కూడా  కాలెండర్లు ఉండేవి ,కానీ సెలవు మాత్రం  దచ్చిగిరి బుక్కు తెచ్చి సారు  నోటి నుండి వింటేనే ,అదొక ఆనందం .        

8, మార్చి 2013, శుక్రవారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .

మహిళలందరూ తమ శక్తి సామర్థ్యాల మేరకు తమ తమ రంగాలలో వివక్ష లేకుండా పైకి ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ..మహిళలందరికీ , అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు . 

7, మార్చి 2013, గురువారం

చివరికి పశువులకు కూడా ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది .

నా చిన్నప్పుడు తినే  ఆహారం లో  వైవిధ్యం ఉండేది . కొర్ర,ఆరిక ,జొన్నఅప్పుడప్పుడు వరి  అన్నం తినే వాల్లం . అప్పుడు చాలా బాగుండేది . కానీ నేడు అవన్నీ మాయమైనాయి. ఒక్క వరి అన్నమే ఉంది .మనుషులకే కాదు చివరికి పశువులకు కూడా అప్పటికీ ఇప్పటికీ ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది . పూర్వం గడ్డివామిలో ఒక వరుస  వేరుశనగ కట్టె ,ఒక వరస ఆరిక గడ్డి,ఒక వరస కొర్ర గడ్డి ,ఒక వరస జొన్న చొప్ప,ఒక వరస వరి గడ్డి ,ఒక వరస జొన్న కంకుల గగ్గులు ఉండేవి . ఇవన్నీ  కూడా క్రిమి సంహారక  మందులు ,రసాయనిక ఎరువులు వాడకుండా పండించేవారు . ఇవన్నీ  వేసి ఒక సంవత్సరానికి సరిపడే  గడ్డి వామి వేసే వారు. ఈ గడ్డి ని తీసుకొని వచ్చి  పశువులకు వేస్తే  వాటికి పంచభక్ష్య పరమాన్నం తిన్నట్లు ఉండేది ,అవి ఆవురావురు మని తినేవి. పుష్టిగా ఉండేవి . కానీ నేడు  రైతులు గిట్టుబాటు కాక నో ,లేక మరొక కారణం చేతనో ఆ  పంటలన్నీ మానుకొని  రసాయనిక ఎరువులు ,క్రిమిసంహారక మందులు వాడి  శనగ పంట మాత్రమే పండిస్తున్నారు. మిషన్లతో కొట్టించిన తర్వాత వచ్చిన ఆ శనగ పొట్టును  మాత్రమే ఈ వాళ పశువులకు పెడుతున్నారు.అవి ఆకలికి తాళలేక ఆ పొట్టునే తింటున్నాయి . ఆ నోరు లేని జీవులను చూస్తే  బాధ వేస్తుంది .

3, మార్చి 2013, ఆదివారం

మనుష్యుల కంటే జంతువులను బాగా ప్రేమిస్తున్నారు!

ఈ మధ్యన మనుషుల్లో నాగరికత పెరిగే కొద్దీ మనుష్యుల కంటే జంతువులను బాగా ప్రేమిస్తున్నారు.ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకొని వాటికి ప్రేమను బాగా పంచుతున్నారు. కానీ సాటి మనుషులకు మోసాలు చేసి ,ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు పిసరంత సహాయం చేయడం పక్కన పెట్టి  ,లేనిపోని ఇబ్బందులు సృష్టించుతున్నారు.జంతువులు వీళ్ళ స్థాయి కి ఎదిగాయో ,వీళ్ళు జంతువుల స్థాయి కి ఎదిగారో అర్థం కావడం లేదు!      

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాజకీయాలు ప్రజల కోసం కాకుండా అధికారాన్ని అనుభవించడానికేనా?

ముందు జరిగిన గోకుల్ చాట్ ,లుంబిని పార్క్ లో  జరిగిన పేలుళ్లు  ప్రజలు మరచి పోక ముందే  నిన్న హైదరాబాద్ లో పేలుళ్ళు  జరిగి ప్రాణనష్టం ,క్షతగాత్రులు కావడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజలకు తమ ధన ,మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది . ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేసున్నాయి. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి. అఫ్జల్ గురు ,కసబ్  ఉరి నేపథ్యంలో వివిధ తీవ్రవాద సంస్థలు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలిసి కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రజల ప్రాణాలను తీవ్రవాదులకు వదిలేసి ఇంత చేతగాని తనంగా ఉండడం చాలా ఆశ్చర్యకరం.ఒకరేమో తమ పదవిని నిలబెట్టు కోవడానికి ,ఇంకొకరు ఆ పదవిని లాగడానికి  ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారే తప్ప ప్రజల గురించి చాలా తక్కువ సమయం పట్టించు కుంటున్నారు .  రాజకీయాలు  ప్రజల కోసం ,ప్రజల సేవ కోసం అని  కాకుండా అధికారాన్ని అనుభవించడానికి ,డబ్బులు సంపాదించడానికి మాత్రమే అని  రాజకీయ నాయకులు అనుకున్నంత  వరకు వాళ్ళ మైండ్ సెట్ మారనంతవరకు  ప్రజలు ఇలా బాధలు పడవలసిందే!

13, ఫిబ్రవరి 2013, బుధవారం

అసాధారణ పనులు చేసి ,మైనర్ పేరు చెప్పి చట్టాల నుండి తప్పించు కుంటున్నారా ?

మొన్న ఢిల్లీ లో సంచలనం సృష్టించిన సామూహిక  అత్యాచారం చేదు జ్ఞాపకాలు మరచి పోక ముందే,ఈ రోజు  పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలో  మైనర్ పిల్లలు  ఒక మైనర్ విద్యార్థినిని  లైంగికంగా  వేధించి ఆ దృశ్యాలను కెమరాల  లో  బంధించి పైశాచిక ఆనందం పొందే దృశ్యాలను టి.వి.లలో చూసి రక్తం మరిగి పోయింది.మైనర్ లు చేయ కూడని పనులు చేస్తూ ,మైనర్ ల మని చట్టం నుంచి తప్పించు కుంటూ పోతా ఉన్నారు.బయటకు వచ్చినవి కొన్ని మాత్రమే.బయటకు రానివి ఎన్ని ఉన్నాయో.ఇంత తీవ్రమైన పనులు చేస్తూ మైనర్ అన్న నెపంతో చట్టం నుండి  తప్పించు కోవడం సమంజసమేనా?కావున మైనర్ అయినా సరే వీళ్ళు అసాధారణ పని చేసినారు కాబట్టి శిక్షలు కూడా అసాధారణంగా నే  ఉండాలి.ఇటువంటి వాళ్ళను కనీస శిక్షలతో బయటకు  వదిలితే సమాజానికి వీళ్ళ వలన చాలా ప్రమాదం .వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులను కూడా  శిక్షించాలి.ఎందుకంటే వాళ్ళ బాధ్యతా రాహిత్యమే వీళ్ళు ఈ విధంగా తయారు కావడానికి కారణం. ఇంత ప్రత్యక్షంగా దొరికిన తర్వాత కూడా వీరికి కఠిన శిక్షలు వేయక పొతే ,ఇంకో మైనర్  బయలు దేరతాడు.వీళ్ళను ఎన్ కౌంటర్ చేసినా కూడా తప్పులేదు.అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు.

7, ఫిబ్రవరి 2013, గురువారం

ఎవరికోసం !

నాడు మే నెలలో ఎర్రటి ఎండలో ప్రజల కోసం ..
నేడు ఫిబ్రవరి నెలలో చలికాలంలో సోలార్ క్యాప్ తో ఎవరి కోసం ....  


6, ఫిబ్రవరి 2013, బుధవారం

రిజర్వేషన్ ఫలాలు ఒకసారి పొందిన వారే తిరిగి తిరిగి లబ్ది పొందుతున్నారు !

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

ఇంకేముంది ముందస్తు ఎన్నికలకు వెళ్ళవచ్చు!

సహకార ఎన్నికలలో విజయం సాధించామని కాంగ్రెస్స్ వాళ్ళు చాలా ఉత్సాహంగా చెబుతున్నారు.ఇంకేముంది ఇంతకు మునుపు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళినట్లు ముందస్తు ఎన్నికలకు వెళితే  సరి,స్వీప్ చేయచ్చు.

5, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఇది కూడా ఓట్ల రాజకీయమే!

షర్మిల 6 వ తేది నుండి పాదయాత్ర తిరిగి మొదలు పెడతామనగానే ,ముందు చేసిన పాద యాత్రలో ఆమెకు లభించిన ప్రజాభిమానం చూసి  ఆమె మీద ఆమె భర్త మీద ఆరోపణలు ఎక్కు పెట్టించినారు.తాము ఆరోపణలు చేస్తే తమకు మైనారిటీ ల ఓట్లు పోతాయనే భయంతో మెజారిటీ భావాలను భుజానికి ఎత్తుకున్నతమ పూర్వపు మిత్రపక్ష పార్టీ వాళ్ళ చేత విమర్శలు చేయిస్తున్నారు.విమర్శలు చేసేటప్పుడు కూడా తమ ఓట్ల కు ఇబ్బంది కలగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.ఇది కూడా ఓట్ల  రాజకీయమే!  

26, జనవరి 2013, శనివారం

చాలా ఆలస్యం అయ్యింది!

నిన్న ఉండవల్లి గారు మీటింగ్ పెట్టి సమైఖ్యాంధ్ర ఏర్పడడం గురించి కొన్ని  సాక్ష్యాలు  చెప్పారు.ఇది చాలా ఆలస్యం అయ్యిది.ఈ విషయం టి.ఆర్.ఎస్ పార్టీ పెట్టి వాళ్ళు తమకు అన్యాయం జరిగిందని ప్రచారం చేసినప్పటి నుండి ఇరు ప్రాంతాల మేధావులను కూర్చోబెట్టి చెప్పి ఉండవలిసింది.అలా చెప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణా అనే అంశాన్ని అన్ని పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు తమ రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు.ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏమీ వినిపించుకునే   స్థితి లో లేరు.ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు  వాళ్ళ మనస్సులను మార్చి వేసాయి.ఇప్పుడు నిజాలు చెప్పినా  వాళ్ళు  వినే  పరిస్థితి లో లేరు.రాజకీయ నాయకులు  భావోద్వేగాలను రెచ్చ గొట్టి ప్రజలను ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. ఇది రాజకీయ నాయకులు చేసిన,వాళ్ళు మాత్రమే చేయగలిగిన  మరొక ఘనమైన నిర్వాకం .   

23, జనవరి 2013, బుధవారం

చంద్రబాబు గారు ప్రత్యక్ష ఉద్యమం లోకి దిగ వలసి రావచ్చు!

చంద్రబాబు గారు తెలంగాణా లో పాదయాత్ర సందర్భంగా తెలంగాణా కు మద్దత్తు తెలిపి ఇబ్బందుల్లో పడ్డారనిపిస్తుంది.ఒక వేల తెలంగాణా ఇస్తే పరవాలేదు.సీమాంధ్ర లో వచ్చే ఎన్నికలలో సీట్లు రాకున్నా తెలంగాణా లో కొన్నైనా వస్తాయి.ఒక వేల తెలంగాణా ఇవ్వక పోతే సీమాంధ్ర లో సీట్లు ఎలాగు రావు ,తెలంగాణా లో టి.ఆర్.ఎస్ ను కాదని టి.డి.పి ని నమ్మి ఓట్లు వేయరు.తెలంగాణా లో ఓట్లు కావాలంటే ఆయన ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగి,తెలంగాణా జెండా పట్టుకొని  పోరాడవలసి వస్తుంది.

రిజర్వేషన్ ఫలాలు ఒకసారి పొందిన వారే తిరిగి తిరిగి లబ్ది పొందుతున్నారు !

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

22, జనవరి 2013, మంగళవారం

SC/ST ,OBC సోదరులకు అంత సహృదయత ఉందా?

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

21, జనవరి 2013, సోమవారం

అభివృద్ధి అంటే అప్పులా ?

పూర్వం పెద్దలు అప్పులు అంటే  భయపడేవారు.కానీ ప్రతి ఒక్కరికి నివాసం ఉండడానికి ఇల్లు ,తినడానికి తిండి  ఉండేది.అప్పులు మాత్రం ఉండేవి కాదు.ఒక వేల ఉన్నా కూడా భూమి కొనడానికో,పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో చేసే వారు.అవి కూడా తాము తీర్చ గలిగేంత మాత్రమే ఉండేవి.చాలా పొదుపుగా ప్రశాంతంగా   బ్రతికే వారు.కానీ నేడు ఎంత జీతం వచ్చినా వినిమయ  సంస్కృతి పెరిగి  ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి.అవి కూడా తాహతుకు మించి ఉన్నాయి.ఒకరిని చూసి ఒకరు ఇల్లో  ,కారో అప్పులు చేసి కొంటున్నారు.చివరికి ఇంటి లోని సామాన్లు కూడా అప్పులు చేసి కొంటున్నారు.పూర్వం కారు ఉందంటే  అతను  ఆర్థికంగా బాగా ఉండేవాడు.కానీ నేడు కారుకు నెలకు కనీసం  7000 రూపాయలు  కంతులు కట్టే వారు ఇంట్లో భోజనానికి మాత్రం నెలకు  అంత ఖర్చు పెట్టలేని వారున్నారు.ఇల్లు నెలకు పది వేల రూపాయలకు బాడుగకు దొరుకు తుంటే ,అదే మొత్తం కంతులు  కడితే మనకు  ఇల్లు స్వంతం అవుతే పరవా లేదు.కానీ నేటి పరిస్థితి అలా లేదు,నెలకు ఈ పది వేలకు తోడుగా మరొక ఇరవై వేలో ,ముప్పై వేలో కంతులు కట్టే విధంగా  అప్పులు చేయుచున్నారు.నాకు తెలిసి బెంగుళూరులో 20X30(600 చదరపు  అడుగులు ) స్థలంలో కట్టే డూప్లెక్ష్  ఇల్లును కనీసం కోటి రూపాయలకు అమ్ముతున్నారు.ఆతను నెలకు కనీసం కంతే 90000 రూపాయలు కట్టాలి.ఆ ఇల్లు కొనుక్కున్న వానికి అందులో పడుకుంటే నిద్ర పడుతుందా ?దీన్నే అభివృద్ధి అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం.అభివృద్ధి అంటే  అప్పులా ?   

17, జనవరి 2013, గురువారం

ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.

వై.ఎస్. చని పోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రాంతాలకతీతంగా మన  రాష్ట్రం లోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు.జగన్ కూడా  ప్రజలకు దగ్గర అవుతూ ఒక బలమైన నాయకుడిగా  తయారవుతూ ఉంటే ,కాంగ్రెస్స్ అధినాయకత్వం జగన్ నాయకత్వాన్ని బలహీన పరచడానికి ,జగన్ ను సమర్థించే నాయకులను పరిమితం చేయడానికి తెలంగాణా అనే పాచిక వేసింది.తద్వారా జగన్ను ఒక రాయలసీమ  ప్రాంతానికి  మరియు రెడ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూసింది.కానీ చివరికి అదే వాళ్ళ మెడకు ఉరి త్రాడై చుట్టు కుంది.అంత చేసినా జగన్ను కట్టడి చేయలేక పోయినారు.తెలంగాణాను తేల్చ లేక పోయారు.రాజకీయంగా ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.చివరికి రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి లోకి తోసేసారు.  

రాష్ట్రాలు ముక్కలైతే ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా ?

మళ్ళీ 28 డెడ్ లైన్ సమీపిస్తుండడంతో తెలంగాణా సమస్య మీద  చర్చలు , వాదాలు మొదలైయ్యాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏళ్ల  తర్వాత కూడా పాలకులు ప్రజల కనీస అవసరాలైన త్రాగే నీరు ,విద్య ,వైద్యం అందించ  లేకుండా ఉన్నారు.రాష్ట్రాలు ఎన్ని ముక్కలైనా పాలకుల మైండ్ సెట్ మారకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.చిన్న సర్పంచ్ స్థాయి నుండి పాలకులు అవినీతి లో మునిగి తేలుతున్నారు.రాజకీయాలలోకి రావడం అంటేనే సంపాదనకోసం అనే అభిప్రాయంతో వస్తున్నారు.ప్రజలకు  కూడా పాలకుల మీద  నమ్మకం పోయింది.ఓట్ల రోజు తమకు ఇచ్చేదే గతి అని నిర్ణయించు కున్నారు.కావున ఆ రోజు రాజకీయ నాయకులు ఇచ్చేది తీసుకొని ,ఆ రోజు ఓట్లలో  నిలబడిన వాళ్ళలో తమకు నచ్చిన వాడికి ఓటు వేసి తమ పనులలో తాము  పడి  తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు.

15, జనవరి 2013, మంగళవారం

ఇంటి కోసం వెట్టి చాకిరీ చేస్తున్నారు!

పూర్వం పెద్దలు ఉద్యోగాలు చేసేటప్పుడు ముందుగా పిల్లల చదువులు తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేసి భాద్యతలు తీరిన తర్వాత ఇల్లు గురించి ఆలోచన చేసేవారు.వీలైతే అప్పు చేయకుండా తమ స్వంత డబ్బు తో కట్టుకునేవారు లేకపోతే స్వంత ఊరికి పోయి తమ పూర్వీకుల ఇళ్లలోనే కాలం వెళ్లి బుచ్చేవారు.ఇల్లు అనే దాన్ని ఒక ఆస్తి గా చూసే వారు కాదు.అది కేవలం నివాసం ఉండడానికి  ఒక గూడు  లాగా అను కునే వారు.కానీ నేడు ఉద్యోగం లో చేరి చేరక మునుపే ఇల్లు ,కార్లు బుక్ చేయుచున్నారు.అదీ 20 సంవత్సరాలకు లోన్లు తీసుకొని,నెలనెలా కంతులు చెల్లిస్తూ .పూర్వం పల్లెల్లో  ఇండ్లలో జీతగాళ్ళను పెట్టుకునేందుకు ముందే కొంత మొత్తం చెల్లించే వాళ్ళు ,వాళ్ళు అది తీరే దాకా ఇండ్లలో వెట్టి చాకిరి లాగా పని  చేసే వాళ్ళు.ఇప్పుడు చదువు కున్నోల్లు ,ఉద్యోగస్తులు చేసే పని దీనికంటే భిన్నంగా ఏమీ లేదు.ఒక యంత్రం లాగా ఆ కంతులు తీర్చడానికి భార్యా భర్తలు సమయం అనేది లేకుండా పని చేస్తున్నారు.చివరికి పిల్లల ఆలనా పాలనా కూడా  చూడలేక పోతున్నారు.  వీళ్ళ ఉద్యోగాలు ఎంత కాలం ఉంటాయో ఎవరికీ తెలియదు .ఒక వేల మధ్యలో పోతే అప్పులు తప్ప ఆస్తులు ఏమీ ఉండవు.ఒక వేల చివరి వరకు వీళ్ళు కంతులు  కట్టి ఆ ఇల్లు స్వంతమైనా వీళ్ళు కట్టిన మొత్తానికి ఆ రోజు ఆ ఇంటికి ఉన్న విలువకు సరి పోతుంది.కొన్ని సందర్భాలలో వీళ్ళు కట్టిన మొత్తాల కంటే ఇంటి విలువే తక్కువ అవుతుంది.ఇంత తీవ్ర మైన ఒత్తిడి తో పని చేసి వీళ్ళు చివరికి సంపాదించింది ఒక గూడు ,కొన్ని రోగాలు మాత్రమే.అప్పటికి పిల్లలు చేతికి అంది వస్తే పరవా లేదు .లేక పోతే అంత కన్నా నరకం ఇంకొకటి ఉండదు.తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడానికి సమయం లేక వాళ్ళను ముద్దు చేసి ,వాళ్లకు తాము లేని లోటును తీర్చాలని వాళ్లకు అడిగినవన్నీ కొనిపించి ,చాలా వరకు పిల్లలు  భాధ్యత లేకుండా పెరుగు తున్నారు.మనం అభివృద్ధి సాధించినామని చంకలు గుద్దుకుంటున్నాము ,ఆ అభివృద్ధి ఏమిటో ఒక 15 ,20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. 

13, జనవరి 2013, ఆదివారం

నాకైతే ఏమీ అర్థం కాలేదు?

నిన్న నేను "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "సినిమా కు వెళ్ళాను.అందులో పెద్దోడు అనే పాత్రకు ఏమీ పనిలేదు అని హైలెట్ చేసారు.అందరూ అడుగుతుంటారు ఏం చేస్తుంటావని.కానీ పెద్దోడు పాత్ర మాత్రం చిన్నోని పాత్రకు వద్దన్నా డబ్బులు ఇస్తూ ఉంటాడు.జేబులో కుక్కేస్తూ ఉంటాడు .అది నాకు అర్థం కాలేదు అతడు డబ్బు ఎక్కడ నుండి తెస్తుంటాడో ?అక్కడ ఏమీ సెంటిమెంటు లేకున్నా సెంటిమెంటు ఉందని మనలను భ్రమింప చేయాలని చాలా ప్రయత్నం చేసారు.ఆ సినిమా పేరుకు ఆ సినిమా కు ఏం  సంభంధం   ఉందో అర్థం కాలేదు.ఇప్పటికే యువత పనీ పాట లేకుండా చెట్ల క్రింద కూర్చొని బాతాఖాని కొడుతున్నారు.ఆ సినిమాలో కూడా భాధ్యత లేకుండా చెట్ల క్రింద కూర్చొని ఉంటారు.ఏం సందేశం ఇవ్వాలను కున్నారో అర్థం కాలేదు.

12, జనవరి 2013, శనివారం

శుభాకాంక్షలు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

8, జనవరి 2013, మంగళవారం

ఎక్కడికి పోతున్నాం మనం ఇంక చాలు .....

రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం ఈ మధ్యన ఎక్కువైంది.తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకాయనేమో ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టండి అంటాడు.ఇంకొక ఆయనేమో ఒక మెజారిటీ మతానికి వ్యతిరేకంగా ప్రజల హర్షధ్వానాల మధ్యన తన నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడాడు.ఈ మధ్యన హిందూ దేవుళ్ళను ,దేవతలను విమర్శిం చడం ఒక ఫ్యాషన్ అయి పోయింది.ఒక జీసస్ కానీ ,మహమ్మద్ ప్రవక్త కానీ ,రాముడు కానీ ,కృష్ణుడు కానీ ఇన్ని రోజులు ఉన్నా కూడా  ప్రజలకు  తమ ఆరాధ్య దైవాలుగా ఉన్నారంటే నే చరిత్రలో వాళ్లకు ఒక బలమైన స్థానం ఉంది.వాళ్ళను విమర్శించే స్థాయిలో మనం ఉన్నామా అని ఒక సారి మనం ప్రశ్నించు  కోవాలి.ఇదా మనం చదివిన తర్వాత నేర్చుకున్న నాగరికత ?చదువులు మనలను ఇంత సంకుచితంగా తయారు చేసాయా?మేం చిన్నప్పుడు ఉర్సు జరిగేటప్పుడు దర్గాలకు వెళ్లి   చక్కర పంచి వచ్చేవాళ్ళం.ఇప్పటికీ కూడా పీర్ల పండుగల లో ,దస్తగిరి స్వామి పండుగలలో చాలా మంది హిందువులు మనస్పూర్తిగా ,ఉత్సాహంగా పాల్గొంటున్నారు.మెజారిటీ హిందువులకు పరమత సహనం ఉంది.ఊర్లలో చర్చి లు మసీదులు కట్టుకోవడానికి హిందువులు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.దీన్ని హిందువుల  చేతగాని తనంగా చూస్తున్నారు.ఈ మధ్యన మాధ్యమాలల్లో కూడా చర్చ చేయడానికి ఏమీ దొరకక పోతే కుహనా మేధావులను కూర్చో బెట్టి దేవుళ్ళ గురించి  చర్చలు చేస్తున్నారు.ఒకాయనేమో ఆయన చూసి వచ్చినట్లు రావణుడు తమ దేవుడు అని పురాణాలకు వక్ర భాష్యం చెపుతాడు .దీన్ని చర్చకు పెడతారు మీడియా వాళ్ళు.ఇది ఆపుతే బాగుంటుంది.హిందూ మతాన్ని చాలా చులకన చేసి సినిమాలలో కూడా  చూపుతున్నారు. మనలను మనం గౌరవించు కోలేనప్పుడు ఇతరులు మనలను ఎందుకు గౌరవిస్తారు.తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను ,మతాలను గురించి రెచ్చ గొట్టే విధంగా మాట్లాడే వాళ్ళను ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి.

6, జనవరి 2013, ఆదివారం

నష్టాలను లాభాలుగా ప్రచారం చేస్తున్నారు!

ఈ కాలంలో ప్రకటనలు ఇచ్చే వాళ్ళు  నెగెటివ్ ను పాజిటివ్ గాను పాజిటివ్ ను నెగెటివ్ గాను చెప్పుకుంటున్నారు.అలాగే ప్రజలు స్వీకరిస్తున్నారు కూడా !ఎందుకంటే అపార్ట్మెంట్ లు కట్టే వాళ్ళు ,ఇళ్ళ స్థలాల లేఅవుట్ వేసే వాళ్ళు తమ అపార్ట్మెంట్ లకు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్లు ,సినిమా హాలులు ,పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయని   ప్రకటనలు ఇచ్చు కుంటున్నారు.ఒకప్పుడు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఇల్లు కట్టుకునేవారు కాదు ,ఎందుకంటే  ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందని.అలాగే ఇంటికి దగ్గర్లో సినిమా హాలు ఉంటే శబ్ద కాలుష్యం ఉంటుందని ,రకరకాల పోకిరి వ్యక్తులు వస్తారని ఇల్లు కట్టు కునే వారు కాదు.అలాగే కాలుష్యం ఉంటుందని  పరిశ్రమలకు దూరంగా ఇల్లు కట్టుకునేవారు.కానీ నేడు ఆ నష్టాలనే లాభాలుగా ప్రచారం చేస్తున్నారు.ప్రజలు కూడా  వాటివెంటే పరిగెత్తుతున్నారు.అదీ కలికాలం అంటే !


1, జనవరి 2013, మంగళవారం

నూతన ఆంగ్ల సంవత్సరంలో చిన్న కోర్కెలు కోరుకుంటూ ......

అందరికి నూతన ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు .


  • ఉన్న వాడికి లేని వాడికి చట్టం సమానంగా పనిచేయాలని
  • పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు బాధితుని ఫిర్యాదును నిందితుని  హోదాను పరిశీలించిన తర్వాత మాత్రమే  స్వీకరించే పని చేయ  కుండా ఉండాలని
  • ఒక సారి రాజకీయాల్లోకి కాని అధికారంలోకి కాని వస్తే చిన్న పదవి నుండి ,పెద్ద పదవి వరకు ఉన్న వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరగ కుండా  ఉండాలని
  •  రాజకీయ నాయకులు  ప్రజల సొమ్మును ఎవరికి అవకాశం  ఉన్నంత వాళ్ళు  తిన్న తర్వాత నీవు ఎక్కువ తిన్నావు ,నీవు ఎక్కువ తిన్నావని విమర్శలు చేసుకోకుండా కొంచం ప్రజల గురించి ఆలోచన చేయాలని 
  • ప్రజల నుండి పన్నులు వసూలు చేసిన తర్వాత  ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత   తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలని
  • బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ,మూత్ర విసర్జన ,పొగ త్రాగడం చేయ వద్దనే ముందు ఉమ్మి తొట్లు ,మూత్రశాలలు ,పొగ త్రాగే రూములు పెట్టినామా అని ఆలోచన చేసి తర్వాత ప్రజలకు  చట్టాలను  గౌరవించాలని చెప్పాలని
  • ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను ప్రవేశ పెట్టవద్దని 
  • ప్రతిభను గౌరవించాలని 
  • వ్యవసాయదారులను గౌరవించాలని  
  • ప్రజలందరూ బాధ్యత గా మెలగాలని 
  • అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని  
  • అన్ని వ్యవస్థలు వీలైనంత సక్రమంగా పని చేయాలని
  • తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్చగా వెల్లడించే అవకాశం ఉండాలని  కోరుకుంటూ......