21, జనవరి 2013, సోమవారం

అభివృద్ధి అంటే అప్పులా ?

పూర్వం పెద్దలు అప్పులు అంటే  భయపడేవారు.కానీ ప్రతి ఒక్కరికి నివాసం ఉండడానికి ఇల్లు ,తినడానికి తిండి  ఉండేది.అప్పులు మాత్రం ఉండేవి కాదు.ఒక వేల ఉన్నా కూడా భూమి కొనడానికో,పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో చేసే వారు.అవి కూడా తాము తీర్చ గలిగేంత మాత్రమే ఉండేవి.చాలా పొదుపుగా ప్రశాంతంగా   బ్రతికే వారు.కానీ నేడు ఎంత జీతం వచ్చినా వినిమయ  సంస్కృతి పెరిగి  ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి.అవి కూడా తాహతుకు మించి ఉన్నాయి.ఒకరిని చూసి ఒకరు ఇల్లో  ,కారో అప్పులు చేసి కొంటున్నారు.చివరికి ఇంటి లోని సామాన్లు కూడా అప్పులు చేసి కొంటున్నారు.పూర్వం కారు ఉందంటే  అతను  ఆర్థికంగా బాగా ఉండేవాడు.కానీ నేడు కారుకు నెలకు కనీసం  7000 రూపాయలు  కంతులు కట్టే వారు ఇంట్లో భోజనానికి మాత్రం నెలకు  అంత ఖర్చు పెట్టలేని వారున్నారు.ఇల్లు నెలకు పది వేల రూపాయలకు బాడుగకు దొరుకు తుంటే ,అదే మొత్తం కంతులు  కడితే మనకు  ఇల్లు స్వంతం అవుతే పరవా లేదు.కానీ నేటి పరిస్థితి అలా లేదు,నెలకు ఈ పది వేలకు తోడుగా మరొక ఇరవై వేలో ,ముప్పై వేలో కంతులు కట్టే విధంగా  అప్పులు చేయుచున్నారు.నాకు తెలిసి బెంగుళూరులో 20X30(600 చదరపు  అడుగులు ) స్థలంలో కట్టే డూప్లెక్ష్  ఇల్లును కనీసం కోటి రూపాయలకు అమ్ముతున్నారు.ఆతను నెలకు కనీసం కంతే 90000 రూపాయలు కట్టాలి.ఆ ఇల్లు కొనుక్కున్న వానికి అందులో పడుకుంటే నిద్ర పడుతుందా ?దీన్నే అభివృద్ధి అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం.అభివృద్ధి అంటే  అప్పులా ?   

కామెంట్‌లు లేవు: