ఈ మధ్యన కేదార్ నాథ్ లో జరిగిన ప్రకృతి విలయాన్ని చూసైనా ప్రజలు ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి.తమ స్వార్థం కోసం కాలుష్యాన్ని పెంచి ,నదీ పరీవాహక ప్రాంతాల్లో రకరకాల కట్టడాలు కట్టి ,అడవులను ధ్వంసం చేసి ,వివిధ రకాల ప్రాజెక్టులు కట్టి ప్రకృతిని నాశనం చేయడం మానుకోవాలి. అలా కాదంటే ప్రభుత్వాలు ,అధికార వ్యవస్థ చేయలేని పనిని ప్రకృతే తన చేతుల్లోకి తీసుకొని అక్రమమైన వాటినన్నింటినీ ధ్వంసం చేస్తుంది .
22, జూన్ 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
4 కామెంట్‌లు:
Good one
అంతే మరి...మొన్నటి ఎండలు చూసారుగా...ఇప్పటికీ వర్షాలు పడుతున్నా...భరించలేని ఉక్కపోత చూస్తున్నాం..ఇప్పటి కైనా ప్రజలూ..ప్రభుత్వాలూ మేల్కొంటే..కొంతయినా మంచి జరిగే అవకాసం ఉంది..కానీ ఎవరూ పరిష్కార దిశగా ఆలోచనే చేయడం లేదు...
2011లో చార్ధాం వెళ్ళాం!డబ్బు ఆశతో ప్రకృతిని హననం చేయడం కళ్ళారా చూసాం!ప్రపంచంలోని ఏ దేశంలో అయినా అంత మందిజనం విరుచుకపడుతుంటే ఎన్నో సౌకర్యాలు కల్పిస్తారు!కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారు!కేంద్రం ఇప్పుడు కోట్లసాయం ప్రకటించింది!అది ముందే చేస్తే విలువయిన ప్రాణాలు దక్కేవి కదా!ఇది చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదా!ఏదయినా ప్రాణం మీదికి ముంచుకొస్తే కాని కొయ్యగుర్రం లాంటి పాలనాయంత్రాంగం కదలదు!కదిలినట్లు కనిపిస్తుంది కాని ఉన్నచోటే ఉంటుంది!ఇప్పుడయినా సర్వ సౌకర్యాలు కలిగించికాని ప్రవేశానికి ఎవరినీ అనుమతించకూడదు!ఇది ఒక కనువిప్పు కావాలి!
@sooryuDu,kvsv,prakash గారికి ధన్య వాదములు. పుణ్యస్థలాలకు వెళ్ళి మన ప్రజలు చేస్తున్న పనులు కూడా గమనించాలి.ఒక వైపు గంగమ్మ తల్లి అంటూ పూజలు చేస్తూనే అదే నది లో అశుద్దం వేస్తున్నారు.అపరిశుభ్రం చేస్తున్నారు.వారణాసి లో అంత పెద్ద నదిలో ఒక గుక్కెడు నీళ్ళు కూడా త్రాగ లేని పరిస్థితి.అంత అపరిశుభ్రంగా ఉన్నాయి.వారణాశి లో ఆ ఘాట్ల వెంబడి ఒక్క శౌచాలయాన్ని కూడా నేను చూడ లేదు.ప్రజలకు మల మూత్రాలు ఎక్కడ విసర్జించాలో తెలియని పరిస్థితి.అందుకే ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు.దీనికంతకూ ప్రభుత్వ వ్యవస్థలే కారణం.ప్రజలకు కనీస వసతులు కూడా కల్పించలేక పోతున్నారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి