ముందు జరిగిన గోకుల్ చాట్ ,లుంబిని పార్క్ లో జరిగిన పేలుళ్లు ప్రజలు మరచి పోక ముందే నిన్న హైదరాబాద్ లో పేలుళ్ళు జరిగి ప్రాణనష్టం ,క్షతగాత్రులు కావడం ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజలకు తమ ధన ,మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది . ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఎవరి కోసం పని చేసున్నాయి. ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ ఇవ్వలేని పరిస్థితి. అఫ్జల్ గురు ,కసబ్ ఉరి నేపథ్యంలో వివిధ తీవ్రవాద సంస్థలు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని తెలిసి కూడా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను తీవ్రవాదులకు వదిలేసి ఇంత చేతగాని తనంగా ఉండడం చాలా ఆశ్చర్యకరం.ఒకరేమో తమ పదవిని నిలబెట్టు కోవడానికి ,ఇంకొకరు ఆ పదవిని లాగడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారే తప్ప ప్రజల గురించి చాలా తక్కువ సమయం పట్టించు కుంటున్నారు . రాజకీయాలు ప్రజల కోసం ,ప్రజల సేవ కోసం అని కాకుండా అధికారాన్ని అనుభవించడానికి ,డబ్బులు సంపాదించడానికి మాత్రమే అని రాజకీయ నాయకులు అనుకున్నంత వరకు వాళ్ళ మైండ్ సెట్ మారనంతవరకు ప్రజలు ఇలా బాధలు పడవలసిందే!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి