మళ్ళీ 28 డెడ్ లైన్ సమీపిస్తుండడంతో తెలంగాణా సమస్య మీద చర్చలు , వాదాలు మొదలైయ్యాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏళ్ల తర్వాత కూడా పాలకులు ప్రజల కనీస అవసరాలైన త్రాగే నీరు ,విద్య ,వైద్యం అందించ లేకుండా ఉన్నారు.రాష్ట్రాలు ఎన్ని ముక్కలైనా పాలకుల మైండ్ సెట్ మారకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.చిన్న సర్పంచ్ స్థాయి నుండి పాలకులు అవినీతి లో మునిగి తేలుతున్నారు.రాజకీయాలలోకి రావడం అంటేనే సంపాదనకోసం అనే అభిప్రాయంతో వస్తున్నారు.ప్రజలకు కూడా పాలకుల మీద నమ్మకం పోయింది.ఓట్ల రోజు తమకు ఇచ్చేదే గతి అని నిర్ణయించు కున్నారు.కావున ఆ రోజు రాజకీయ నాయకులు ఇచ్చేది తీసుకొని ,ఆ రోజు ఓట్లలో నిలబడిన వాళ్ళలో తమకు నచ్చిన వాడికి ఓటు వేసి తమ పనులలో తాము పడి తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు.
17, జనవరి 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
9 కామెంట్‌లు:
రాష్ట్రం ఇలాగ ఉండి ఏమీ ఒరగనప్పుడు విడిపోతే ఏదో వొరుగుతుందని ఆశ... ఉండకూడదా??
raashtraanni 4 mukkalu cheste tappemee ledu. manchide
@ajnaata
neelanti pichoollu kuda undochhu
కేవలం రాజకీయనాయకులకి మాత్రమే ఒరుగుతుంది, ముఖ్యమంత్రులు ఇద్దరవుతారు , మంత్రులు రెట్టింపవుతారు , జనాల్ని బాగా దోచుకోవచ్చు
మదరాసు రాష్ట్రాన్ని ముక్కలు చేసేముందు అడగని ప్రశ్న ఇప్పుడెందుకు?
రాష్ట్రం కలిసి ఉంటె నీరు, విద్య, వైద్యం వగైరాలు అందుతాయని కానీ అవినీతి తగ్గుతుందని కానీ నమ్మకం ఉందా? లేనప్పుడు ఎన్ని ముక్కలయినా నష్టం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏమి ఒరుగుతుందనే దానికన్నా ప్రజాభిమతం ఏమిటనేది ముఖ్యం.
జై గారు మద్రాస్ రాష్ట్రం నుండి వచ్హింది,భాషా ప్రయుక్త రాష్ట్రంగా.కాని ఇక్కడ అలా లేదుగా కొంత సేపు అభివౄద్ది అన్నారు,అభివౄద్ది లెక్కలు చూపిస్తే ఆత్మ గౌరవం అంటున్నారు.ఏదో ఒక దానికి కట్టు బడి ఉండాలిగా.
రెడ్డి గారూ, మీరు "రాష్ట్రాలు ఎన్ని ముక్కలైనా పాలకుల మైండ్ సెట్ మారకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు" అన్నారు. దీనికి భాషకు ఏమయినా సంబంధం ఉందా? "భాషాప్రయుక్త రాష్ట్రాలు" అనే పద్దతి నీరు విద్య వైద్యం వగైరాలు ఇవ్వదు కదా.
మీరు తెలంగాణా వద్దనుకోవడం మీ ఇష్టం. దానికి నీరు విద్య వైద్యం వగైరాలు రావు అనే కారణం చెప్పడం మాత్రం అంత అతకడం లేదు.
అభివృద్ధి గురించి కొందరు సమైక్యవాదులు చూపించే కాకిలేక్కల జోలికి ఇప్పుడు వద్దు లెండి.
* రాజకీయనాయకులకు బాగానే లబ్ధి చేకూదుతుంది.
* ప్రజలకు ఒరిగి ఒళ్ళో పడేది యేమీ లేదు.
* రాజకీయ కలహాలు ఇంతటితో ముగింపు అనుకున్నది ఒఠ్ఠి భ్తమ అని తేలే రోజు త్వరలో వస్తుంది. ఇది అంతం కాదు ఆరంభం అని అందరికీ అర్థం అయే నాటికే కాలాతీతం అవుతుంది.
* how small is too small అనే రేపటి ప్రశ్నకు మనం తెరతీస్తున్నామేమోనని ఆవేశపరులు ఆలోచించుకునే రోజు తప్పక రావచ్చు.
* ప్రజలు రాజకీయాల్లో ఓటర్లుగానూ పావులుగానూ తప్ప మరేమీఘనపాత్ర లేని వారని తెలిసి వస్తుంది.
@శ్యామలీయం:
"how small is too small అనే రేపటి ప్రశ్నకు మనం తెరతీస్తున్నామేమోనని ఆవేశపరులు ఆలోచించుకునే రోజు తప్పక రావచ్చు"
ఇది నిన్నటి ప్రశ్న, రేపటి ప్రశ్న కాదు. పంజాబ్,హర్యానా, అస్సాం, డిల్లీ, గోవా లాంటి రాష్ట్రాలు ఏర్పడడంతో ఈ ప్రశ్నకు శాశ్వతమయిన జవాబు ఎప్పుడో లభించింది. ఎవరు ఎంత బుకాయించినా ఈ వాస్తవం మారదు. తమ స్వప్రయోజనాల కోసం కొందరు చచ్చిన పామును చంపుదామని ప్రయత్నంలో భాగమే ఈ ప్రశ్న.
కామెంట్‌ను పోస్ట్ చేయండి