6, మార్చి 2010, శనివారం

కాంగ్రెస్స్ మార్క్ రాజకీయానికి చిత్తైన కే.సి.ఆర్

మాటిమాటికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఇప్పటివరకూ తన రాజకీయ పబ్బం గడుపుకొస్తున్న కే.సి.ఆర్ కు అదే రాజీనామా అస్త్రం బూమ్రాంగ్ లా తిరిగి వచ్చి తన మెడకే చుట్టుకునేటట్లుగా ఉంది.తన నిర్ణయాల్ని తెలంగాణా జే..సి. నిర్ణయాలుగా చెబుతూ ,ముందుగా రాజీనామాలు చేసి తెలంగాణా ప్రజల దృష్టి లో హీరో అయిపోదామని చూసారు.కానీ టి.ఆర్.ఎస్ వాళ్ళు,ఒక బి.జే.పి ఎం.ఎల్. తప్పకాంగ్రెస్స్ ,టి.డి.పి. వాళ్ళు ఒక్కరు కూడా రాజీనామాలు సమర్పించలేదు. వాళ తెలంగాణా లో అమరులైన విద్యార్థుల బంధువులను రాజీనామాలు చేసిన స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ ఊపందుకుంది.చనిపోయిన శ్రీకాంతాచారి తండ్రిని డిల్లీ లో కాంగ్రెస్స్అధిష్టానం పిలిపించి పరామర్శించింది. పరిస్థితులలో కే.సి.ఆర్ ,టి.ఆర్.ఎస్ వాళ్ళ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.కాంగ్రెస్స్ వాళ అన్ని స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.ఎందుకంటే కాంగ్రెస్స్ వాళ్లకు పోయేది ఏమీ లేదు,వస్తే టి.ఆర్.ఎస్. స్థానాలు తన వశం అవుతాయి.ఒక వేళ టి.ఆర్.ఎస్ వాళ్ళు స్థానాల్లో పోటీ చేస్తే తెలంగాణా ప్రజల దృష్టి లో దోషి గా నిలబెట్ట వచ్చు. పరిస్థితులల్లో కే.సి.ఆర్ ఎటువంటి చాణుక్య నీతిని చూపుతారో వేచిచూడాలి.కాంగ్రెస్స్ రాజకీయమా మజాకా!

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

TRS Screwed-upin their own game.

అజ్ఞాత చెప్పారు...

మాటిమాటికి రాజీనామా చేసేటి పిచ్చోల్లు మల్లీ పోటీ చేసుడు ఏమిటికి? బాయిలో దుంకిన్రు బోదురు కప్పల్లెక్క. ఆణ్ణే బెకబెక చేసుకోండ్రి. గద్దరన్న, గోరటన్న జజ్జినకరి. కోదండరాము బొత్స డూండాం ఆడుకోర్రి.

oremuna చెప్పారు...

Don't worry/think too much. In the end దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటారు.

చదువరి చెప్పారు...

:) ఔను!

అజ్ఞాత చెప్పారు...

మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి




http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/