తమను ఉద్దరిస్తారని ఎంతో ఆశతో మాయావతి గారిని అధికారంలోకి తీసుక వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా దళితుల భ్రమలు తొలగిపోయాయి.అక్కడ ప్రజలు ఎంతో పేదరికంతో మగ్గి పోతుంటే మాయావతి గారు ఇవేమీ పట్టకుండా పార్కులు,ఏనుగు శిల్పాలు,తన ప్రతిమలను రాష్ట్రం అంతటా పెడుతూ ,నోట్ల దండలను వేయించు కుంటూ ప్రజా ధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.అగ్రవర్ణాల ముఖ్యమంత్రులకు ఏ మాత్రం తీసి పోకుండా ఇంకా కొంచం ఎక్కువగానే మాయావతి గారు ప్రజాస్వామ్యాన్ని చాలా అపహాస్యం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక సారి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ఏ కులం వాళ్లైనా,ఏ మతం వాళ్లైనా వాళ్ళ లక్ష్యం ప్రజలను రాబందుల్లాగా పీక్కు తినటమే అని మరోసారి ఋజువైనది. తమ కులం వాళ్లకు రిజర్వేషన్ లు ఇచ్చి ,తమ కులం వాళ్ళను ముఖ్యమంత్రులను చేయాలని అలా చేస్తే తమకు వాళ్ళు ఏదో ఒరగ పెడతారని ప్రజలు భావించి పోరాటాలు చేయడం మాను కోవాలి.
21, మార్చి 2010, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్‌లు:
ఇప్పుడు ఈమె జనాలతో కబడ్డీ ఆడుతుంది,తర్వాత ములాయం సింగ్ గారు గద్దె ఎక్కి చెడుగుడు ఆడతాడు.కాంగ్రెస్ వారు,బీజేపీ వారు పక్కన నిలబడి చోద్యం చూస్తూ ఉంటారుఆయినా మొన్న మాయావతి ఎన్నికల వ్యూహం ప్రకారం అగ్రవర్ణాలనూ సహభాగస్వాములను చేసే కదా సింహాసనం ఎక్కింది?
*హిందూత్వం గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు దశావతారాలల్లో ఒక అవతారమైన (మత్స్యావతారమైన) చేపలను శుభ్రంగా భుజింఛే హిందువులను ఏమనాలి.చాలా మంది బ్రాహ్మణులు ముఖ్యంగా బెంగాళీ బ్రాహ్మణుల ప్రధాన మైన ఆహారం చేపలే ,దీనికి ఏమంటారో? పేదల పౌష్టికాహారాన్ని నిషేధించడం నిజంగా అప్రజాస్వామికం. కుహనా హిందూత్వ వాదులు ఇటువంటి పనులు చేయడం వలనే ముఖ్యంగా దళితులు హిందూ మతానికి దూరమయ్యారు.మహేశ్ గారు మీ అభిప్రాయాలతో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తాను.*
నీకు తెలుసుకునేదుకు ఆశక్తి, సమయం,ఒపికా ఉంటే వెళ్లి అమ్మఓడి బ్లాగామేని అడుగు పై ప్రశ్నలు ఆమే చెపుతుంది నీకు సమాధానం. అంతెకాని నీలొ ఉన్న మంచితనాన్ని ఇలాంటివారితో చేరి దుర్వినియోగ పరుచుకోకు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి