13, మార్చి 2010, శనివారం

నీరు ఉండి నీరు లేని భారతదేశం!

మధ్యన ఒక నివేదిక లో ప్రపంచం లో ఎక్కువ భూగర్భ జలాలు వినియోగించే దేశాల్లో భారత దేశం కూడా ముందు భాగంలోఉంది,మరో ఇరవై ఏళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే స్థితి భారత దేశానికి దాపురించ వచ్చు,అనే వార్త చదివి పోస్ట్ వ్రాస్తున్నాను.

మనదేశం ఎన్నో జీవనదులకు పుట్టినిల్లు. అటువంటి దేశం లో ఇప్పటికీ గుక్కెడు మంచినీళ్ళ కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కిలోమీటర్ల కొద్దీ పోయి తెచ్చుకోవలసిన పరిస్థితి ఉంది.దీనికంతటికీ కారణం పాలకులకు ముందుచూపు లేక పోవడం,వాళ్ళ అక్రమసంపాదనే కారణం.ప్రజలు నీళ్ళ కోసం ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా పాలకులు మాత్రం శీతల పానీయాలు,మినరల్ వాటర్ తయారు చేసే బహుళ జాతి కంపెనీలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చారు.బహుళ జాతి కంపెనీలు ఒక లీటర్ శీతల పానీయం తయారుచేయడానికి తొమ్మిది లీటర్ల నీటిని వృధా చేస్తారని నేనెక్కడో చదివాను. విధంగాభూగర్భ జలాలను వృధా చేసుకుంటూ పొతే భూగర్భ జలాలు ఇంకి పోవడానికి ఇరవై సంవత్సరాలు అవసరం లేదు,అంతకంటే ముందే ఇంకి పోతాయి.

నేను ఒక సారి త్రివేణి సంగమం,వారణాసి కి వెళ్ళాను.అక్కడ పెద్ద సముద్రమంత నీళ్ళు ఉన్నాయి,కానీ ఒక గ్లాసు నీళ్ళు కూడా త్రాగలేని దౌర్భాగ్య పరిస్థితి,అంత అపరిశుభ్రంగా ఉన్నాయి.ఒక గ్లాసు నీళ్ళు త్రాగితే చాలు ఖచ్చితంగా కైలాసానికి పోవచ్చు.ప్రజలు ఒక వైపు" గంగా మాతా " అంటూ పూజలు చేస్తున్నారు,మరో వైపు అక్కడే మల మూత్ర విసర్జన చేస్తున్నారు.పూజల పేరుతో ప్రజలు ,పారిశ్రామికవ్యర్థాలను వదులుతూ ఫ్యాక్టరీలు విధంగా జీవనదులను కాలుష్యం చేసుకుంటూ పొతే చివరికి ప్రజలకు గుక్కెడు మంచినీరు లేకుండా పోతుంది.విశ్వహిందూ పరిషత్,శివసేన మరియు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు అనవసర విషయాలలో ప్రజలను రెచ్చగొట్టకుండా,నదులను అపరిశుభ్రం చేయ కుండా హిందూ సమాజాన్ని చైతన్య వంతులను చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారు అవుతారు. ముఖ్యంగా పాలకులు తమ స్వార్థ చింతన పక్కన పెట్టి దూరదృష్టి తో ఆలోచించి జీవనదులను కాలుష్యం బారినపడకుండా ,భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లు వాడకుండా కట్టడి చేయ వలసిన అవసరం ఎంతో ఉంది,లేక పొతే భవిష్యత్ తరాలకు ఒక గ్లాసెడు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురిస్తుంది.


5 కామెంట్‌లు:

vasantham చెప్పారు...

chaala baagaa chepparu, mana prabhutvaalu eppatiki melu kuntaayo..

Veeragoni చెప్పారు...

చాలా బాగా చెప్పారు.మన సమస్త సమస్యలకు ప్రధాన కారణం రాజకీయ వ్యవస్థ.దాన్ని మార్చే ఓట్ల పద్దతి.అవినీతి ఓట్లు,రాజకీయాలు,ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి,మనలాంటి వాళ్ళ కంట శోష డప్ప ఏమీ ప్రయోజనం కనిపించడంలేదు.అయిన నిరాశ పడకుండా మన ప్రయత్నం మనం చేద్దాం.

అజ్ఞాత చెప్పారు...

Rivers are natural carriers of human waste to the seas. Alternative way is to transport the waste to seas by surface transport trains/busses, which may not be economical. Not just politicians, but ignorance of people and increasing population & their need are the key points of the problem.
Sankar

kvsv చెప్పారు...

నీరు ఒక్కటే కాదు ఏ విషయంలోనూ మన పాలకులకు ఒక స్టాండ్ అంటూ లేదు ప్రస్తుత అసమ్మతి ఎలా అణచాలి?వచ్చే election ఎలా గెలవాలీ?ఇదే పద్దతి ఏ పార్టీ అదికారం లోకి వచ్చినా...

మయూఖ చెప్పారు...

@veeragoni,@ajnaata,@kvsv

agree with you