6, అక్టోబర్ 2013, ఆదివారం

ఓటుకు డబ్బులు తీసుకోవడం ధర్మమేనా!

చాలా మంది  డబ్బులు తీసుకొని ఓటు వేయకూడదని చెబుతూ ఉంటారు.కానీ వివిధ పార్టీల నాయకులు ఇచ్హే  డబ్బులు వాల్లేమీ స్వంతం చెమటోడ్చి కష్టపడి సంపాదించినవి కావు.అవి ప్రజలవే.ప్రజలు తమ డబ్బు తాము తీసుకొని పోటీ చేసిన వాల్లలో తమకు నచ్హిన వాల్లకు ఓటు వేస్తుంటారు.ఎందుకంటే అందరు అభ్యర్థులు డబ్బులు ఇస్తున్నారు.ఇది తప్పు కాదనుకుంటాను.ఒక వేల వీల్లు డబ్బులు తీసుకోకున్నా అవినీతి చేసే నాయకులు చేయకుండా ఉండరు.ప్రజలు డబ్బులు తీసుకోవడం వలన రాజకీయ నాయకులను కొంచమైనా ఆర్థికంగా తగ్గించ గలుగుతున్నారు.

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

దొంగిలించిన సొమ్ము దొరికినా తిరిగి రాజుకి అప్పగించమని ధర్మ సూత్రం. భారత శిక్షాస్మృతి ప్రకారం లంచం తీసుకోవడం, పుచ్చుకోవడం, రెండూ నేరమే. మనం నీతి తప్పాకా ఎదుటివాడిని తప్పుబట్టే అర్హత ఉండదు. పైన చెప్పిన విధంగా, నీతి మాలిన వాడు నీతిమంతులనెలా ఎన్నుకుంటాడు? మనం వోటుని అమ్ముకున్నాకా, వాడు మనల్ని అమ్మేస్తాడు. మనకి వేయ్యో రెండువేలో పడేసి, వాడు కోట్లకి పడగలెత్తుతాడు. ఒకవేళ తర్వాత నిలదీసినా, "వోటుని అమ్మేసుకున్నాకా, నువ్వు ననేమిటి అడిగేది?" అంటే ఏం చెబుతారు? చదువుకున్నవారే అధర్మాన్ని ఆశ్రయిస్తోంటే, ఇక చదువు రాని వాళ్ళ మాటేమిటి? వాళ్ళే నయమేమో?

Padmarpita చెప్పారు...

కొత్త పంధాలో సమర్ధించుకోవడమేమో ? :-)

మయూఖ చెప్పారు...

ఆవేశపడి పోకండి అజ్నాత గారు,నాకు ఒక విషయం చెప్పండి.ఒక వేల ప్రజలు డబ్బులు తీసికోకుండా ఓట్లు వేస్తే వాల్లు ప్రజలకు న్యాయమ్ చేస్తారా?ఇన్ని సంవత్సరాలలో ప్రజలకు న్యాయం జరిగిందా?రాజకీయనాయకులు తాము చేసే తప్పులను కప్పి పుచ్హు కోవడానికి ,ప్రజలను నిందిస్తూ ఉంటారు,ఓట్లను అమ్ముకున్నారని.ఇక్కడ రాజకీయ నాయకులు అంత మంచి వాల్లైతే రాజకీయాలలోకి రాక ముందు వాల్లకు ఉన్న ఆస్తులకు రాజకీయాలలోకి వచ్హిన తర్వాత ఉన్న ఆస్తులకు పొంతన ఉండడం లేదు.ఇక్కడ ప్రతి పార్టీ వాల్లు డబ్బులు ఇస్తున్నారు,నిలబడిన అభ్యర్థులలో వీలైనంత మంచి వానికి ఒకనికి మాత్రమే ప్రజలు వోట్లు వేస్తున్నారు.ఇక్కడ నా పోస్ట్ ఉద్దేశ్యం ఏమంటే ప్రజలనుండి దోచుకున్న ప్రజల డబ్బును రాజకీయనాయకుల నుండి వీలైనంత తిరిగి రాబట్టు కోవడమే!ఆ కొంచమైనా రాబట్టక పోతే వాల్ల ఆస్తులు విపరీతంగా పెరిగి వాల్లకు పట్టపగ్గాలు లేకుండా పోతారు.కొంచం బ్రేక్ వేసినట్లు.

అజ్ఞాత చెప్పారు...

అంతగా రబట్టుకునాలనుకుంటే చట్టం ద్వారా అది సాధించవచ్చు కదా.... ఇప్పుడు డబ్బు తీసుకుని వోటు వెస్తె మహా అంటే 1% రాబట్టగలం కానీ వాడికి ఇచ్చే అధికారం తో దేశాన్ని అమ్మేయవచ్చుగదా....
ఇదెలాగుందంటే అప్పు తీర్చడానికి వొళ్ళు అమ్ముకున్నట్లు అవినీతి డబ్బు కక్కించటానికి నోటుకు వోటు వేస్తారా..?

అసలు దేశం లో కాంగ్రెస్స్ తప్ప వేరే పార్టీలు ఎన్ని రోజులు రాజ్యం ఏలాయి అని అంతా ఏక పార్టీ వ్యవస్థనే కదా.... అడిగేవాడు లేడని ఇలా దోస్తున్నారు.
ఇన్నేళ్ళుగా ఏం మారింది అన్నారు ఇన్నేళ్ళుగా మనం ఎన్నుకున్న పార్టీ ఒకటే వారి విధానం ఒక్కటే ... అలాంటప్పుడు మార్పు ఎలా వస్తుంది?

ఒక మహానుభావుడు అన్నాడు విఫలం అయిన ఒకే ప్రాసెస్స్ తో మళ్ళీ మళ్ళీఅ ప్రయత్నించినంత మాత్రాన విజయం లభించదు అని మర్పు కావాలి అంటే ప్రయత్నాన్ని మర్చాలి కానీ కాంగిరేసుకు బానిసలయ్యి వోటుని అమ్ముకోవడం మార్గం కాకూడదు.

(ఓ కాంగి ....అనగానే కర్ణాటక అంటరేమో ఇప్పటి 6 కాంగిరేసు మంత్రుల పై చార్జ్ షీటు బూక్ అయింది గనుల అక్రమ కేసు లో జనాన్ని మేడియా తప్పు దోవ పట్టీంచి కాంగి కి అధికారం ఇచ్చింది).


Narsimha K

మయూఖ చెప్పారు...

ఆ డబ్బులు ఎవరివి ?

rangarayan చెప్పారు...

డబ్బులిచ్చి గెలిచిన నాయకులు పదవిలోకి రాగానే ఆ డబ్బులు సంపాదించాలనుకుంటారు కదా. డైరక్ట్ గా ప్రభుత్వ సొమ్ము తీసుకోలేరు కదా. కాంట్రాక్టర్లకు పనులిప్పించి అందులో వాటాలు తీసుకోవాలి. వాటాలిచిన కాంట్రాక్టర్లు ఆ డబ్బులు మిగుల్చుకోవాలంటే నాణ్యత లేని వస్తువులు వాడతారు. దాని వలన ఏళ్ళ తరబడి మన్న వలసిన రోడ్లు, డాం లు ,బిల్డింగులు తొందరగా పాడైపోతాయి.హాస్పటల్స్ లో నాణ్యత లేని మందులు, పరికరాలు ఉంటాయి.మనం డబ్బులు సంపాదించుకుని కారుల్లో తిరగాలన్నా మంచి రోడ్లు ఉండవు.మన జీవితాలలో క్వాలిటీ ఉండదు.

మయూఖ చెప్పారు...

రంగారాయన్ గారు మీరు చెప్పేవన్నీ థియరీలు వినడానికి బాగానే ఉంటాయి.అవినీతి చేసే నాయకులు ఓటుకు డబ్బులు ఇస్తున్నామని చెప్పేవి సాకులు మాత్రమే.మా ఊరిలో సర్పంచును చాలా సార్లు ఏకగ్రీవంగా ,ఒక పైసా తీసుకోకుండా గెలిపించారు. చివరికి లేబర్ క్లాసు ప్రజలు కూడా ఒక పైసా కూడా తీసుకోలేదు.కానీ అతను ఊరికి చేసింది ఏమీ లేదు.అతను ఆర్థికంగా బలపడడం తప్ప ,దీనికి ఏమంటారు.ఇప్పుడు రాజకీయాలలోకి వచ్హేదే సంపాదన కోసం వస్తున్నారు.ఎవరూ ప్రజా సేవ చేద్దామని రావడం లేదు.కావున ప్రజలు ఓటుకు తీసుకోనంత మాత్రాన అతను ఏమీ ప్రజలకు ఒరగ పెట్టడు.