భారత దేశం ,పాకిస్తాన్ లను తెల్లదొరలు విభజించినప్పుడు హిందూ ,ముస్లిముల మధ్యన మతకలహాలు చెలరేగి కొన్ని వేలమంది చని పోయారని చరిత్ర చదివినప్పుడు ,ఒకే దేశం లో ఉన్న ప్రజల మధ్యన ఒకరినొకరు చంపుకునేంతగా ద్వేషంఎందుకు వస్తుందో నాకు అంతగా అర్థం అయ్యేది కాదు.కానీ రాజకీయనాయకులు తలచుకుంటే అదేమీ పెద్ద విషయంకాదని ఇప్పుడు చాలా క్లియర్ గా అర్థం అయ్యింది.తెల్ల దొరసాని చేసిన రాష్ట్రవిభజన ప్రకటన ఇంత వరకూ కలసి మెలిసిఉన్న తెలంగాణా ,ఆంధ్ర ప్రజల మనసులను విషపూరితం చేసినాయి.తెలంగాణా ఇచ్చినా లేకున్నా ఇరు ప్రాంతాల ప్రజలు మనసులను విషతుల్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది.
14, డిసెంబర్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్లు:
చాలా మంది ప్రజలకు ఎటువంటి ద్వేష భావమూ లేదు.తెలంగాణాను సపోర్టు చేసే ఆంధ్రావారినీ, సమైఖ్య ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకునే తెలంగాణా వారినీ కూడా నేను చూశాను. ఇదంతా మీడియా ప్రభావం. :)
నేను ప్రత్యేక తెలంగాణాకి అనుకూలమే. కానీ నేను ఉంటున్నది కోస్తా ఆంధ్రలో. మా కుటుంబం ఒరిస్సా నుంచి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో స్థిరపడింది. నేను తెలుగువాడిని కాదు, ఒరియా వాడిని కాదు. మా పూర్వికులు ఓ బాష మాట్లాడేవాళ్ళు. ఆ బాషలో తెలుగు, ఒరియా, హిందీ పదాలు కలిసి ఉండేవి. తెలంగాణాకి చెందని, తెలుగు జాతికి కూడా చెందని నేను ప్రత్యేక తెలంగాణాకి సపోర్ట్ ఇస్తున్నాను. కుల, మత, బాషా, ప్రాంత విద్వేషాలు రాజకీయ నాయకులకి ఉంటాయి కానీ సాధారణ ప్రజలకి ఉండవు.
నేను మనిషిని కాదు అలా అని జంతువునూ కాదు మనిషికి జంతువూ కు కాని కొత్త జాతికి సపోర్ట్ చేస్తాను . బిసినెస్ చేస్తాను
babu e vishayam sati bloggers kuda artham chesukunte bagundedi..
Thanks
ఇక్కడ వ్యాఖ్యలు చేసే వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ ప్రవీణ్ గారి అసంబద్ధమైన అర్థరహితమైన కామెంట్లు పట్టించుకోకుండా మీ అభిప్రాయలను స్వేచ్చగా వ్యక్తీకరించమని మనవి. ఆయన కామెంట్లకీ, టపాకీ ఏ సంబంధం ఉండదు.
అంతా ఈ రాజకీయనాయకుల వలనే జరిగింది .మనరాష్ట్రాన్ని అల్లకల్లోలంచేస్తున్నారు. మీడియా కూడా సగం కారణము.త్వరలోనే అన్నీ సద్దుమణుగుతాయని ఆశిద్దాము.
బాబోయ్ మీడియా అని జనం భయపడి పారిపోయే రోజు ఎంతో దూరంలో లేదు. అయినా ఒకరిని అని ఏం లాభం, ఆలొచించకుండా ఆవేశపడటం మన జన్యువుల్లోనే ఉంది.ఖండాల వాళ్ళు కొట్టుకుంటారు, సరె మనమంతా ఒకే ఖండం అనుకునే లొపల దేశాలు వేరంటారు,ఒకే దేశం అయితే రాష్ట్రాలు వేరంటారు.ఒకే రాష్ట్రం అయితే ప్రాంతాలు వేరంటారు. ఒకే ప్రాంతమయితే జిల్లాలు వేరంటారు.ఒకే జిల్లా అయితే గ్రామాలు వేరటారు.ఒకే ఊరు అయితే వీధులు వేరంటారు.ఒకే వీధి అయినా కులాలు వేరంటారు. ఒకే కులం అయినా ధనిక పేద అంటారు. ఏమీ చెయ్యలేని మన లాంటి వాళ్ళు నలుగురు కలిసి ఇదంతా రాజకీయం అంటాం.
ప్రవీణ్ కామెంట్లూ, వ్యాపార ప్రకటనలూ లేని ఏకైక బ్లాగు - శరత్ కాలం బ్లాగు. రండి విచ్చేయండి, తలనొప్పికి దూరంగా వుండండి. ఎదవ గోల.
కామెంట్‌ను పోస్ట్ చేయండి