22, జనవరి 2013, మంగళవారం

SC/ST ,OBC సోదరులకు అంత సహృదయత ఉందా?

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

5 కామెంట్‌లు:

ramjee చెప్పారు...

Yes, సహృదయత ఉంది కాని కెంతమందికే ఉంది అన్ని అన్యాయాలు నడుస్తున్నాయి కదాని ఇదీ నడిపిస్తున్నారు అంతే

అజ్ఞాత చెప్పారు...

I am under OBC, still am against to reservation. I don't like reservation.

అజ్ఞాత చెప్పారు...

ఆ విధంగా చేయాలంటే దానికి చాలా ఆత్మాభిమానం ఉండాలి , నేనైతే అవుతుందని అనుకోను.

అజ్ఞాత చెప్పారు...

jai gottimukkala లాంటి విజ్ఞులు దీని మీద మాట్లాడాలి.

Gopal చెప్పారు...

అందరు ఉద్యోగం పొందినవారు ఈ త్యాగం చెయ్యనక్కర లేదు కాని రాజకీయాల్లో ఉన్నవారు తమ పిల్లలను జనరల్ లోకి మార్పించాలు - అప్పుడు మీరా కుమార్ గతి ఏమిటి. అలాగే గెజిటెడ్ అఫీసర్లు తమ పిల్లలను జనరల్ కేటగరీలోకి మార్పించాలి. క్లాస్ ఫోర్ ఉద్యోగులకు ఇది వర్తింపచెయ్యనక్కరలేదు. రెండో తరం కాకపోతే మూడోతరం వారేనే తమను జనరల్ లోకి మార్చుకోవాలి.