10, డిసెంబర్ 2009, గురువారం

ఈ వార్త విని వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది.

ప్రజలలో నుండి వచ్చిన బలమైన నాయకుడు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాంతీయ వాదాల్ని ఒంటిచేత్తో ఆపగలిగాడు. తెలంగాణాకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని ప్రచారం తో ఊదరగొట్టినా ,టి.ఆర్.ఎస్.,మిగతా పార్టీలన్నీ ఒక వైపు ఉండి ఎలెక్షన్లలో పాల్గొన్నా,అభివృద్ధి అనే నినాదంతో ఒంటి చేత్తో కాంగ్రెస్స్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ,టి.ఆర్.ఎస్. ను పది సీట్లకు మాత్రమే పరిమితం చేసి తెలంగాణావాదం ఏమీ లేదని తేల్చేశాడు.టి.ఆర్.ఎస్. పార్టీ కూడా అధినేత మీద విశ్వాసం లేక చిన్నాభిన్నమైనది.కానీ రాజశేఖర రెడ్డి గారు చని పోయిన తర్వాత చచ్చిపోయిన తెలంగాణా వాదాన్ని సెలైన్ ను పెట్టి తిరిగి బతికించి ఈ రోజు కేంద్రం తో తెలంగాణాకు సై అనిపించారు. ఈ పరిణామాల్ని చూస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తీవ్రంగా క్షోభిస్తూ ఉంటుంది.

5 కామెంట్‌లు:

Phani చెప్పారు...

evari aatmalO kshobistaayani prajalu baadhalu pautoone undaalaa..

అజ్ఞాత చెప్పారు...

idi prajala vijayam

Unknown చెప్పారు...

రాజ శేకరరెడ్డి ఆత్మ మాత్ర మే కాదు ,
కాసు బ్రహ్మానంద రెడ్డి ఆత్మ కూడా
విపరీతంగా క్షోభిస్తుంది.
కాకపోతే 1969 లో
తెలంగాణా ఉద్యమాన్ని
అణిచి వేసే క్రమంలో
బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ పోలీసు కాల్పులకు
బలైన 370 మంది ,
మొన్న తెలంగాణా కోసం
ఆత్మహత్య చేసుకుని,
గుండె ఆగి మరణించిన
37 మంది
తెలంగాణా అమర వీరుల
ఆత్మలు మాత్రం శాంతిస్తాయి.

అజ్ఞాత చెప్పారు...

if rajasekhar reddy atma is having that much value

what about the telangana heros

1969 లో
తెలంగాణా ఉద్యమాన్ని
అణిచి వేసే క్రమంలో
బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వ పోలీసు కాల్పులకు
బలైన 370 మంది ,
మొన్న తెలంగాణా కోసం
ఆత్మహత్య చేసుకుని,
గుండె ఆగి మరణించిన
37 మంది
తెలంగాణా అమర వీరుల
ఆత్మలు మాత్రం శాంతిస్తాయి.

this is enough

అజ్ఞాత చెప్పారు...

ఎవ్వరిది ఈ ఉద్యమం?
ఎప్పటిదీ ఉద్యమం?
ఎందుకీ ఉద్యమం?
మా కూడు మాకు దక్కాలని
మా నీరు మాకు దక్కాలని
మమ్ముల మేము పోషించుకోవాలని
మా పొట్ట కొట్టే వారిని వెలి వేయాలని
వాడెవ్వడు వాడెవ్వడు
మా అన్నం మెతుకు పై పేరు రాసేందుకు
వాడెవ్వడు వాడెవ్వడు
మా గొంతు నిండే దుకు
మో చేతి నీళ్లు తపెందుకు వాడెవ్వడు