17, జనవరి 2013, గురువారం

ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.

వై.ఎస్. చని పోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రాంతాలకతీతంగా మన  రాష్ట్రం లోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు.జగన్ కూడా  ప్రజలకు దగ్గర అవుతూ ఒక బలమైన నాయకుడిగా  తయారవుతూ ఉంటే ,కాంగ్రెస్స్ అధినాయకత్వం జగన్ నాయకత్వాన్ని బలహీన పరచడానికి ,జగన్ ను సమర్థించే నాయకులను పరిమితం చేయడానికి తెలంగాణా అనే పాచిక వేసింది.తద్వారా జగన్ను ఒక రాయలసీమ  ప్రాంతానికి  మరియు రెడ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూసింది.కానీ చివరికి అదే వాళ్ళ మెడకు ఉరి త్రాడై చుట్టు కుంది.అంత చేసినా జగన్ను కట్టడి చేయలేక పోయినారు.తెలంగాణాను తేల్చ లేక పోయారు.రాజకీయంగా ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.చివరికి రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి లోకి తోసేసారు.  

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

kaneesam Chaduvukunnavallkaina artham kavatleda YSR and Jagan Dopidi gurinchi.Ilanti Dongalaki adikaram iste mana State lo inka emi migalavu.
jagan lati vallani nadi roddu lo vuri teeyali.

అజ్ఞాత చెప్పారు...

వాళ్లేమి గోతిలో పడలేదు. ముందుంది ముసళ్ల పండగ. ఆంధ్రా రాయలసీమ ప్రజలు రెడ్డి, కమ్మ, కాపుల నాయకత్వంలో 50సంవత్సరాలు వెనక బడతారు. ఆంధ్రాను ఎన్నో ఏళ్ళుగా పాలించిన రెడ్డి గాంగ్ భుస్వామ్య ముఠావాళ్ళు చేసిన అభివృద్ది అంట్టు ఎమీలేదు. చంద్రబాబు భూస్వామ్య ముఠాల కన్నా తాను కొంచెం ఎదో ప్రత్యేకం అన్నట్లు నటించి మళ్ళి అదే పాత పాట అందుకొన్నాడు. ఇక రెడ్డి గాంగ్ లొ మంచి పేరు తెచ్చుకొన్న రాజన్న భూములు అమ్మి, ఉచిత పథకాలు అమలు చేసి ఒక వేలుగు వెలిగాడు. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి మందగించటం మొదలైంది. ప్రభుత్వం దగ్గర సొమ్ము లేక గిల గిల కొట్టుకొంట్టుంది. అప్పుడు చూడాలి ఈ భుస్వామ్య ముఠాలు రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తారో. వాళ్ళలో వాళ్ళు కొట్టుకొంట్టూ ప్రజలను టాక్స్ ల తో పీల్చి పిప్పి చేస్తారు.

అజ్ఞాత చెప్పారు...

2004 లో 2000 కోట్లు అంటే ఒక వేల బంగారం లో ఇన్వెస్ట్ చేసి నట్లైతే ఆ రోజు బంగారం గ్రాము 585 రూపాయలు ఉండేది.కోటికి 17000 గ్రాములు వస్తుంది, 2000 ల కోట్లకు 3కోట్ల 40 లక్షల గ్రాములు వస్తుంది.దాన్ని ఇప్పుడు ఉన్న బంగారం రేటులో మార్చి చూడండి.అలాగే ఆ రోజు సరాసరి భూమి విలువ ఎకరానికి 20000 రూపాయలు అనుకున్నా ,ఈ రోజు భూమి విలువ ఎకరానికి సరాసరి 5 లక్షల రూపాయలు ఉంది. 2000 కోట్లకు ఎంత భూమి వచ్హిండునో దాన్ని ఇప్పుడు మారిస్తే ఎన్ని వేల కోట్లు అవుతుందో లెక్కలు వేయండి.

Jai Gottimukkala చెప్పారు...

ఒక రాష్ట్రం అంటే కోట్లాది మందితో సంబంధం ఉన్న విషయం. కెసిఆర్, రాజశేఖరరెడ్డి, జగన్, పొట్టి శ్రీరాములు లేదా ఎన్టీ రామారావు అంటూ ఒక వ్యక్తితో లంకె పెట్టడం భావ్యం కాదేమో ఆలోచించండి.

మయూఖ చెప్పారు...

జై గారు ఇప్పుడు అలాగే ఉంది.ప్రజల గురించి ఏ రాజకీయ పార్టీ ,రాజకీయ నాయకులు ఆలోచన చేయట్లేదు.తమకు ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయి అని బేరీజు వేసుకుని ,రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలా విభజించాలా అని ఆలోచన చేయుచున్నారు.విభజన కోసం ఉద్యమించే పార్టీలు కూడా ఏ టైం లో విభజిస్తే తమకు రాజకీయంగా మేలు అని లెక్కలు చూసుకుంటున్నారు. ప్రజల గురించి ఆలోచన చేయడం ఎప్పుడో మానేసారు.అసలు ఎప్పుడైనా ఈ విభజన ఉద్యమాలు మొదలైయ్యేది ,మొదలైంది రాజకీయ నాయకులకు తమకు అనుకున్న పదవులు దక్కనప్పుడే. ఈ కాలం రాజకీయ నాయకులు తమ స్వార్థం లేకుండా ప్రజల కోసం ఎప్పుడైనా ఉద్యమాలు నిర్మించారా?తెలంగాణా ఉద్యమం ప్రజల కోసం అని మీరు నమ్ముతున్నారా?

Jai Gottimukkala చెప్పారు...

"తమకు ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయి అని బేరీజు వేసుకుని ,రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలా విభజించాలా అని ఆలోచన చేయుచున్నారు"

టీజీవీ మాటలు (లీకులు) ఆధారంగా అభాండాలు ఎందుకు లెండి. ఆ మాటేదో వాయలార్ రవి ముఖంగా వింటే నమ్మబుద్దేసేది.

"తెలంగాణా ఉద్యమం ప్రజల కోసం అని మీరు నమ్ముతున్నారా?"

ప్రజల కోసం అయినా కాకపోయినా ఉద్యమం నిలబడింది ప్రజల నుంచే ("from" the people whether or not "for" the people).

ఇకపోతే తెలంగాణా ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా ఎందరో (ఉ. స్వ. జయశంకర్) ఉన్నారు. వారి చిత్తశుద్ధిని ఎవరూ తప్పు పట్టలేదు.