10, డిసెంబర్ 2009, గురువారం

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

కాంగ్రెస్స్ అధిష్ఠానం ప్రజలలో పలుకుబడి లేని,ప్రజల నాడి తెలియని నాయకుల (ఉదా:-వి.ఎచ్.,కే.కే.) మాటలు విని తెలంగాణాకు సై అని పప్పులో కాలేసింది.ప్రజలలో పలుకుబడి లేని కే.సి.ఆర్ లాంటి ఒక నాయకుడు నిరాహారదీక్ష అని బ్లాక్ మెయిల్ చేస్తే దానికి భయపడి ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంసిద్ధం కావడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు.అదే కే.సి.ఆర్. తెలంగాణాకు చెందిన ఇతర కాంగ్రెస్స్ నాయకులను ఎలా తిట్టారో అప్పుడే మర్చి పొయినారా?జగన్ విషయం లో అధిష్ఠానం చెప్పిన నిర్ణయానికి కాంగ్రెస్స్ ఎం.ఎల్.ఎ లు తలోగ్గినట్లే ఈ విషయంలో కూడా వాళ్లు మాట వింటారని కాంగ్రెస్స్ అధిష్ఠానం అనుకొంది.ప్రజాభిప్రాయం తో సంభంధం లేకుండా అధిష్ఠానం అనే అహంకారంతో ,నిరంకుశత్వంగా వ్యవహరించి ఈ వాళ కొరివితో తల గోక్కున్నట్లు అయ్యింది.కే.సి.ఆర్ కు తిరుగులేని ప్రజా బలం ఉండి,తెలంగాణా వాదం ఉన్నప్పుడే వై.ఎస్. గారు ఆ సమస్యను చాలా తేలికగా తీసుకొని ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు.ఈ వాళ తెలంగాణ వాదం బలహీన పడి, టి.ఆర్.ఎస్. పార్టీ తన ఉనికి కోల్పోతున్నప్పుడు ఈ సమస్యను కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిష్కరించలేక చేతులు ఎత్తి వేసే పరిస్థితి వచ్చింది.కావున కాంగ్రెస్స్ సీనియర్లకు ఈ వాళ అయినా తెలిసిరావాలి,రాష్ట్రంలో వై.ఎస్.ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్స్ అంటే వై.ఎస్.,వై.ఎస్. అంటే కాంగ్రెస్స్ అని.అధిష్ఠానం అంటూ ఏమీ లేదని.ఈ వాళ పరిస్థితి విడవ మంటే పాముకు కోపం,కరవ మంటే కప్పకు కోపం లా కాంగ్రెస్స్ అధిష్ఠానం పరిస్థితి అయ్యింది.

5 కామెంట్‌లు:

Chittoor Murugesan చెప్పారు...

http://ramannarajanna.wordpress.com/2009/12/10/tgn/

Unknown చెప్పారు...

తెలంగాణా లో గ్రామ గ్రామాన ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమం పట్ల మీ అభిప్రాయం మారదా. తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలన్తుంటే మీరు ఇంత కుమిలి పోతున్నారెందుకు. 37 మంది తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించినా, ఆనాడు 1969 లో 370 మంది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో అసువులు బాసినా మీకు తెలంగాణా ప్రజల ఆకాంక్ష అర్ధం కాదా. స్వార్ధం ఇంతగా ముదిరిందా.
కొంత మంది యువకులు
పుట్టుకతో వృద్ధులు
నేటి నిజం చూడలేని
కీటక సన్యాసులు
అనుకోకుండా చేసేదేమీ లదనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

37 మంది పిరికివాళ్లు కన్నవాళ్లను కట్టుకొన్నవాళ్లను కడుపున పుట్టినోల్లను వదిలి కిరసనాయలుపోసుకోవటం ఉద్యమానికి కొలబద్ద అయితే, వందల మంది గుండే ఆగి చచ్చిన ysr చావు ఇంకెంత గొప్ప కొలబద్ద కావాలి, ఏ కొలబద్ద ఆధారం గా వెల్దాం??
1969 లో 300+ చచ్చారంటున్న మీరు, 1971-73 లలో అంతే మంది పోయారన్న మాట ఎందుకు దాస్తారు?
"కొంత మంది యువకులు
పుట్టుకతో వృద్ధులు" నిజమే గురువింద గింజ తన నలుపు చూడలేదంట.

వెళ్లి బస్సులు, విగ్రహాలు ఎమయినా ఉన్నయేమో తగెలడతానికి, పగలగొడతాని చూసుకోండి. ఆ పనిలో బిజీ గా ఉండండి. (NIMS లొ బెడ్ ఖాలీగా ఉందంట, వెళ్ళి మళ్లీ ఎక్కుతాడేమో మీ నాయకుడను అడగండి)

చివరగా, హైదరాబాద్ హైదరాబాదోళ్లది (హైదరాబాద్ లో వోటున్నోళ్లది, హైదరాబాద్ లో టాక్స్ కడుతున్నోళ్లది, తాము బతుకుతూ నలుగురును బతకనిచ్చేవోళ్లది), ముందు మా హైదరాబాద్ మాకిచ్చి మీ లొల్లి మీ ఊళ్లలో పెట్టుకోండి.
జై హైదరాబాద్, జై దానం.

బ్లాగులో కాయ చెప్పారు...

మమ్మళ్ని వదిలేయండీ రా మొర్రో అంటుంటే.... వదలరేంటి... జై హైదరాబాదా.... మీ తాత కట్టిండు కదా .... మా తాతల్ కష్ట ఫలం హైదరాబాద్.... మీ ఎగతాలి మాటలకు భయపడే రకం కాదు ...ఈనాడు తెలుగాణ... మీరు రాకముందే 400 సంవత్సరాల నుండి ఉంది హైదరాబాద్... మీరు తిన్నదెక్కువ... చేసింది తక్కువ... ఎంత ఎక్కువ మంది ఆత్మహత్య చేస్కున్నారనేది.. కాదు...ఎంత మంది పోరాటం లో పొయారనేది లెఖ్ఖ.... మా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తరు .... ఎవ్వరు చేయరు.. మాకు వద్దు అంటే.. కలపాలి అనే మీ మొండి తనం...ఒక రకం దురాక్రమణ .....

Unknown చెప్పారు...

కరవ మంటే కప్పకు కోపం
విడవ మంటే పాముకు కోపం
కప్పకు కోపం వచ్చినా ఫర్వాలేదు
పాముకు కోపం వస్తే మాత్రం ప్రమాదం
అందుకే కరవమనే అందా
మనం పాములకే జై కొడదాం
తెలంగాణా ను చీకొడదాం.