ఈ కాలంలో ప్రకటనలు ఇచ్చే వాళ్ళు నెగెటివ్ ను పాజిటివ్ గాను పాజిటివ్ ను నెగెటివ్ గాను చెప్పుకుంటున్నారు.అలాగే ప్రజలు స్వీకరిస్తున్నారు కూడా !ఎందుకంటే అపార్ట్మెంట్ లు కట్టే వాళ్ళు ,ఇళ్ళ స్థలాల లేఅవుట్ వేసే వాళ్ళు తమ అపార్ట్మెంట్ లకు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్లు ,సినిమా హాలులు ,పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయని ప్రకటనలు ఇచ్చు కుంటున్నారు.ఒకప్పుడు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఇల్లు కట్టుకునేవారు కాదు ,ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందని.అలాగే ఇంటికి దగ్గర్లో సినిమా హాలు ఉంటే శబ్ద కాలుష్యం ఉంటుందని ,రకరకాల పోకిరి వ్యక్తులు వస్తారని ఇల్లు కట్టు కునే వారు కాదు.అలాగే కాలుష్యం ఉంటుందని పరిశ్రమలకు దూరంగా ఇల్లు కట్టుకునేవారు.కానీ నేడు ఆ నష్టాలనే లాభాలుగా ప్రచారం చేస్తున్నారు.ప్రజలు కూడా వాటివెంటే పరిగెత్తుతున్నారు.అదీ కలికాలం అంటే !
6, జనవరి 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి