రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో
ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి
పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున
ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం
ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన అర్హులైన ,నిరుపేదలైన SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ
జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం
పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని
కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే
నాయకులు ముందు దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన
రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా
క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన
వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి అయ్యేటట్లుగా చట్టం లో మార్పు కోసం
పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్లు:
ఏ రిజర్వేషన్ తో ఒక పేద అమ్మాయి సిఎ లో టాప్ వచ్చింది. వీల్లింతే , మన వాళ్లకి ఆత్మాభిమానం లేకపోవడమే అతి పెద్ద లోపం. ఎంతసేపు ఉచితంగా వస్తే బాగుండు అని ఆలోచిస్తారు. పెదలైతే పరవాలేదు, డబ్బున్న వాళ్ళు కూడా ఇంతే
బేనీషా, కమలా ఫలాలు ఒక్కసారి తింటే వదలబుద్ధి పుట్టదు. అవి ఆరోగ్యానికి మంచివికూడా. ఏ ఫలాలైనా ఒక్కసారే తినాలని శాసించడం అన్యాయం, తగదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి