అందరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు .
- ఉన్న వాడికి లేని వాడికి చట్టం సమానంగా పనిచేయాలని
- పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు బాధితుని ఫిర్యాదును నిందితుని హోదాను పరిశీలించిన తర్వాత మాత్రమే స్వీకరించే పని చేయ కుండా ఉండాలని
- ఒక సారి రాజకీయాల్లోకి కాని అధికారంలోకి కాని వస్తే చిన్న పదవి నుండి ,పెద్ద పదవి వరకు ఉన్న వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరగ కుండా ఉండాలని
- రాజకీయ నాయకులు ప్రజల సొమ్మును ఎవరికి అవకాశం ఉన్నంత వాళ్ళు తిన్న తర్వాత నీవు ఎక్కువ తిన్నావు ,నీవు ఎక్కువ తిన్నావని విమర్శలు చేసుకోకుండా కొంచం ప్రజల గురించి ఆలోచన చేయాలని
- ప్రజల నుండి పన్నులు వసూలు చేసిన తర్వాత ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలని
- బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ,మూత్ర విసర్జన ,పొగ త్రాగడం చేయ వద్దనే ముందు ఉమ్మి తొట్లు ,మూత్రశాలలు ,పొగ త్రాగే రూములు పెట్టినామా అని ఆలోచన చేసి తర్వాత ప్రజలకు చట్టాలను గౌరవించాలని చెప్పాలని
- ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను ప్రవేశ పెట్టవద్దని
- ప్రతిభను గౌరవించాలని
- వ్యవసాయదారులను గౌరవించాలని
- ప్రజలందరూ బాధ్యత గా మెలగాలని
- అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని
- అన్ని వ్యవస్థలు వీలైనంత సక్రమంగా పని చేయాలని
- తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్చగా వెల్లడించే అవకాశం ఉండాలని కోరుకుంటూ......
2 కామెంట్లు:
చిన్ని కోరికలు అంటూ ఇంత భారమైన కోరికలా:-)
మీకు కూడా నూతనసంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదాలండి పద్మగారు.నిజంగా భారమైనవి అంటారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి