30, జులై 2013, మంగళవారం

భావోద్వేగాలను రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ పండగ!

తెలంగాణా తెచ్చుకున్నట్లు కాదు,ఒక వేల ఇస్తే ! భావోద్వేగాలను  రెచ్చగొట్టిన తెలంగాణా నాయకులకు ముందుంది ముసళ్ళ  పండగ,ఎందుకంటే తెలంగాణా ఇస్తే తాము ఏదో ఊడ పొడుస్తామని  తెలంగాణా ప్రజలందరికీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు . ఇప్పుడు తెలంగాణా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు. ఇంత భావోద్వేగం తో తెచ్చుకున్న తర్వాత ప్రజలు మార్పును చాలా తొందరగా కోరుకుంటారు . వాళ్ళను ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళు ఏమీ పని చేయకుండానే ఇంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పారు. కోరుకున్నన్ని ఉద్యోగాలు ,బంగళాలు దొరుకుతాయని ఆశ పెట్టారు. అక్కడి ప్రజలు ఒకటి ,రెండు సంవత్సరాలు చూస్తారు,వాళ్ళు కోరుకున్న మార్పు ఏమీ కనపడదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంతగా అభివృద్ధి చెందలేదు .కావున తెలంగాణా  ఇచ్చిన పార్టీకి, తెచ్చామని చెప్పిన పార్టీకి ఇద్దరికీ ప్రజలు వాతలు పెట్టి తాము ఎవరికీ ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు.  

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

> ఇప్పుడు తెలంగాణా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు
మన దేశప్రజలు, ఏ ప్రాఅంతం వాళ్ళు కానీయండి. నిశితంగా రాజకీయాలనూ రాజకీయ నయకులనూ గమనించే ఓపికా తీరికా తెలివీ ఉన్నవాళ్ళయితే కద! అలా నిశితదృష్టికల ప్రజలున్న దేశమే అయితే రాజకీయముఖచిత్రం ఇంత కుళ్ళుతో నిండి ఉండేదా?

>ఎలా మభ్య పెట్టారంటే వాళ్ళు ఏమీ పని చేయకుండానే ఇంట్లోకి డబ్బులు వచ్చి పడతాయని చెప్పారు.
రాజకీయనాయకులు పబ్బం గడుపుకుందుకు లక్ష చెబుతారు. నమ్మే ప్రజలది తప్పు.

> తెలంగాణా ఇచ్చిన పార్టీకి, తెచ్చామని చెప్పిన పార్టీకి ఇద్దరికీ ప్రజలు వాతలు పెట్టి తాము ఎవరికీ ఓట్లు వేయాలనుకుంటారో వాళ్ళకే వేస్తారు.
ఇది కేవలం ఆశావాదం. మనదేశంలో ఓటర్లు రాజకీయచైతన్యంతో‌ కాక ఇతర కారణాలతో‌ఓటు వేశ్తున్నారని మరచిపోతున్నారు.

కాయ చెప్పారు...

జీవితంలో మీకు మార్పులు కనిపిచట్లేవేమో.. గత పన్నెడేళ్ళుగా ఎంత రాజకీయ చైతన్యం వచ్చిందో చూస్తూనే ఉన్నారు కద.. హక్కుల కోసం ఎక్కువ మంది పోరాటాలు చేశారు..అయినా మీ టపా లో చెప్పే కారణాలు టీడీపీ, కాంగ్రెస్ వి విమర్శించేది మాత్రం టీఆరెస్ ని.. ఏమైనా చాతుర్యమా మీది ..

Unknown చెప్పారు...

30 జూలై 2013 మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై లాంచన ప్రాయ నిర్ణయం ప్రకటించిన సమయానికున్న స్థితిగతులను పరిశీలించినచో అనేక దోషాలు కనపడుతున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నక్షత్రం చిత్ర అనగా కన్యా రాశి. ఈ చిత్ర నక్షత్రానికి... ప్రకటించిన సమయానికి ఉన్న భరణి నక్షత్రానికి తారాబలం గమనిస్తే నైధన తార అవుతుంది. నైధనతార అంటే చాలా ప్రమాదకరమైన తార అని భావము. అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన్మరాశి కన్యకు చంద్ర స్థితి అష్టమంలో ఉండటంకూడా దోషం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటించిన సమయం మకరలగ్నం కావటం, ఈ లగ్నానికి కుజుని యొక్క తీవ్రమైన అష్టమ దృష్టి ఉండటం శుభకరం కాదు. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు మకర లగ్నానికి అష్టమ స్థానంలో ఉండటం కూడా దోషపూరితం. అంతేకాక ఈ ప్రకటన ప్రకటించిన సమయంలో ఉన్న యోగము గండ యోగం కావటం కూడా శుభకరం కాదు. పై లక్షణాల కారణంచే ఈ లాంచన ప్రాయ నిర్ణయ ప్రకటన కార్యరూపం దాల్చటం కష్టసాధ్యము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయానికి ఉన్న గ్రహస్థితి కంటే ఈ ప్రకటన వెలువడిన గ్రహస్థితి మరింత దారుణం. సమైక్యాంధ్రను కోరుకొనే తెలుగు ప్రజలందరూ ధైర్యంగా ఉండండి. సంయమనం పాటించండి.
- గార్గేయ సిద్దాంతి

Unknown చెప్పారు...

తెలంగాణా ప్రజలు ఆశావాదులు!గార్గేయ సిద్ధాంతుల నిరాశావాదం నమ్మరు!ప్రతిరోజూ మంచిరోజే!మంచిపనిని వాయిదావేయకూడదు!చూద్దాం గార్గేయ జ్యోష్య ఫలితం!చూద్దాం ఎలా కార్యరూపం దాల్చదో!

shayi చెప్పారు...

గార్గేయ గారు!
మీ జోతిష్య పరిజ్ఞానం ఏడ్చినట్టుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తారాబలం లెక్కిస్తే ఆ ఫలితం ఆంధ్రప్రదేశ్( కాబోయే సీమాంధ్ర)కి వర్తిస్తుంది. కొత్తగా పుట్టే తెలంగాణకు కాదు. తెలంగాణ అఫీషియల్ గా ఏర్పడిన నాడు ఆ కొత్త రాష్ట్రానికి ప్రథమ జన్మతార అవుతుంది. ఆ తరువాత ఆ రాష్ట్రానికి జరిగే సంఘటనలకి ఆ ప్రాతిపదికన తారాబలం లెక్కించవలసిఉంటుంది. మీరన్నట్టు కాంగ్రెస్ అధిష్ఠాన నిర్ణయ సమయం ఆంధ్ర ప్రదేశ్ కి నిజంగానే నైధన తార. అందుకే విచ్ఛిన్నం కాబోతుంది.

Jai Gottimukkala చెప్పారు...

రమణారెడ్డి గారూ, తెలంగాణా అమ్మ దయ తలిస్తేనో, బాబు బిక్షం వేస్తేనో, రావు మంతనాలిడితేనో రాలేదు. ప్రజాబలమే పునాదిగా, ఉద్యమమే ఊపిరిగా సోయికోచ్చిన సామాన్య ప్రజలు తెచ్చుకున్నారు. ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాను గంగలో ముంచడం ఏ (వి)నాయకుడి తరం కాదు. "ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తం" అన్న కాళోజీ మాటలు మరువం, వాళ్ళని మరువనివ్వం.

"వాడు తెస్తడని, వీడు తెస్తడని
అవ్వ ఇస్తడని, అయ్య తెస్తడని
ఇచ్చేందుకు వాడు ఎవ్వడురా
ఇది ఎవ్వాని జాగీరురా" (Udaya Bhanu song)

మయూఖ చెప్పారు...

jai garu,best of luck and best wishes.