13, ఫిబ్రవరి 2013, బుధవారం

అసాధారణ పనులు చేసి ,మైనర్ పేరు చెప్పి చట్టాల నుండి తప్పించు కుంటున్నారా ?

మొన్న ఢిల్లీ లో సంచలనం సృష్టించిన సామూహిక  అత్యాచారం చేదు జ్ఞాపకాలు మరచి పోక ముందే,ఈ రోజు  పశ్చిమ గోదావరి జిల్లాలోని పాఠశాలలో  మైనర్ పిల్లలు  ఒక మైనర్ విద్యార్థినిని  లైంగికంగా  వేధించి ఆ దృశ్యాలను కెమరాల  లో  బంధించి పైశాచిక ఆనందం పొందే దృశ్యాలను టి.వి.లలో చూసి రక్తం మరిగి పోయింది.మైనర్ లు చేయ కూడని పనులు చేస్తూ ,మైనర్ ల మని చట్టం నుంచి తప్పించు కుంటూ పోతా ఉన్నారు.బయటకు వచ్చినవి కొన్ని మాత్రమే.బయటకు రానివి ఎన్ని ఉన్నాయో.ఇంత తీవ్రమైన పనులు చేస్తూ మైనర్ అన్న నెపంతో చట్టం నుండి  తప్పించు కోవడం సమంజసమేనా?కావున మైనర్ అయినా సరే వీళ్ళు అసాధారణ పని చేసినారు కాబట్టి శిక్షలు కూడా అసాధారణంగా నే  ఉండాలి.ఇటువంటి వాళ్ళను కనీస శిక్షలతో బయటకు  వదిలితే సమాజానికి వీళ్ళ వలన చాలా ప్రమాదం .వీళ్ళతో పాటు వీళ్ళ తల్లిదండ్రులను కూడా  శిక్షించాలి.ఎందుకంటే వాళ్ళ బాధ్యతా రాహిత్యమే వీళ్ళు ఈ విధంగా తయారు కావడానికి కారణం. ఇంత ప్రత్యక్షంగా దొరికిన తర్వాత కూడా వీరికి కఠిన శిక్షలు వేయక పొతే ,ఇంకో మైనర్  బయలు దేరతాడు.వీళ్ళను ఎన్ కౌంటర్ చేసినా కూడా తప్పులేదు.అటువంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు.

2 కామెంట్‌లు:

కాయ చెప్పారు...

అంటే అసాధారణ పనులు జరగనీయటం తప్పు కాదా ?.. అసలు అలాంటి మనుషులే లేని సమాజం అవసరం ముఖ్యమా ? లేక ఈ సదరు కుర్రకుంకలకి ఉరి శిక్ష వేయటం సరైనదా ?

మయూఖ చెప్పారు...

నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. కాయ గారు.