29, మార్చి 2010, సోమవారం

వై.ఎస్.కుటుంబం పై బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది .

వై.ఎస్ కుటుంబం మీద బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది.తొంబైలలో హైదరాబాదు నగరంలో మత కలహాలు జరిగినపుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారిని దించడానికి రాజశేఖరరెడ్డి గారే మతకలహాలు సృష్టించారని దుష్ప్రచారం గావించారు.దానిపైన ఒక కమిటీ ని కూడా వేసారు.చివరికి కమిటీ రాజశేఖరరెడ్డి హస్తం లేదని తేల్చింది. రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానాన్ని, రాజకీయ గ్లామర్ ను చూసి ఓర్వలేని కొన్ని పత్రికలు ,కాంగ్రెస్స్ పార్టీ లోని సోకాల్డ్ సీనియర్ నాయకులు ,ప్రతిపక్షాలు కలిసి ఆయనను ఫాక్షనిష్టు అని హత్యలు చేయిస్తారని విష ప్రచారం గావించాయి.ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో,ప్రజలను ఎంతగా ప్రేమిస్తారో ,సామాన్య ప్రజలు ఎంత సులభంగా ఆయనను కలుసుకోవచ్చో తెలిసింది.అదే ఆయన మీద విష ప్రచారం లేనట్లయితే ఆయన ఇరవై సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి అయి ఉండేవారు.అప్పుడు రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. వాళ ఉన్న ప్రాంతీయ వాదాలు తలెత్తేవి కావు.ఆయన చనిపోయిన తర్వాతకూడా ఆయనను శత్రువులు కూడా తలుచుకుంటున్నారు,ఆయన ఉంటే ఈవాళ రాష్ట్రానికి పరిస్థితి దాపురించేది కాదని.

వాళ హైదరాబాదు లో మత కలహాలు జరిగితే దానికి కూడా పరోక్షంగా జగన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు.జగన్ రాజ కీయ గ్లామర్ ను ఎదుర్కోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ,ప్రతిపక్షం వాళ్ళు ,జనాకర్షణ లేని నాయకులు రాజశేఖరరెడ్డి గారిని దెబ్బతీసినట్లుగా దెబ్బ తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినారు.దీన్ని జగన్ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ నాన్న లాగ రాజకీయాలలో రాటుదేలి ,తిరుగు లేని నాయకుడుగా ఎదుగుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

19 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ys edo pedda goppa vadu annattu rasaru, emi abhivrudhi chesadandi miku?

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత.

అజ్ఞాత చెప్పారు...

మన దేశంలో ఎంక్వైరీ కమీషన్లు ఎప్పుడైనా నిజాల్ని తేల్చాయా? ఎంక్వైరీ కమీషను రిపోర్టుని బట్టి వైఎస్సార్ కుట్ర లేదని తేల్చేశారు!! ఒకే అల్లరి మూక అక్కడే ఉన్న హిందూని, ముస్లిముని పొడిస్తే అవి మత ఘర్షణలు ఎలా అవుతాయి?

ఇక ఇంతగా ప్రజలను ప్రేమిచే వైఎస్సార్ అదేమిటి ముదిగొండలో అలా కాల్పులు జరిపించాడు? ఆయన తనకు ఎవరైనా అడ్డొస్తే అడ్డుతొలగించడానికి ఎంతకైనా తెగిస్తాడని మీకు తెలియద? లేక వైఎస్సార్ మీకేమయినా రియల్ ఎస్టేట్లో లాభం వచ్చేలా చేసాడా?

అజ్ఞాత చెప్పారు...

correct! baaga chepparu.. yevariki kaavalisina burada vaalu challukuntunnaru..

paddu చెప్పారు...

YSR గురించి నేను ఇప్పుడు కామెంట్ చెయ్యదలుచుకోలేదు కానీ, జగన్ గాడు మాత్రం పెద్ద వెధవ..అసలు YSR మరణం వెనుక వాడు ఉన్నాడని నాకు చాలా నమ్మకం....పదవి కోసం వాడు ఇది అంతా చేస్తున్నాడని నా నమ్మకం....పులివెందుల సీట్ విషయం లో కూడా, వాడు వాళ్ల అమ్మనే బెదిరించాడు,ఏదో సోనియా చెప్పింది అని ఒప్ప్కున్నాను లేకపోతే నాకు రాజకీయాలు వద్దు అని ఆవిడ చేత ఉరికే చెప్పించాడు. ఈ గొడవల వెనకాల వాడు ఉన్నదో లేదో తెలియదు నాకు కానీ YSR ఫ్యామిలీ ఏమీ పెద్ద గొప్ప ఫ్యామిలీ కాదు.

అజ్ఞాత చెప్పారు...

inka eppudu maarutharu meeru....YSR pedda raaju ayinattu, ayana aasthi emaina raasi ichada??...ayana taravatha malli ayana koduke raaju kaavala??

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు జరుగుతున్న గొడవలలో YS వాళ్ల పాత్ర ఉందో లేదో నాకు తెలియదు కాని, చెన్నారెడ్డి ని దింపటానికి జరిగిన (సృష్టించబడిన) మతకలహాలలో మాత్రం చచ్చిన దేముడు గారి పాత్ర చాలా ఉంది అని మాత్రం నాకు తెలుసు.
తలకాయకు ఇంతని రేటు చెప్పి బెజవాడనుండి తీసుకెళ్లిన గుండా గాళ్లలో ఆ రోజులలో నాకు తెలిసనవాళ్లు కుడా ఉన్నారు. అంతకముంది జరిగిన చాలా గొడవలకు, ఆ గొడవలకు తేడా కావాలంటే భాదితుల లిస్ట్ ఓ సారి చూడండి, ముసల ముతక, రోడ్డు పక్కన పండుకొన్న వాళ్లను ఆ గొడవలలో నరికి చంపారు, ఎందుకంటే మన చచ్చిన దేముడు గారు తలకాయల లెక్క పెంచటానికి తలయకాయకు ఇంత అని పెట్టిన రేటు మహిమ!! కాని అంత చచ్చి జనాలను చంపించినా pv వలన దేముడుకు అప్పుడు ఫలితం దక్కలేదనుకోండి, అది వేరే సంగతి.


ఆయన పత్తిత్తు అని కమిటీ తేల్చింది అంటే, కమిటీలు నిజాలు నిగ్గు తేల్చమన్నది మన దేశం లో ఎప్పుడయినా ఉందా? సిక్కుల ఊచకోతకు డిల్లీలో కాంగ్రెస్స్ కు సంబంధం ఉందని తేలిందా? బొంబాయి తమిళులు ఉన్న మురికివాడలు 1992 లో మతకలహాల పేరుతో తగలెట్టారని ఏమయినా తేలిందా? అంతెందుకు రాని యూరియా కు 200 కోట్లు దండుకొన్న మన PV పుతృసంతానం ఘనత ఏ కమిటీ అయినా, కోర్ట్ అయినా తేల్చగలిగిందా?

అజ్ఞాత చెప్పారు...

//ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో,ప్రజలను ఎంతగా ప్రేమిస్తారో ,సామాన్య ప్రజలు ఎంత సులభంగా ఆయనను కలుసుకోవచ్చో......//

hhaa haaa , ROFL

//అప్పుడే కదా మనలో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని అజ్ఞానం వైపు నుండి జ్ఞానం వైపు పయనించేది.//
Are you sure?

మయూఖ చెప్పారు...

ఈ కాలంలో ఉన్న రాజకీయ నాయకులతో పోలిస్తే వై.ఎస్. గారు 100 శాతం బెట్టర్.పేద ప్రజల గురించి ఆయన ఆలోచించినట్లు ,పేద ప్రజలకోసం ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు గురించి లబ్దిపొందిన వారిని ఒక సారి కలిసి అడగండి వారే చెబుతారు. తొమ్మిది సంవత్సరాలు అధికారం చేపట్టిన వారికి రాని ఆలోచనలు వై.ఎస్ గారికే ఎందుకు వచ్హినాయి ,ఎందుకంటే ఆయన ప్రజలను ప్రేమిస్తారు కాబట్టే ,మిగతా వారు అధికారం అంటే తాము అనుభవించడానికే అనుకుంటారు. తొమ్మిది ఏళ్ళలో ఎన్నో రైతుల ఆత్మహత్యలు జరిగాయి.ఈ వాళ పల్లెలకు వెళ్ళి చూడండి.పంటలకు గిట్టు బాటు ధర దొరికి ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు.రైతు కూలీలు ఆనందంగా ఉన్నారు. నాకు ఏమీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు,నేను ఒక చిన్న ఉద్యోగస్తున్ని మాత్రమే.ఆయన చనిపోయినపుడు వచ్హిన ప్రజా స్పందన చాలు ఎవరు ప్రజా నాయకుడో తెలుస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

చంద్రబాబు గారు అధికారం పొందడానికి ప్రతి చిన్న విషయాన్ని వాడుకుంటారు. చివరికి పిల్లల పెళ్ళిళ్ళు కూడా .ఉదాహరణకు ,వాళ్ళ బంధువుల పాపను జూనియర్ ఎం.టి.ఆర్.కు ఇవ్వాలనుకోవడం,బాలకౄష్ణ కూతురును తన కుమారునికి చేసుకోవడం ,నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉండి చంద్రబాబు గారు ఈ పని చేశారంటారా? తన అధికారానికి ఎం.టి.ఆర్ కుటుంబ సభ్యుల నుండి అడ్డం లేకుండా చేసుకోవడానికే తప్ప.ప్రజలకు సేవ చేసి అధికారం పొందాలని ఒక రోజైనా ఆలోచన చేశారా?ఈ కాలపు రాజకీయ నాయకులతో పోలిస్తే వై.ఎస్ .గారు నయమే కదా.చంద్రబాబు గారి మీద అలిపిరిలో దాడి జరిగినపుడు వచ్హిన ప్రజా స్పందన చూసారా,ఆ ప్రభుత్వం పోతే చాలనుకొని ప్రజలు అనుకునే వారు.

VARA చెప్పారు...

YSR ni devudi gaa cheyatam ee roju media ki...aa image srushtinchi cash chesukovaalnukone vaalla ki pedda kashtam kaadu...poojalu cheyistaaru.....gullu kattistaaru....
endukante ee janam lo 80% mandi engili koodu ki aasa pade vaalle...evadi ni dochinaa parledu...mana ki mushti veste free gaa adi chaalu anukone vaalle.......

Ika pote eeyanni devudini cheyataani ki...kaakaalu patte vaallu baane vuntaaru.......janam daggara dochukonna dabbu vundhi gaa era veya taani ki.......
mana yound industrialist...

kevalam dabbu kosam matam maarchukonna oka vyakti...tana koduku cheta baritees ganula mafia ki tera teesaadu.....aa master thana dabbu pravaaham to.thana muddula raajaa gaari ni (ade ippati prajala devudu gaaru)modati dafaalone MLA ni cheyinchaaru....modati dafaa lo ne 5 years experience koodaa lekundaa PCC chairman ni chesaaru...ivanni koodaa prathibha to ne vachaayi....aa prathibha elaantidante...aayana gaaru puttatame CM gaa parimalinchaaru....so PCC president ayina 4 ella ke CM post meeda kannesi...ika sontha party lo ne CM la meeda yuddaalu prakatinchaaru...vaallu chesina thappentante....puttagaane parimalinchina ee puvvu ki daari ivva ledu....asalu desam lo vere politicianse lepote...janam andaroo manchi vaallite ee devudu gaaru raavtame CM gaa vache vaallu...ee pati ki prapanchamanthaa prema panche karunaa moorthi gaari devaalayaalundevi....pchhhh ..chaalaa goram jarigipoyindhi desaani ki ..mariyu prapanchaani ki......ayinappati ki noo...eeyana gaaru sagam lo piki poyinanoo eeyana gaari ni devudi ni cheyataani ki jarige prayatnaalu jarugutoone vuntai...."anthaa taayatthu(THOTTU MEEDIA) Mahima"

ప్రేమిక చెప్పారు...

బురద లో ఉన్న వాళ్ల మీద మళ్లీ బురద చల్లనవసరం లేదు.

అజ్ఞాత చెప్పారు...

వై.ఎస్ గురించి మాట్లాడుతుంటే మద్యలో చంద్రబాబు ప్రస్తావన దేనికి, కాంగ్రెస్సు మార్కు ఎదురుదాడి రాజకీయాలు మీకు బాగా వంటబట్టినట్టున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

chinnappudu school ki velladam evariki istam undadahu kani parents teachers avasaramaithe kotti mari chaduvu nerpistaru appudu pillala drustilo teacher parents villans. kani adhe visayam lo adindhi aata paadindi paata ani vadilese teacher (maybe like ysr) aithe pillala drustilo devudavu laaga kanapadathadu(ee devude mee ysr) kani effect matram futurelo..

chandrababu teachers tho employees tho strict ga pani cheyinchadam valla aayanagaru villan ayyaru.

అజ్ఞాత చెప్పారు...

*ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో*

నాకు ఆయన అంటె వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు గాని, అడిమ్నిస్ట్రెషన్ లో ఆయన చాలా పూర్. వారి పాలనలో అవినితి కొత్త పుంతలు తొక్కింది. మున్సిపల్ కమిష్నర్ని అరెస్ట్ చేసి జైల్ కి పంపితె ఆరునేలలో పదోన్నతి కలిపించి హైదరాబాద్ కి ట్రాన్స్ఫెర్ చేసాడు. ఆయన వర్గం వారికి ఎక్కడలేని మద్దతు లభించి పిచ్చ పిచ్చ గా ప్రతి నాయకుడు దోచుకుని తిన్నారు. ఈ తినడం రోశయ్య గారి జమానాలో ఎక్కడ తగ్గుతుందేమోనని ఆందోళన చెంది జగన్ కి జిందాబద్ కొడుతున్నారు. పులివేందులలో దళితుల గుడిసెలు తగల బెట్టిన చరిత్ర వారికి ఉంది.

అజ్ఞాత చెప్పారు...

*ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో*

నాకు ఆయన అంటె వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదు గాని, అడిమ్నిస్ట్రెషన్ లో ఆయన చాలా పూర్. వారి పాలనలో అవినితి కొత్త పుంతలు తొక్కింది. మున్సిపల్ కమిష్నర్ని అరెస్ట్ చేసి జైల్ కి పంపితె ఆరునేలలో పదోన్నతి కలిపించి హైదరాబాద్ కి ట్రాన్స్ఫెర్ చేసాడు. ఆయన వర్గం వారికి ఎక్కడలేని మద్దతు లభించి పిచ్చ పిచ్చ గా ప్రతి నాయకుడు దోచుకుని తిన్నారు. ఈ తినడం రోశయ్య గారి జమానాలో ఎక్కడ తగ్గుతుందేమోనని ఆందోళన చెంది జగన్ కి జిందాబద్ కొడుతున్నారు. పులివేందులలో దళితుల గుడిసెలు తగల బెట్టిన చరిత్ర వారికి ఉంది.

అజ్ఞాత చెప్పారు...

EVM ల పనితీరుపై వెనక్కి తగ్గిన ఎలక్షన్ కమిషనర్ , BSNL ప్రైవేటీకరణ కు శాం పిట్రోడా సిపార్సు నివేదిక తెలంగాణ సమస్య, అంధ్రాలో బలహీన ముఖ్యమంత్రి, పాత బస్తీలో అల్లర్లు తదితర వార్తల నేపద్యంలో :

నవీన్ చావ్లా: ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీకి సహకరించాడు(అట)
శ్యాం పిట్రోడా: భారత దేశంలో శాంకేతిక విప్లవానికి ఆద్యుడు, రాజీవ్ గాంధీకి సన్నిహితుడు
పిట్రోడా సిఫారసులు:
30 శాతం వాటా అమ్మాలి.
3 లక్షల మంది ఉద్యోగుల్లో 1 లక్షమందిని స్వచ్చంద పదవీ విరమణ లాంటి పధకాలుపెట్టి రిటైర్ చేయించాలి
9 కోట్లా 30 లక్షల లైన్లతో జి.ఎస్.ఎం. మొబైల్ నెట్ వర్క్‌ని 35 వేల కోట్ల ఖర్చుతో విస్తరించాలనే ప్రతిపాదనకు స్వస్తి చెప్పాలి. పరికరాల ఆర్డర్లని ఆపివేయాలి. నెట్‌ వర్క్‌ని ఔట్ సోర్సింగ్‌ చేసుకోవాలి.
సంస్తకున్న కాళీ భూముల్ని వాణిజ్య పరంగా వాడుకోవాలి. ఆపని చెయ్యటానికి ఒక రియల్ ఎస్టేట్ సంస్తని ఏర్పరచాలి- అదీ ప్రైవేట్ భాగస్వామ్యంతో
ఈ మధ్య దేశంలో జరిగే కొన్ని అవాంచనీయ సంఘటనలకు(పాకిస్తాన్ మంత్రి ఫోటో ప్రచురణ, మహారాజా ఎక్స్ప్రెస్ కి గీసిన రూట్ మేప్ లో ఢిల్లీ ని పాకిస్తాన్లో చిత్రించడం మొదలైనవి ) ఇంతవరకూ ఎవర్నీ బాధుల్ని చేయలేదు ... ఎందుకో తెలీదు
బహుశా వీటన్నింటి వెనుకా నకిలీ కణిక వ్యవస్త హస్తం ఉన్నట్లు అనుమానం . నకిలీ కనికుడికి ఇందిర ,రాజీవ్ లంటే పడదు, వాల్లను Unpopular చెయ్యాలి.ఇందుకు ఇందిర, రాజీవ్ లకు సన్నిహితులైతే వాళ్ళ వేలితో వాళ్ళ కన్నే పొడిచినట్టు అని భావించి ఉంటాడు. ఆ విధంగా ఇందిర ,రాజీవ్ లకు సాధ్యమైనంత వరకు అపఖ్యాతి తేవాలని నకిలీ కణికుడి ఉద్ధేశ్యం లా కనిపిస్తుంది ,ప్రస్తుతం ఇందిర, రాజీవ్ లు జీవించిలేరు. అయినా సరే ఆ అపఖ్యాతిని వాల్లకు మూటగట్టాలని భావిస్తున్నాడు. నిజానికి ఇప్పూడున్నది ఇందిరా కాంగ్రెస్ కాదు ... ఇటలీ కాంగ్రెస్ . మరి ఈటలీ కాంగ్రెస్ చేసిన తప్పుకి ఇందిరాకాంగ్రెస్ ఎలా బాధ్యత వహిస్తుంది . *** పేపర్ చదివితే ఈ విషయం స్పష్టమౌతుంది ... దేశంలో అత్యంత వెనుకబడిన వాల్లు ముస్లింలు, సహజీవనం తప్పుకాదు అని సుప్రీం కోర్టు వాఖ్య ...ఇత్యాదివన్ని అతని సృష్టే ... మొత్తానికి దేశంలో ఏదొ జరిగి పొతోంది ... అన్నింటికీ ఏదో లింకుంది .

మధు చెప్పారు...

వై.ఎస్.రజశెఖరరెడ్డి,ఆయన కుమారుడు ఎమైనా ప్రజలను ఉద్దరించడానికి పుట్టిన దేవుళ్ళా. ప్రజలను దోచుకు(oటు)న్న వాల్లూ. వాళ్ళపై బురద జల్లడం అంటే బురద పై బురద జల్లడమే.

అజ్ఞాత చెప్పారు...

agree with you. లోపాలు లేవని కాదు కానీ ysr పధకాలు చాలా గొప్పవి. ఏడుపుగొట్టు కులపిచ్చి మనుషులకు అది ఒప్పుకోవటం చాలా కష్టంగా ఉంది.