పూర్వం పెద్దలు ఉద్యోగాలు చేసేటప్పుడు ముందుగా పిల్లల చదువులు తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేసి భాద్యతలు తీరిన తర్వాత ఇల్లు గురించి ఆలోచన చేసేవారు.వీలైతే అప్పు చేయకుండా తమ స్వంత డబ్బు తో కట్టుకునేవారు లేకపోతే స్వంత ఊరికి పోయి తమ పూర్వీకుల ఇళ్లలోనే కాలం వెళ్లి బుచ్చేవారు.ఇల్లు అనే దాన్ని ఒక ఆస్తి గా చూసే వారు కాదు.అది కేవలం నివాసం ఉండడానికి ఒక గూడు లాగా అను కునే వారు.కానీ నేడు ఉద్యోగం లో చేరి చేరక మునుపే ఇల్లు ,కార్లు బుక్ చేయుచున్నారు.అదీ 20 సంవత్సరాలకు లోన్లు తీసుకొని,నెలనెలా కంతులు చెల్లిస్తూ .పూర్వం పల్లెల్లో ఇండ్లలో జీతగాళ్ళను పెట్టుకునేందుకు ముందే కొంత మొత్తం చెల్లించే వాళ్ళు ,వాళ్ళు అది తీరే దాకా ఇండ్లలో వెట్టి చాకిరి లాగా పని చేసే వాళ్ళు.ఇప్పుడు చదువు కున్నోల్లు ,ఉద్యోగస్తులు చేసే పని దీనికంటే భిన్నంగా ఏమీ లేదు.ఒక యంత్రం లాగా ఆ కంతులు తీర్చడానికి భార్యా భర్తలు సమయం అనేది లేకుండా పని చేస్తున్నారు.చివరికి పిల్లల ఆలనా పాలనా కూడా చూడలేక పోతున్నారు. వీళ్ళ ఉద్యోగాలు ఎంత కాలం ఉంటాయో ఎవరికీ తెలియదు .ఒక వేల మధ్యలో పోతే అప్పులు తప్ప ఆస్తులు ఏమీ ఉండవు.ఒక వేల చివరి వరకు వీళ్ళు కంతులు కట్టి ఆ ఇల్లు స్వంతమైనా వీళ్ళు కట్టిన మొత్తానికి ఆ రోజు ఆ ఇంటికి ఉన్న విలువకు సరి పోతుంది.కొన్ని సందర్భాలలో వీళ్ళు కట్టిన మొత్తాల కంటే ఇంటి విలువే తక్కువ అవుతుంది.ఇంత తీవ్ర మైన ఒత్తిడి తో పని చేసి వీళ్ళు చివరికి సంపాదించింది ఒక గూడు ,కొన్ని రోగాలు మాత్రమే.అప్పటికి పిల్లలు చేతికి అంది వస్తే పరవా లేదు .లేక పోతే అంత కన్నా నరకం ఇంకొకటి ఉండదు.తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడానికి సమయం లేక వాళ్ళను ముద్దు చేసి ,వాళ్లకు తాము లేని లోటును తీర్చాలని వాళ్లకు అడిగినవన్నీ కొనిపించి ,చాలా వరకు పిల్లలు భాధ్యత లేకుండా పెరుగు తున్నారు.మనం అభివృద్ధి సాధించినామని చంకలు గుద్దుకుంటున్నాము ,ఆ అభివృద్ధి ఏమిటో ఒక 15 ,20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది.
15, జనవరి 2013, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
నిజమే. సొంత ఇంటి కోసం కష్టపడడం తప్పదు.
కాని కొంతమంది ఇన్‌వెస్ట్‌మెంట్ కోసం రెండు లేదా మూడు ఇళ్ళు కొనేసి, పిల్లలని క్రెష్ కొదిలేసి, మొగుడూపెళ్ళాలిద్దరూ గొడ్డు చాకిరీ చేస్తున్నారు.
బాగా చెప్పారు కాని, అంతకంతకీ పెరిగిపొతున్న జనభా తొ వుండడానికి చొటు లేని వాల్లు ఎంతొమంది వున్నారు. ఫట్నాలకి వెళ్లిన వాళ్లు ఎవరూ వెనక్కి రవటం లెదు, దానితొ వారు సంపాదించిన డబ్బు పల్లెలకు రావటం లెదు. ఫల్లెలలొ కులాలు గొడవ ఒకటి వుండనె వుంది. గ్రామాలలొ పొలాలు, ఇళ్లు లేక పొయినా పట్నాలకి వెళి బాగు పడ్డ వాళ్లు ఎంతొ మంది వున్నారు. ఈంక వుద్యొగం, జీవితనికి భద్రత లెక పొయిన ఈ రొజుల్లొ, కళ్ల ముందర కనిపించె స్థిరాస్థుల వెంట వెళ్లటం సహజమే కదా.
తప్పదు మరి. జనాభాతో పాటు అవసరాలు, ధరలు పెరిగిపోతున్నాయి. పల్లెల్లో, చిన్న పట్టణాల్లో జీవితం దుర్భరంగా అయిపోతోంది. కరెంటు, నీళ్ళు, డాక్టర్లు, రవాణా, అసుపత్రులు అన్నీ కొరతే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి