3, డిసెంబర్ 2009, గురువారం

కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం

తెలంగాణా అనే భావోద్వేగ సమస్యని తెలంగాణా లోని రాజకీయ నాయకులు చాలా బాగా క్యాష్ చేసుకుంటున్నారు.మొదట చెన్నారెడ్డి ఆ సమస్యను ఉపయోగించుకొని అనేక పదవులు పొందినారు.ఇప్పుడు కె.సి.ఆర్. అదే పనిలో ఉన్నారు.ఒక వైపు ఏమో చచ్హేంత వరకు నిరాహారదీక్ష అంటున్నాడు, మరోవైపు ఏమో ఖమ్మంలో సౌకర్యాలు లేవంటున్నాడు.చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని.దీన్ని తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలు.ఎందుకంటే తెలంగాణా వాళ్ళు కలుస్తామంటే కర్నూలు రాజధానిని పోగొట్టు కొని హైదరాబాదు రాజధానిని ఒప్పుకున్నారు.హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.నాకు తెలిసినంత వరకు రాజధాని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాష్ట్ర విభజన కోరలేదు,తెలంగాణా వాళ్ళు తప్ప.తెలంగాణా వాళ్ళ కంటే బాలాథాక్రే చాలా నయమని పిస్తుంది.ఎందుకంటే ఆయన ముంబాయి మరాఠీ లది మాత్రమే అంటున్నాడు.కానీ ఇక్కడ ఆంధ్రావాలే భాగో అంటున్నారు.తెలుగువాళ్ళం అయి ఉండి తెలంగాణా ప్రాంతంలో ద్వితీయ శ్రేణి పౌరులులాగా భయపడుతూ ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు.తెలంగాణా ఉద్యమానికి నిధులు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రవాస తెలంగాణా ప్రజలూ మీరు ఒక సారి ఆలోచన చేయాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు మిమ్ములను కూడా భాగో అనే పరిస్థితి వస్తుంది.

33 కామెంట్‌లు:

Apparao చెప్పారు...

"చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని". కెవ్వు కేక

శరత్ కాలమ్ చెప్పారు...

అవును. థాక్రేలో కొంతయినా నిజాయితీ కనిపిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

Hi Apparao....chasthavani thelisi toilet ki pokunda Vuntava....

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

<<<"...భావోద్వేగ సమస్యని తెలంగాణా లోని రాజకీయ నాయకులు చాలా బాగా క్యాష్ చేసుకుంటున్నారు. మొదట చెన్నారెడ్డి ఆ సమస్యను ఉపయోగించుకొని అనేక పదవులు పొందినారు...">>>
చచ్చిపోయేటప్పుడు - ఆ క్యాషంతా మోసుకెల్లాడా? మీరు చూసారా?

<<< ఇప్పుడు కె.సి.ఆర్. అదే పనిలో ఉన్నారు. ఒక వైపు ఏమో చచ్హేంత వరకు నిరాహారదీక్ష అంటున్నాడు, మరోవైపు ఏమో ఖమ్మంలో సౌకర్యాలు లేవంటున్నాడు.చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని. >>>

అందరం చచ్చావాల్లమే - నువ్వు నేను కూడా!
రామలింగరాజు లాంటి ద్రోహులకేమో ఎ-క్లాస్ లక్జరీ జైలు... తెలివిలేని అమాయకుడైన తెలంగాణ ప్రజాప్రతినిధికేమో థర్డ్ క్లాస్ ఉచ్చకూడా గదిలోనే పోసుకునే జైలా? ఇదెంతవరకు న్యాయం.

<<< దీన్ని తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.>>>
ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకే వదిలేయడం మీకు విజ్ఞతనిపించుకుంటుంది. ఒకరు చెప్తేనే అర్థం చేసుకోవలసినంత తెలివిలేని హద్దులకింకా ఇక్కడి ప్రజలు పడిపోలేదు. అలాగని వలస పాలకుల కల - అది వేరే విషయం.

contd...

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

<<< అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలు.ఎందుకంటే తెలంగాణా వాళ్ళు కలుస్తామంటే కర్నూలు రాజధానిని పోగొట్టు కొని హైదరాబాదు రాజధానిని ఒప్పుకున్నారు. >>>

రాయలసీమ జనం ఎక్కువ నష్టపోయిందంటే - నేను నమ్ముతాను. కాని మీరు చెప్పిన కారణం వల్ల మాత్రం కాదు. అరకోర వసతుల్లేని కర్నూలు రాజధానిగా ఇమడలేదని తెలిసి - అప్పటికే ప్రపంచంలో మూడవ ఐశ్వర్యవంతమైన హైదరాబాద్ రాష్ట్రం మీద పడింది కౄరమైన ఆంధ్రా నాయకుల కన్ను. అది మీరు కర్నూలు ప్రజలు ఒప్పుకోవడమంటున్నారు - ఎందుకొప్పుకున్నారని మేమడుగుతున్నాం.

<<< హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.నాకు తెలిసినంత వరకు రాజధాని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాష్ట్ర విభజన కోరలేదు,తెలంగాణా వాళ్ళు తప్ప. >>>

గత 40 – 50 ఏళ్ళలో తెలంగాణ ప్రాంతంలో జరిగింది నిలువు దోపిడి – అభివృద్ది కాదు. హైదరాబాదును వేరుచేసి మీరంటున్న రాజధానిలో ఉన్న వాల్లంటే మీ ఉద్దేశ్యం వేరే ప్రాంతం నుండి వలసొచ్చి ఇక్కడి వనరులను ఆక్రమించిన జనాలా? హైదరాబాదులో సమసిపోయిన అందాలు, పచ్చదనం, సరస్సులు, విశృంకలంగా జరిగిన ఆక్రమణను మీరు అభివృద్ది అంటరా… మీరు ఆక్రమించి ఉండకపోయినట్టయితే హైదరాబాదు నుండి కాగజ్ నగర్ వరకు హాంగ్ కాంగ్ లాగా ఫ్రీ జోన్ కాలొనీ అభివృద్ధి చేయడానికి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్నారావు నిధులు కుడా సంకూర్చిన సంగతి ఎవరికీ గుర్తులేదు... కాదు గుర్తులేకుండా చేసారు. 1948 నుండి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రం వరుసగా ప్రతియేటా మిగులు బడ్జెట్టు ఉండేదంటే మీరు నమ్ముతారా? తెలియక పోతే తెలుసుకోండి. పరిశోధించండి.

contd...

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

<<< తెలంగాణా వాళ్ళ కంటే బాలాథాక్రే చాలా నయమని పిస్తుంది.ఎందుకంటే ఆయన ముంబాయి మరాఠీ లది మాత్రమే అంటున్నాడు.కానీ ఇక్కడ ఆంధ్రావాలే భాగో అంటున్నారు. తెలుగువాళ్ళం అయి ఉండి తెలంగాణా ప్రాంతంలో ద్వితీయ శ్రేణి పౌరులులాగా భయపడుతూ ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు. >>>

కదా? ఎందుకర్థంకాలేదో తెలుసుకోవాలని లేదా?

వ్యాపారంలో ఆర్జించి స్థానిక సామాజికాభివృద్దిలో పాలుపంచుకోకపోతే ఎవ్వరైనా తన్ని తరిమేస్తారు. ముంబైలో జరిగేదదే.

హైదరాబాదులోనే కాదు మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే పెట్టుబడీదారి వ్యవస్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కంటే చాలా ముందునుంచే ఉంది. దాన్నెవ్వరు ఎదిరించాల్సిన అవసరం లేదు. తెలంగాణ వ్యాపారంలో ఆర్జించి స్థానిక సామాజికాభివృద్దిలో పాలుపంచుకోక మొత్తంగా వేరేచోట వృద్దిచెందటానికి తోడ్పడే అలోచనా కాంక్ష కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్న మార్వాడి, బెంగాలి, పంజాబీ, గుజరాతీ సేఠ్లకు లేదు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన మరో విషయం – 1948 నుండి 1956 వరకు హైదరాబాదు రాష్ట్రానిది ప్రతి ఏటా మిగులు బడ్జెట్టే. ఆ తర్వాతే అప్పుల రాష్ట్రంగా మార్చేసారు వలసపాలకులు తమ వికృత కుల కాంక్ష వివక్షతో.

ఎన్నెన్ని ఫ్యాక్టరీలు మూతపడేలా చేశారు – ఎంతమంది జనాలు పొట్ట చేతబట్టుకుని చచ్చేలా పాలించారు. ఇదీ ఒక రకమైన జినోసైడ్ (Genocide) కాదా?

contd...

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

<<< తెలంగాణా ఉద్యమానికి నిధులు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రవాస తెలంగాణా ప్రజలూ మీరు ఒక సారి ఆలోచన చేయాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు మిమ్ములను కూడా భాగో అనే పరిస్థితి వస్తుంది. >>>

ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రవాసులకే వదిలేయడం మీకు విజ్ఞతనిపించుకుంటుంది.

ఇక అవును ఆ భాగో అనే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఇక్కడి అంధ్రా ప్రాంత తెలుగు వారు. నేను చికాగోకు వలసొచ్చి 12 ఏళ్ళైంది - ఇప్పటివరకైతే నాకా పరిస్థితి రాలేదు. వచ్చినా అశ్చర్యపడను. అంతేకాని ఇక్కడి వారిపై నేను డామినేట్ చేసేలా ప్రవర్తించను వనరులను లూటి చేయను. ఎందుకంటే కక్కుర్తిపడే మీ అంధ్రా ప్రాంత వలసదారులతో స్వంత అనుభవం కదా - అదొక గుణ పాఠం లా పనికొస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ రాజు గారు చాలా బాగా చెప్పారు.
కోస్తా, రాయల సీమ ప్రాంతీయులు ఎంతసేపు స్వార్థ చింతననే కళ్ళకు గంతలుగా కట్టుకొని మాట్లాడడమే తప్ప,
ఏనాడు "ఈ ఉద్యమం వెనుక ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యం ఏమిటి? అందుకు సంబంధించిన చరిత్ర ఏమిటి?" అని అధ్యయనం చేసి ’టపా’ వ్రాద్దాం - అన్న ఇంగిత జ్ఞానం లేక పోవడం చూస్తే ... జాలి వేస్తుంది.
ఇంతటి మహా ఉద్యమాన్ని ఒక్క KCR సృష్టించాడని ఇంకా వీళ్ళనుకొంటున్నారంటే ...
అయితే ... వీళ్ళు ’ మహా మూర్ఖులు ’ అయినా అయ్యుండాలి.
లేదా ... KCR భారత దేశంలో పుట్టిన మహోన్నత నాయకులలో అగ్రగణ్యుడయినా అయ్యుండాలి.
తెలంగాణ వాదులు మొదటిదాన్నే నమ్ముతారు.

అశోక్ చౌదరి చెప్పారు...

ఓహో.. నువ్వు చికాగో అమెరికా ని వుద్దరిచటానికి వచవ? నువ్వు తెలంగాణా తెచుకున్తవో సచుకున్తవో నీ ఇష్టం.. అంతే కానీ ఆంధ్ర వాళ్ళ గురించి నోటికి వచినట్లు వాగకు..

అజ్ఞాత చెప్పారు...

Sridhar Raju garu and Ajnaata garu,

The very thought that people of a particular geographical area are 'good' and people of another area are 'bad' is wrong at a very fundamental level. Do we beleive that God has created the world in that way?

By targeting the 'Andhra' people and painting them as evil, the proponents of Telangana movement are losing the moral highground. Unfortunately your comments are along the same lines and are unbecoming of a global citizen living in an open society like the USA (which incidentally is entirely made up of immigrants from other geographies).

It is easy to be lost in details during an emotional argument, but let's not lose sight of the fundamentals.

-Srinivas

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

అశోక్ గారు,
నేను మొత్తం ఆంధ్రావాళ్ళగురించేం చెప్పలేదే - ఇష్టంవచ్చినట్టు కుడా రాయలేదే. ఉన్న నిజాలను మాత్రమే మీ ముందుంచాను. నేను రాసిందాంట్లొ కించిత్తు తప్పును చూపించగలరా? నేను రాసిన విషయాలను సాక్షాధారలతో సహా నిరూపించగలను. సమాచార హక్కు (Information Act) మనలాంటి వారికోసమే కదా సృష్టించబడింది. మీరు కూడ నామ మాత్రమైన రుసుము చెల్లించి ఈ విషయాలకు సంబందించిన దస్తావేజుల నకళ్ళను పొందవచ్చు. నిజాలా కాదా అని మనమద్య తర్జన భర్జన పడేకన్నా మీరు స్వతహాగా దృవీకరించుకుంటేనే సబబుగా ఉంటుంది.

ఇకపోతే, ఉద్దరించడానికని వ్యక్తిగత దూషణ మీకు తగదు.

Srinivas gaaru,
I don't think God created the world that way. Its the people like you and me often practice ignorance to the long-term results of our own actions. Not sure whether discrimination and inequality is a curse on any of us being good or bad... but one thing I certainly agree... a greater percentage of people originated from Telangana region are not as talented as the people from Andhra. That includes political leaders from Telangana could not withstand arguing and fighting against leaders from non-Telangana region.

I've targeted only those cunning immigrants and their dominion lordship on local society... not all Andhra people. My apologies if you felt that way... was not my intent.

I fully respect your comments regarding the open society that I'm currently living in and its foundation from great minded immigrants.

I agree, it is easy to be lost in details and yet restrain emotional intelligence.

However, the concerns that I expressed are in the same lines of the free and open society you described. It is very clear that Telangana used to be a open society for traders which is now on the verge of destruction. Please verify yourself whether my claim is true.

Yes, we shouldn't lose the sight of fundamentals. I agree.

Anil Dasari చెప్పారు...

>> "I fully respect your comments regarding the open society that I'm currently living in and its foundation from great minded immigrants"

Then, my friend, either you don't know the history of the land you're currently living in very well, or you think we don't. Before becoming 'great minded immigrents', they were mere settlers .. the same kind of oppressive, tyrannical settlers you're now talking about in Telangana. You praise and despise that breed simultaneously! How funny.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

AbrakaDabra, I purposefully presented it in that way. My friend... think through you will understand.

No one individual currently in America takes pride for the acts of those tyrannical settlers centuries ago.

Let us prevent the same happening in Telangana or Telingana region the land of origination of Telugu language as claimed in Mahabaratha.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

డా|| B. R. అంబేడ్కర్ గారు 1945 లోనే డిల్లీ కన్నా హైదరాబాదు చాలా గొప్ప నగరమని దేశానికి రాజధానిగా సిఫారసు చేశారంటే - అపాటికే ఎంత అభివృధ్ధి చెందిందో అర్థమౌతుంది. మీరే చదవండి:
http://www.jansamachar.net/display.php3?id=&num=48&lang=%20English

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా చెప్పారు శ్రీధర్ రాజు గారు,

ఇంకా స్పష్టంగా అచ్చ తెలుగులో చెప్పాలంటే:
ఇప్పటి కుల వివక్షతో విషంగక్కే వలసదారులు, వలస పాలకుల వల్ల జరిగి పోయే అనర్థానికి - ఒక రెండు మూడువందల ఏళ్ళ తరువాత చేసేదేమి ఉండదు.

అమెరికాలో మాయన్ సొసైటీని మరియు వివిధ ట్రైబ్స్ ని సరిచేయలేనంతగా రూపుమాపిన తరువాత నాలుక్కరుచుకుంటే - ఏం లాభం - అప్పుడు ఎదిరించే వాళ్ళు కరువయ్యారు. చరిత్ర నేర్పిన పాఠం కారణంగా ఈ రోజు చాప కింద నీరులా జరుగుతున్న ఊచకోతను మనం ప్రతిఘటించాలి.

అశోక్ చౌదరి చెప్పారు...

@Sridhar
"ఎందుకంటే కక్కుర్తిపడే మీ అంధ్రా ప్రాంత వలసదారులతో స్వంత అనుభవం కదా - అదొక గుణ పాఠం లా పనికొస్తుంది"

ఒక్క సరి మీ వ్యాఖ్యలను చదువుకోండి.. మీరు చెప్తున్నాడని ప్రకారం ఆంధ్ర నుంచి అమెరికా వచ్చిన నేను కక్కుర్తి ఆంధ్ర వలసదారునే అయితాను.. అలానే తెలంగాణా నుంచి అమెరికా వచ్చిన వలసదారులు మీరు..
నేను మీ వ్యక్యాల్లో లోపాలు వెదకటం లేదు అండి.. మీరు తెలంగాణా కావాలంటే బేషుగ్గా పోరాటాలు చేసుకోండి.. ఎవరు వద్దు అనరు.. వద్దు అనే హక్కు కూడా ఎవరికీ లేదు.. కానీ ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళు దొంగలు తెలంగాణా వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్లు మాట్లాడితే ఎలా వుంటుందో ఆలోచించండి..

Anil Dasari చెప్పారు...

>> "I purposefully presented it in that way. My friend... think through you will understand"

In deed, I did. Nice try to cover it up though :-)

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

అశోక్ గారు,
నాకున్న అనుభవం హైదరాబాదులో ఉన్నపుడు అంధ్రా ప్రాంత వలసదారులతో - అమెరికాలో మీలాంటి వారితో కాదు.

నేను ఆంధ్ర వాల్లంతా దొంగలని ఎక్కడన్నాను. గుమ్మడి కాయల దొంగెవరంటే - అసలు దొంగ బుజాలు తడుమున్నట్టుగా ఉంది.

ఎక్కువ శాతం తెలివైన వారని మాత్రమే అన్నాను, అదే తెలంగాణలో చాలా తక్కువ శాతం. వాక్చ్యాతుర్యంలో ఆంధ్రా వాల్లు తెలంగాణ వాల్లకంటే దిట్టలు. కాదంటారా?

ఇది నేను చెప్పటం లేదండి - ఫైజల్ అలీ కమిషన్ చాలా స్పష్టంగా కమిషన్ రిపోర్టులో వ్రాసి ఉంది. మీరే చదువుకోండి.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

అబ్రకదబ్ర గారు,
Did you ever read the history books in America? If not, please do it.

There isn't any need for me to cover up... it is outspoken truth.


అజ్ఞాత గారు నేచెప్పాలనుకున్నది విపులంగా అచ్చ తెలుగులో చాలా బాగా వివరించారు. Thanks.

I'm not falling to these tactful and controversial traps and continue the debate. Sorry!

Just heard the news:
"Long live Sreekanth"

Anil Dasari చెప్పారు...

Sridhar,

why, I did read them. Plenty of them in fact. Am I not the one who brought up the comparison? How do you think I did that.

Apparently, you didn't get what I meant by 'cover up'. I'm not going to sweat over it now.

Peace.

అశోక్ చౌదరి చెప్పారు...

@sridhar..

నేను ఆ మాట generic గ అన్నాను.. thats the feeling i got from all your posts..


"నేను ఆంధ్ర వాల్లంతా దొంగలని ఎక్కడన్నాను. గుమ్మడి కాయల దొంగెవరంటే - అసలు దొంగ బుజాలు తడుమున్నట్టుగా ఉంది. "
అయిన నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించటం అంటే ఇదే కదా..

మయూఖ చెప్పారు...

శ్రీధర్ రాజు గారూ
నైజాం రాజ్యం ఎక్కడ ఉండేదో అక్కడ అభివృద్ది ఎలా ఉందో మీకు తెలుసా.ఉదా:కర్నాటక లోని బీదర్,మునుపటి తెలంగానా ప్రాంతాలు ఈ రోజుకి కూడా చాలా బీద పరిస్థితులలో ఉన్నారు.ఈ రోజు కూడా హైదరాబాదుకు ఒక నూరు కి.మీ. దూరంలో కూడా ఎన్నో మూఢనమ్మకాలలో ఉన్నారు,ప్రజలు.అదీ రాజధాని వచ్హి సుమారు ఏభై సంవత్సరాలు ఐన తర్వాత కూడా.ఒక వేళ రాజధాని లేకుండా ఉండి ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఊహించు కోవచ్హు.ఈ వాళ హైదరాబాదు మాత్రమే కాదు,అన్ని నగరాలు నగరీకరణ వలన పచ్హదనము కోల్ఫోయి కాంక్రీటు అరణ్యాలుగా మారాయి ,అది మీకు తెలియంది కాదు.తెలంగాణా లో ముందు నుంచి భూస్వామ్య వ్యవస్థ ఉంది.దొరల వ్యవస్థ ఉంది.అందువలననే తెలంగాణా లో అనేక ఉద్యమాలు వచ్హాయి. అది చరిత్ర చెప్పిన సత్యం.ఆంధ్రా వాళ్ళు వచ్హిన తర్వాతనే ఆక్రమించుకున్నారు అని విష ప్రచారం చేయడం చాలా తప్పు.ఈ వాళ ఝార్ఖండ్ విడిపోయి యేమి అయిందో తెలుస్తుంది.తెలంగాణా కు చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అయిన తర్వాతా కూడా ఎందుకు అభివృద్ది చెందలేదో మీరు చెప్పాలి.ఈ వాళ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఏం ఒరిగేది ఏమీ ఉందదు.ఇంకా ఒక ముఖ్యమంత్రి పదవి ,మంత్రుల పదవులు రావడం తప్ప.ఈ వ్యవస్థలో మార్పు రానంతవరకు అది అలాగే ఉంటుంది.దేవేందర్ గౌడ్ గారు ఇప్పుదు ఎందుకు కనిపించడం లేదు,చెప్పండి.ప్రజలకు కావలసిన మూడు పూటలా తిండి ,వాళ్ళకు కావలసిన కనీస వసతులు కొరకు పోరాడాలి.తెలంగాణా రాజకీయనాయకులకు కొత్త ఉద్యోగాల కోసమే ఈ పోరాటాలు,ప్రజలను బలి పశువులను చేయకుంటే చాలా మంచిది.

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

రమణారెడ్డి గారు,
Please see the context of the original topic.

>>>హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.>>>

My base is in reference to this statement. The Hyderabad was already developed and it was in much better position than it is now.

Bidar was under jurisdiction of Aurangabad. Not just Bidar - the entire Vidarbha region was part of this Hyderabad state.

భుస్వామ్య పోరాటం లేదని ఎవరన్నారు? తెలంగాణ ఒక ఉద్యమాల పుట్ట - శతాబ్దాల పోరాట చరిత్రగల ప్రాంతం తెలంగాణ. ఇప్పటికీ ఏమి మారలేదు. వివక్ష ఆగిపోయేంత వరకు ఈ ఉద్యమాల పర్వం సాగుతూనే ఉంటుంది. వీళ్ళ బాధ మీకు అర్థమయ్యిచావదు - మీలాంటి వారు రాసే రాతలకు కూసే కూతలకు అమాయకులైన తెలంగాణ అభాగ్యులెందరో రెచ్చిపోతారు. అందుకే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టొద్దు - రెచ్చిపోయేలా రాయొద్దు.

అసలు కెసిఆర్ గాడి నోటి దురుసు మరియు హేయమైన ప్రవర్తన కారణంగానే ఇన్నాళ్ళు జనాలు అణిగిమనిగి ఒదిగి పోయారు.

కాని ఒక్కటి నిజమండోయ్ - వాడు ఎలాంటివాడైనా ఉద్యమాన్ని బ్రతికించి ఊపిరి పోసిన నాదుడంటే నమ్మబుద్దికావట్లేదు కదా! వీడికున్నంత మాస్ జనాల మద్దత్తు దేశదేశాల్లో ఎవ్వడికిలేదంటే కూడా ఎవ్వరికి నమ్మబుద్దికాదు. కదా?

contd...

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

#2
ఇలా నాలాంటి వాల్లు రాసే రాతలకి మీకు తిక్కరేగుతుంది - కాని ఏంపీక్కోలేం. కదా? ఇలాంటి బ్లాగుల్లో రాతలు రాయడం తప్ప - ఎవ్వడికైనా రాష్ట్రాన్ని విడదీయొద్దని చచ్చిపోవడమో లేక కాల్చడమో చేయగలరా? లేదు కదా!

ఇక్కడి ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది - బలవంతమైన తెలివైన వలస పాలకులు చేసే అన్యాయాలకు అక్రమార్కాలకు అణచివేతకు ఈ ప్రజస్వామ్యం ఒక ముసుగులా మాత్రమే పనికొస్తుందని అర్థమైయింది.

ఇక ఈ ఉద్యమాన్ని ఆపడం ఎవరితరమూ కాదు - మళ్ళీ చెన్నారెడ్డి లేక ఇందిరాగాంధి లేక వైఎస్ లాంటి నియంతలు రావాలి - ఉన్నార్లే రోషయ్యేంతక్కువోడు కాదు. సబితను పోలీసులను ఎలా వాడుకున్నాడో చూసాంకదా - పాపం సబిత భర్త ఆత్మ ఎంత క్షోభించిందో... సర్లే కానియ్యి. చలి చీమల చేత బలవంతమైన పాములు చావయా? మరి ఈ తెలంగాణ అమాయకపుటెదవలు చలి చీమలే. కదా?

వ్యాపారంలో ఆర్జించి స్థానిక సామాజికాభివృద్దిలో పాలుపంచుకోకపోతే ఎవ్వరైనా తన్ని తరిమేస్తారు. ఆధిపత్యం చెలాయిస్తే ముంబైలో థాక్రే ద్వారా జరిగేదే ఇక్కడ కూడా ఉద్యమ రూపంలో జరుగుతుంది.

మయూఖ చెప్పారు...

ఈ వాళ బెంగుళూరు లో బిల్డర్స్ చాలా మంది తెలుగు వాళ్ళే .చాలా మంది పొట్ట చేత పట్టుకొని బెంగుళూరు కు వచ్హిన వాళ్ళే .ఇక్కడ కష్ట పడి పైకి వచ్హారు.అలా అని ఇక్కడ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు మమ్ములను దోచుకున్నారు,భాగో అంటే ఎలా ఉంటుంది.ముందు కష్ట పడడం నేర్చుకొని పైకి రావడం నేర్చు కోవాలి.మన చేతగాని తనాన్ని ఇతరుల మీద నెట్టడం బాగా లేదు.

మంచు చెప్పారు...

తెలంగాణా గురించి నేనేమి కాంటెండం లేదు... ముఖ్యం గా శ్రీధర్ రాజు గారు.. :-)

అబ్రకదబ్ర గారు.. రమణారెడ్డి గారు చెప్పిన " ముందు కష్ట పడడం నేర్చుకొని పైకి రావడం నేర్చు కోవాలి.మన చేతగాని తనాన్ని ఇతరుల మీద నెట్టడం బాగా లేదు " ఇది మీకు ఎలా అనిపించింది :-))

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

Ramana garu,
You are leading the topic out of context.

I am also an immigrant in Chicago like the builders in Bangalore. Please don't generalize things.

We are not talking about any and all kinds of immigrants here. This is specific to Telangana and dominion immigrant rulers within the state.

నోరు విప్పి పోట్లాడ్డం చాతకాని అమాయకుల వనరులన్ని దోచుకెల్లే నీచ నికృష్ట వలస పాలకుల గురించి మాత్రమే ఈ పోరాటం. ఇంక చాలు.

అసలు తెలంగాణకు జరిగిన అన్యాయమేంటో తెలుసుకోండి!
(video.google.com/videoplay?docid=7730660376611492753#)

మరొక్క విషయం – ఈ క్రింది లఘు-చిత్రంలో సంగతులు నేను ఏనాడు స్కూల్లో పాఠంగా చదవలేదు – కాని మా తాతగారినుండి తెలిసిన విషయాల్లో ఇది ఓ చిన్న మచ్చుతునక మాత్రమే:
(video.google.com/videoplay?docid=7247237671139634776#)

ఈ క్రింద లింకులో ప్రచురితమైన యథార్థ విషయాన్ని చదవండి…
(www.andhraprabha.in/specialstories/article-43713)

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

"బావిలోని కప్పల్లార - భావి కొస్తాంధ్ర పౌరులారా - బయటకు వచ్చి నిజమైన పూర్తి లోకాన్ని చూడండి" - నేను

Quotes from other great minds:
“ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు” — జూలూరు గౌరీశంకర్‌

“నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది” — అన్నవరం దేవేందర్

“కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణా
పాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా” — నందిని సిధా రెడ్డి

“వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది” — కాళోజి

“లేకే రహేంగే లేకే రహెంగే తెలంగాణా లేకే రహేంగే… లాఠీ గోలీ ఖాయింగే తెలంగాణా లాయేంగే !” — సలాం హైద్రాబాద్

“యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది” — అన్నవరం దేవేందర్

“గలీజొళ్ళం లుచ్చాగాల్లం బేవార్సుగాల్లం మమ్మల్ని వదిలి వెళ్ళండి మాతో మీకెందుకు స్నేహం మా మూతులు ఎందుకునాకుతాండ్రు” - జనార్ధన్

“ఇక్కడి ప్రజలకు ఇప్పటి ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయింది” — రాజన్న

శ్రీధర్ రాజు - చికాగో చెప్పారు...

మంచు పల్లకి గారు,
అంటే మీ ఉద్దేషం ఇక్కడి జనాలకు కష్టపడ్డమేంటో తెలియదంటారు.

ఉస్మానియా క్యాంపస్ వెళ్ళి అడగండి ఎలా అనిపించిందో మీకు మంచి సమాధానం దొరుకుతుంది. BTW, ఒళ్ళు కాల్చుకు చనిపోయిన ఫిజియోథెరఫీ PG Student శ్రీకాంత్ కూడా చేతకానివాడేనని కూడా చెప్పడం మరచిపోకండి.

మంచు చెప్పారు...

రాజు గారు .. మీకు ప్రత్యేకం గా చెప్పాను ఇది తెలంగాణా గురించి కాదు అని.. స్పెసిఫిక్ గా అబ్రకదబ్ర గారికి మాత్రమే.. అసలే మీరు అనేక బ్లాగుల్లొ పే.....ద్ద పెద్ద కామెంట్లు పెడుతూ మీ సమయానంతా దీనికే వెచ్చిస్తున్నారు మళ్ళి నా ప్రశ్న ద్వారా మీమ్మన్లి ఎందుకు కస్టపెట్టడం అని క్లియర్ గా రాసా.. అయినా మీరు మీ ధొరణిలో దూసుకుపొతున్నారు.. కానివ్వండి..

Anil Dasari చెప్పారు...

@మంచుపల్లకి:

కష్టపడేవాళ్లు ఆంధ్రాకీ, సీమకీ మాత్రమే పరిమితం కాదు. అన్నిచోట్లా ఉంటారు. అలాగే ఇతరుల మీద పడి ఏడిచేవాళ్లు కూడా. 'విడిపోదాం రండి' అనేది తెలంగాణ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పి పెట్టుకోటానికిచ్చిన పిలుపు. తమ ప్రాంతం గొప్పదనం గురించి నాలుగు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఛాతీ నాలుగంగుళాలు పొంగించుకుని మరీ పొంగిపోని ప్రజలు ప్రపంచంలో ఎక్కడ మాత్రం ఉండరు? భావోద్వేగాల బుట్టలో పడే వాళ్లున్నంతవరకూ బతకనేర్చిన కేసీయార్లు పుట్టుకొస్తూనే ఉంటారు. అగ్గి రాజెయ్యటం అలాంటోళ్ల వంతు. కవితలల్లే కాళోజీలూ, గజ్జె కట్టే గద్దర్లూ దానిక్కాస్త ఆజ్యం జోడిస్తారు. ఆ మంటల్లో పడి మాడి మసై పోయేది మాత్రం ఆర్టీసీ బస్సులూ, అమాయక శ్రీధర్లూ. అసలోళ్లు మాత్రం 'దీక్షగా' తిని తేనుస్తుంటారు.

ఇంతకన్నా చెప్పటానికేమీ లేదు.

కమల్ చెప్పారు...

అయ్య చికాగో శ్రీధర్ రాజు గారు కొంచం మా వ్యధ కూడ చూస్తారా..? ఇది చదవండి. 1952 జూన్ లో పార్లమెంట్ " ఆంధ్ర స్టేట్ బిల్లు" అమోదించగానే, ఈ కొత్త రాష్ట్రానికి మద్రాసును అథిధిరాజధానిగా వుంచి, గుంటూరు విజయవాడల మధ్య శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి, రాజధానిని రాయలసీమలో ఉంచకపోతే రాజీనామాలు చేయడానికి రాయలసీమ శాసనసభ్యులు సంసిద్దులయ్యారు, రాజధాని సమస్యను పరిష్కరించటానికి ప్రకాశం పంతులుగారి అధ్యక్షణ శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేయబడింది. కోస్తా శాసనసభ్యులు గుంటూరు-విజయవాడల మధ్యన రాజధాని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. చివరకు నిర్ణయాధికారం ప్రకాశం గారికి వదిలేస్తూ సమావేశం ముగిసింది.

ప్రకాశంపంతులుగారు కర్నూలులో రాజధాని ఉండాలని నిర్ణయించారు, కోపోద్రిక్తులైనా కోస్తా జిల్లాల వాతావరణం విజయవాడలోని ప్రకాశం పంతులగారి విగ్రహాన్ని కూలదోయడానికి పూనుకొంది. దానికి సమాధానంగా ప్రకాశం పంతులు గారు ఇలా అన్నారు.

" కర్నూలు శాస్వత రాజధాని కాదు, ఇది తాత్కాలికమైనది, త్వరలో విశాలాంధ్ర ఏర్పడుగలదన్న విశ్వాసం నాకుంది. అప్పుడు హైదరాబాద్ మనకు శాస్వత రాజధాని వుంటుంది.". 1956 లో విశాలాంధ్ర ఏర్పడటం తో, రాజధాని హైదరాబాద్ కు మారి, రాయలసీమ రాజధాని వైభవం మూడేండ్ల ముచ్చటగా ముగిసింది. దీనికోసమై పోగొట్టుకున్నవి మాత్రం తిరిగిరాలేదు.

నాగార్జునసాగర్ నిర్మాణానికి 1954 లో తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల మధ్యన జరిగిన వొప్పందం మూలంగా రాయలసీమ నీటిపారుదల పథకాలు శాశ్విత సమాధి జరిగింది..

ఇవి నా మాటలు కావు, " రాయలసీమ కన్నీటి గాధ " డా:యం.వి.రమణారెడ్డి గారు వ్రాసిన పుస్తకం నుండి.

మరి ఏది నిజమో పరశీలించండి మీరిచ్చిన ఆంధ్రప్రభ లో ఒకలాగ ఉంది వ్యాసం, నేను పైన ఇచ్చిన వ్యాసం ఇప్పటిది కాదు 1986 లో రాసింది..

కమల్ చెప్పారు...

for only sri Sreedhar raaju gaari koasam kinda link

http://satyasodhana.blogspot.com/2009/12/blog-post.html