6, ఫిబ్రవరి 2013, బుధవారం

రిజర్వేషన్ ఫలాలు ఒకసారి పొందిన వారే తిరిగి తిరిగి లబ్ది పొందుతున్నారు !

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒకసారి ముఖ్యమంత్రో, మంత్రో, లేక పార్టీ అద్యక్షుడో అయిన రెడ్డి, లేక ఇతర వున్నత కులాలకు తిరిగి 100 సంవత్సరాలవరకూ ఆపదవి దక్కకుండా చట్టం తీసుకొస్తే ఎలావుంటుంది రెడ్డిగారూ? ప్రపంచ సంపదనంతా మీ ఇంట్లో పోగేసుకుని ఎన్నైనా చెప్పొచ్చు.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

ఎవడూ అలా చేయడండీ. చూస్తూ చూస్తూ నోటికి అందే బెల్లాన్ని వదులుకుంటాడా? ప్రభుత్వం ధైర్యం చేసి అలా చట్టాన్ని తీసుకురావాలి.

అజ్ఞాత చెప్పారు...

ఎవడు కుడా ఫ్రీ గా వచ్చే దాన్ని వదులుకోడు .
ఎదురుగా లడ్డు పెట్టుకుని , నువ్వు తినకూడదు, నీ దగ్గర చాలా ఉన్నాయి , ఇది వేరోకరకి ఇద్దాం .
ఇలాంటి చచ్చు పుచ్చు సలహాలు ఎవరు వినరండి.
అలా వదులుకోవాలంటే అబ్బో..చాలా విషయం ఉండాలి వాళ్ళలో

మయూఖ చెప్పారు...

మొదటి అజ్ఞాత గారూ
రిజర్వేషన్లను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో ఆ ఉద్దేశ్యం నెరవేరడం కోసం ఆ విధంగా చేయాలని చెప్పాను.అగ్రవర్ణాలతో పోటీ పడలేమనే కదా మీరు రిజర్వేషన్లను అడిగింది.ఇప్పుడు ఒకసారి రిజర్వేషన్ వచ్హిన తర్వాత మీతో మీ సాటి సహోదరులు పోటీ పడతారా?అంతెందుకు మీతో అగ్రవర్ణ పేదలు కూడా పోటీ పడలేరు.రిజర్వేషన్ ద్వారా ఒకే ఇంట్లో రెండు మూడు ఉద్యోగాలు చేసే వారు ఉన్నారు.అగ్రవర్ణాలలో ఎవరో వేల్ల మీద లెక్క పెట్ట గలిగే వాల్లుంటారు,మీరు చెప్పినట్లు.ఒకసారి పల్లెలకు వెళ్ళి చూడండి మీ సాటి ఎస్.సి /ఎస్.టి. సోదరులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ?కావున మీ సాటి సహోదరులకు ఎవరూ అన్యాయం చేయడం లేదు.మీరే చేయుచున్నారు.ఎస్.సి ల వర్గీకరణం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు.అదే ఎస్.సి. లలో కొందరు మాత్రమే లబ్ది పొందినారని కదా?ఇప్పుడు కూడా ఆ రిజర్వేషన్లలో కొందరు మాత్రమే లబ్ది పొందుతున్నారు.కావున వర్గీకరణ కంటే ముందు ఈ చట్టం చేయాలి.అప్పుడే అందరికీ సమ న్యాయం దొరుకుతుంది.

మయూఖ చెప్పారు...

రెండవ అజ్ఞాత గారూ
ఆ లడ్డు స్వంతంగా సంపాదించుకున్నదైతే ఎవరూ ఎవరికీ ఇవ్వమని అడగరు.అది వాల్ల ఇష్టమైతే ఇవ్వచ్హు,లేక పోతే ఇవ్వక పోవచ్హు.కానీ ఈ లడ్డు వాల్లకు ఒక సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వం అందించింది,సమ న్యాయం కోసం.ఆకలిగొన్న వానికి అన్నం పెట్టాలని. కడుపునిండిన వాల్లే మల్లీ మల్లీ తింటూ ఉంటే ఎలా అండీ?ఆకలి విలువ తెలిసిన వారే తమ సాటి సోదరుల ఆకలి గురించి పట్టించు కోక పోతే ఎలా?