1, జనవరి 2013, మంగళవారం

నూతన ఆంగ్ల సంవత్సరంలో చిన్న కోర్కెలు కోరుకుంటూ ......

అందరికి నూతన ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు .


  • ఉన్న వాడికి లేని వాడికి చట్టం సమానంగా పనిచేయాలని
  • పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు బాధితుని ఫిర్యాదును నిందితుని  హోదాను పరిశీలించిన తర్వాత మాత్రమే  స్వీకరించే పని చేయ  కుండా ఉండాలని
  • ఒక సారి రాజకీయాల్లోకి కాని అధికారంలోకి కాని వస్తే చిన్న పదవి నుండి ,పెద్ద పదవి వరకు ఉన్న వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరగ కుండా  ఉండాలని
  •  రాజకీయ నాయకులు  ప్రజల సొమ్మును ఎవరికి అవకాశం  ఉన్నంత వాళ్ళు  తిన్న తర్వాత నీవు ఎక్కువ తిన్నావు ,నీవు ఎక్కువ తిన్నావని విమర్శలు చేసుకోకుండా కొంచం ప్రజల గురించి ఆలోచన చేయాలని 
  • ప్రజల నుండి పన్నులు వసూలు చేసిన తర్వాత  ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత   తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలని
  • బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ,మూత్ర విసర్జన ,పొగ త్రాగడం చేయ వద్దనే ముందు ఉమ్మి తొట్లు ,మూత్రశాలలు ,పొగ త్రాగే రూములు పెట్టినామా అని ఆలోచన చేసి తర్వాత ప్రజలకు  చట్టాలను  గౌరవించాలని చెప్పాలని
  • ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను ప్రవేశ పెట్టవద్దని 
  • ప్రతిభను గౌరవించాలని 
  • వ్యవసాయదారులను గౌరవించాలని  
  • ప్రజలందరూ బాధ్యత గా మెలగాలని 
  • అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని  
  • అన్ని వ్యవస్థలు వీలైనంత సక్రమంగా పని చేయాలని
  • తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్చగా వెల్లడించే అవకాశం ఉండాలని  కోరుకుంటూ......

2 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

చిన్ని కోరికలు అంటూ ఇంత భారమైన కోరికలా:-)
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.

మయూఖ చెప్పారు...

ధన్యవాదాలండి పద్మగారు.నిజంగా భారమైనవి అంటారా?