4, మార్చి 2010, గురువారం

టి.ఆర్.ఎస్ రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించు కోవాలి .

రాజీనామా చేసిన టి.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిధులకు ,కే .సి.ఆర్ కు తెలంగాణా మీద నిబద్దతను చాటుకునే మంచి ఆవకాశం ఇప్పుడుదొరికింది.వారు రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల తల్లిదండ్రులను గానీ ,వారి సోదర ,సోదరీమణు మణులను నిలబెట్టి (లగడపాటి రాజగోపాల్ గారు చెప్పినట్లు) ఏకగ్రీవంగా తెలంగాణా జే..సి వాళ్ళు ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే టి.ఆర్.ఎస్ వాళ్ళు చేసినది డ్రామా కాదు ,వాళ్ళు పదవులకోసం ప్రాకులాడే వాళ్ళు ఏమాత్రం కాదు అని తెలంగాణా ప్రజలకు తెలిసి టి.ఆర్.ఎస్ మీద తెలంగాణా ప్రజలలోగౌరవం పెరుగు తుంది. విషయమై .యు విద్యార్థులు మరియు తెలంగాణా జే..సి కృషి చేస్తే బావుంటుంది.అప్పుడు మాత్రమే అమరులైన తెలంగాణా విద్యార్థులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Why? What is the rationality in this demand?

Ppl may 'sacrifice' their relatives in exhange for MLA seats. :)

అజ్ఞాత చెప్పారు...

Luckily I am not from Telangana. otherwise my relatives might kill me for MLA seat.

Prasanth చెప్పారు...

How many people committed suicide? Isn't it 30+? How many seats are vacant? 10??..How do you resolve the conflict?

Lets not encourage/provoke these suicides with these kind of political gimmicks.

మయూఖ చెప్పారు...

లేక పోతే ఏంటండి,ఈ రాజీనామాల డ్రామాలు.టి.ఆర్.ఎస్. వాళ్ళు ఎన్ని సార్లు రాజీనామాలు చేసారు, ఏం సాధించారు.ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప.తిరిగి ఎలెక్షన్లు అవుతే ప్రజల డబ్బే కదా నాశనం అయ్యేది.కావున ఒకసారి ఇలాంటి డిమాండ్ పెడితే రాజీనామాల జోలికి పోకుండా మర్యాదగా ,ప్రజలను రెచ్హగొట్టకుండా ఉంటారు.సామాన్య ప్రజలు మాత్రమే చస్తున్నారు, ఒక్క రాజకీయనాయకుడు కూడా చావలేదు .ఇటువంటి డిమాండ్ పెట్టి చూడండి ,టి.ఆర్.ఎస్ వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది.నా ఉద్దేశ్యం ప్రజలు చావాలని కాదు,రాజకీయనాయకుల రెచ్హగొట్టే ప్రసంగాలు విని ఎవరూ చావకూడదు.

అజ్ఞాత చెప్పారు...

బావిలో కప్పలకు బయటి ప్రపంచమెంటో కనీసం అవగాహన కూడా లేదు రాదు...

ఇక్కడి ప్రజల బాధలు ఎక్కడో తెలంగాణేతర ప్రాంతంలోనో లేక హైటెక్కు నగరంలో కూర్చుని - లఘఢఫాఠి లాంటి లుచ్చాగాళ్ళ మాటలు మాత్రమే వినపడే మీ చెవులకు - అసలు అమాయక ప్రజలకు జరుగుతున్న అన్యాయమేంటో ఏం తెలుస్తది.

చెవ్టోని చెవుల శంఖం ఊత్తె ఏమైతది. ఇది రాసుడుగుడా గంతే.

మయూఖ చెప్పారు...

అజ్ఞాత గారూ మీ సమస్యలకు మీ పాలకులే కారణం.వాళ్ళను నిలదీయండి.తెలంగాణా లో నక్సలైట్లు పెరగడానికి కూడా మీ దగ్గర ఉండే దొరల,భూస్వామ్యుల అరాచకాలు,అప్రజాస్వామిక విధానాలే కారణం.మీరు మీ నాయకుల వైఫల్యాలను గుర్తించి ఎత్తి చూపకుండా ఉండడానికే మీ నాయకులు ప్రతి దానికీ ఆంధ్ర వాళ్ళను బూచిగా చూపుతున్నారు.అన్నీంటికీ సర్వ రోగ నివారణ తెలంగాణా రాష్ట్రమే అని ప్రజలను మభ్యపెడుతున్నారు.ఒక సారి ఆలోచించి వాస్తవాలను తెలుసుకోండి.