నా చిన్నప్పుడు తినే ఆహారం లో వైవిధ్యం ఉండేది . కొర్ర,ఆరిక ,జొన్నఅప్పుడప్పుడు వరి అన్నం తినే వాల్లం . అప్పుడు చాలా బాగుండేది . కానీ నేడు అవన్నీ మాయమైనాయి. ఒక్క వరి అన్నమే ఉంది .మనుషులకే కాదు చివరికి పశువులకు కూడా అప్పటికీ ఇప్పటికీ ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది . పూర్వం గడ్డివామిలో ఒక వరుస వేరుశనగ కట్టె ,ఒక వరస ఆరిక గడ్డి,ఒక వరస కొర్ర గడ్డి ,ఒక వరస జొన్న చొప్ప,ఒక వరస వరి గడ్డి ,ఒక వరస జొన్న కంకుల గగ్గులు ఉండేవి . ఇవన్నీ కూడా క్రిమి సంహారక మందులు ,రసాయనిక ఎరువులు వాడకుండా పండించేవారు . ఇవన్నీ వేసి ఒక సంవత్సరానికి సరిపడే గడ్డి వామి వేసే వారు. ఈ గడ్డి ని తీసుకొని వచ్చి పశువులకు వేస్తే వాటికి పంచభక్ష్య పరమాన్నం తిన్నట్లు ఉండేది ,అవి ఆవురావురు మని తినేవి. పుష్టిగా ఉండేవి . కానీ నేడు రైతులు గిట్టుబాటు కాక నో ,లేక మరొక కారణం చేతనో ఆ పంటలన్నీ మానుకొని రసాయనిక ఎరువులు ,క్రిమిసంహారక మందులు వాడి శనగ పంట మాత్రమే పండిస్తున్నారు. మిషన్లతో కొట్టించిన తర్వాత వచ్చిన ఆ శనగ పొట్టును మాత్రమే ఈ వాళ పశువులకు పెడుతున్నారు.అవి ఆకలికి తాళలేక ఆ పొట్టునే తింటున్నాయి . ఆ నోరు లేని జీవులను చూస్తే బాధ వేస్తుంది .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి