బ్రిటిష్ వాళ్లు మనలను పాలించేటప్పుడు వాళ్ళను తరిమి వేస్తే ప్రజలంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ,సుఖ సంతోషాలతో తులతూగుతారని ప్రజలంతా భ్రమ పడ్డారు.కానీ ఈ వాళ ఏమైంది.స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలు పైబడింది.కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజలు ఒక్క పూట తిండికి కూడా నోచుకోకుండా ఉన్నారు.కనీసం రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక హక్కులు కూడా పొంద లేని పరిస్థితిలో ఉన్నారు.ఆ నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళలో గాంధీజీ,భగత్సింగ్,సుభాష్ లాంటి నిస్వార్థ పరులు ఉండే వారు. కానీ ఈ వాళ తెలంగాణా విముక్తి కోసం పోరాటం చేస్తున్నానని చెబుతున్న కే.సి.ఆర్. లాంటి వ్యక్తుల విశ్వసనీయత ఎలాంటిదో ప్రజలకు తెలుసు.తెలంగాణా ఉద్యమం చేపట్టక ముందు కే.సి.ఆర్. ఆస్తి ఎంత ,ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత.ఈ వాళ తెలంగాణా రాష్ట్రం విడిపోయినా కూడా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.అక్కడ దోపిడీ ఉండదని ప్రజలకు హామీ ఇస్తారా? ఈ వాళ ఆంధ్ర ప్రజలను బూచిగా చూపించి తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న వారు ,తెలంగాణా వచ్చిన తర్వాత అమాయక తెలంగాణా బిడ్డలను దోచుకోరని గ్యారెంటీ ఉందా.ప్రతి సమాజంలో పీడించే వాళ్లు ,పీడితులు ఉంటారు.ప్రజలు మోసపోకుండా హుషారుగా ఉండాలి,అంతేగాని తెలంగాణా వచ్చినంత మాత్రాన ఆ రాష్ట్రంలో అందరూ ఉత్తములు ఉండరు.హైదరాబాదు ముందే ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాతనే వెనక పడినామని చెబుతున్నారు.అభివృద్ధి అంటే ఒక చార్మినార్,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు.ప్రజలకు తగిన విద్యాబుద్దులు ఉండి వాళ్ల బతుకులు వాళ్లు బతికే విధంగా చేయడం.కానీ ఈ రోజుకు కూడా తెలంగాణా లోని ప్రజలు ఎంతో అమాయకంగా ,రకరకాల మూఢ నమ్మకాలలో బతుకుతున్నారు.ఎవరో వచ్చి వాళ్ళను మోసం చేస్తారని భ్రమల్లో ఉన్నారు.వాళ్ల మీద వాళ్లకు నమ్మకం లేదు.కావున ఎంత అభివృద్ధి చెందిందో ,మేము ముందే అభివృద్ధి చెంది ఉన్నామని చెప్పే తెలంగాణా మేధావులు జవాబు చెబితే బాగుంటుంది.తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు ఏదో ఒరిగి పోతుందని చెప్పి తెలంగాణా ప్రజలను ఎండమావుల వెంట పరిగెత్తించేది మానుకుంటే బాగుంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
gud
అభివృద్ది అంటే 10 నిమిషాల వానకి కాలనీలు జలమయం ఐపోవడం
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?
కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?
రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?
పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?
ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
ప్రజాకవి కాళోజీ నలభై ఈలల క్రిందట రాసిన కవిత ఇది. అయినా తెలంగాణా సమస్య అట్లాగే వుంది. తెలంగాణా ఉద్యమం మీద జరిగే విష ప్రచారం అట్లాగే సాగుతోంది. తెలంగానాది అభివృద్ధి కోసం అగచాట్లు కాదు, అస్తిత్వం కోసం, ఆత్మా గౌరవం కోసం ఆరాటం అంటే మీరు ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు?
You got it them on right point. Development means not the king palaces, development means education, healthcare, industrial development, infrastructure development, roads & drinkable water, agriculture development, creation of jobs.
ఈ గొఱ్ఱె లకు అది మాత్రం అర్ధం కాదు.
If they really have to find the facts, all they have to compare is
what their so called TelangaaNa area and the so called Andhra areas have today and what those areas have back in 1956. The facts would come out easily.
But they don't want to get into that for a reason.
పైన ఉన్న వాటితో తెలంగాణా వాదులు ఇంతవరకూ ఎందుకు రాలేదో మీ ఉహకే వదిలేస్తున్నా!!
ఇక 1956 లో మిగులు బడ్జెట్ ఉంది అంటున్న వాళ్ళు, అదే నోటితో మీ మొత్తం తెలంగాణా రాష్ట్రం కంటే, ఒక్క గుంటూర్ జిల్లాలో ఎక్కువ హైస్కూల్స్ ఉండేవి అన్న నిజం ఎందుకు దాస్తారు. మా నిజాం రాజు అన్న నోటితో , మీ భాష మీరు మాట్లాడితే, నేరుచుకొంటే తలల లతో పాటు, ఇన్కోటికూడా కోసేవాడు అని ఎందుకు దాస్తారు. బయటి రాష్ట్రాలకేల్లి మారీ తెలుగు చదువుకొని, బతికిన్చుకొన్న మీ వాళ్ళలను మీరే ఎందుకు అవమానిచుకొంటున్నారు.
చివరిగా ఇన్ని మాటలు వద్దు , మీకు మీరు చెప్పే నిజాయితీ అనేది ఏమయినా ఉంటె, ముందు పైన ఉన్న లెక్కలు తేల్చండి, అపుడు అడగండి ఎక్కడ వివక్షత నిజంగా జరిగిందో.
రెడ్డిగారు,
వృధా ప్రయాస :-)
తెలంగాణా వాళ్లకో ప్రశ్న,
గ్రేటర్(హైదరాబాద్) వేరైతే
దేశానికి ఆపత్తా?
గ్రేటర్ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
గ్రేటర్ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
గ్రేటర్ వేరైతే
తెలంగాణా తెలివి తగ్గిపొతుందా?
గ్రేటర్ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
గ్రేటర్ వేరైతే
చెలిమి లెండిపొతాయా?
కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?
రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?
పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?
ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?
గ్రేటర్ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణా కేమన్నా ఆపత్తా?
పై ముక్కలు లు రాయటానికి కాళోజి కానక్కర్లేదనుకొంటా :)
మరెందుకు గ్రేటర్ కోసం ఏడుపు? బొడ్డురాయి, గుండేకాయ డవిలాగులు. మీ ఉత్తర తెలంగాణా గొఱ్ఱేలెనకాల మమ్ములను నడవమని ఏడుపు!!
మా ఎన్నికలు మీకు లెక్కలేదు, మా ఊసులు మీకక్కర్లేదు, మేము మాత్రం మీకు కావాలి, మా డబ్బులు మాత్రం కావాలా పొద్దు పొద్దున కల్లు తాగు కోతిమూకలలారా!!
- సొళ్ళోజి
అజ్ఞాత అజ్ఞానీ !
నువ్వన్న so called ’ గొర్రె ’ లకు సంధించిన ప్రశ్నలు, లెక్కలు తేల్చుకొందామా?- అన్న ఛాలెంజులు చూస్తుంటే... నవ్వు వస్తుంది. జాలి వేస్తుంది
నిజమే ! ఇన్ని మాటలు అక్కర లేదు.
హైదరాబాదులో చిక్కడపల్లి ( అశోక్ నగర్ ) లో ఉన్న ప్రభుత్వం వారి ’ నగర కేంద్ర గ్రంథాలయం ’ లో ఇందుకు సంబంధించిన గ్రంథాలున్నాయి. వీలు చేసుకొని వెళ్ళి, నువ్వే అన్నట్టుగా ’ నిజాయితీ ’ తో అధ్యయనం చేయ్. అప్పుడు నీ నోటికి నువ్వే ప్లాస్టర్ వేసుకొంటావు. నీకే అర్థమవుతుంది - గొర్రె ’ ఎవరో !
కామెంట్‌ను పోస్ట్ చేయండి