9, మార్చి 2010, మంగళవారం

ఎవరికోసం ౩౩ శాతం మహిళా రిజర్వేషన్లు?

ఈ వాళ ౩౩ శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చినందు వలన నిజంగా తెలివైన మహిళలకు ,సమాజహితం కోరే మహిళలకు ఏమీ ఉపయోగం ఉండదు.ఇప్పటికే రాజకీయాల్లో పాతుకు పోయి ఆ రాజకీయాలనే సంపాదన మార్గంగా ఎంచుకున్న దొరలకే ఉపయోగం ఉంటుంది.మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన స్థానాల్లో ఇప్పటికే పాతుకు పోయిన ప్రజాప్రతినిధుల భార్యలనో,తల్లులనో ,సోదరీమనులనో నిలబెట్టి గెలిపించుకుంటారు.రాజకీయాలు తిరిగి వాళ్ళ చేతుల్లోకే పోతాయి.సామాన్య ప్రజలు నిలబడితే గెలిచే పరిస్థితి లేదు.ఉదాహరణకు మార్పుకోసం వచ్చిన లోక్సత్తా పార్టీ పరిస్థితి ఏమైందో మన అందరికీ తెలుసు.దళిత రిజర్వేషన్లు పొంది ప్రజాప్రతినిధులు అయిన దళిత సోదరులు ఈ వాళ వాళ్ళ దళితులకు ఏమి చేస్తున్నారు,దళిత దొరలూ అయి వాళ్ళ ఆస్తులు పెంచు కోవడం తప్ప. ముఖ్యంగా ప్రజల భావన లో మార్పు రావాలి. అంతవరకూ రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదు.

8 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

అవసరమైన natural representation వచ్చేపరిస్థితులు సమాజంలో లేనప్పుడు corrective measure గా రిజర్వేషన్ అవసరం. ఇప్పటివరకూ మహిళల సమస్యలపై చట్టసభలు కేటాయించిన సమయం చూసుకుంటే మహిళల representation ఎంత అవసరమో తెలుస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

I agree with your opinion @Mayukha

Timeless ( for over decades) reservations are for genetically incompetant people. That's the list of growing with 'backward' people. Unfortunately, people are not ashamed to be called backward for decades. I wonder is that what Gandhi wanted? - A nation of majority ppl witout self-respect?

Reservations are for incompetant who can not compete with merit.

అజ్ఞాత -1

Kathi Mahesh Kumar చెప్పారు...

"genetically incompetent people".... what a display of arrogance by a person who took undeclared reservation and cumulative advantage from ages (not just decades)! Its pity and that's precisely why reservation is needed still.

మంచు చెప్పారు...

I agree with Ajnaata-1 and author

మధు చెప్పారు...

నిజమే ఒకవేళ ఈ రిజర్వేషన్లు అమలైనా ఆ విషయం చాలా మంది మహిళలు తెలుసుకోవడానికి కుడా ప్రయత్నించరు. చాలా మంది ఆడవాళ్లకు రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేదు. ముందుగా వారిలో చైతన్యం రావాలి.అందుకు ప్రభుత్వం కృషి చేయాలి.

మయూఖ చెప్పారు...

మహేష్ గారు రిజర్వేషన్ ఫలితాలు నిజమైన అర్హులకు అందుతున్నాయంటారా? రిజర్వేషన్ల వలన లబ్ది పొంది కలెక్టరో లేక ఇతర ఉన్నత ఉద్యోగాలు పొందిన వారి పిల్లలే తిరిగి తిరిగి రిజర్వేషన్లను ఉపయోగించుకొని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎగ బాకుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నిజమైన దళితులు ఎంత మంది ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకొని పైకి వస్తున్నారు.ఒక సారి రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందిన వారు తిరిగి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోకుండా ఉంటే ,అప్పుడు ఆ సౌకర్యం మిగతా వాళ్ళకు ఉపయోగ పడదా? ఈ విషయం లో దళిత పెద్దలు సాటి దళితుల కోసం ఎందుకు చొరవ తీసుకోవడం లేదు.రాజకీయ నాయకులు ఈ రిజర్వేషన్లను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకు నిజంగా దళితుల మీద ,వెనక బడిన వర్గాల మీద ఏమీ ప్రేమ లేదని దళిత మేధావులు ఎందుకు గ్రహించకుండా ఉన్నారు.ఈ రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించవలసిన అవసరం ఉంది.

Sravya V చెప్పారు...

I agree with the author ! 100 % correct !

ముస్టి మహేష్ కుమార్ చెప్పారు...

నెనొప్పుకోను అంతే