3, జనవరి 2010, ఆదివారం

పాఠ్య పుస్తకాలు కూడా తెలంగాణా మాండలికంలో ఉండాలా?

మధ్యన తెలంగాణా వాదులు వాళ్ళ భాషను సినిమాలలో విలన్ల మరియు కమేడియన్ల చేత మాట్లాడిస్తున్నారని ,హీరోలచేత మాట్లాడించలేదని ఆరోపణలు చేస్తున్నారు.సినిమా వాళ్ళు ఏదో ఒక మాండలికాన్ని ప్రామాణికం చేసుకొని మాట్లాడిస్తుంటారు.అలాగే కొన్ని రోజుల వరకూ ఫ్యాక్షన్ సినిమాల నేపథ్యంలో రాయలసీమ మాండలికాన్నివాడారు.సినిమా వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం వినోదాన్ని ప్రేక్షకులకు పంచడమే. ఇలా ప్రతి దానిలో సెంటిమెంటు నురెచ్చకొట్టడం సరి కాదు. ఇవాళ తెలంగాణా సినీ రచయతలు వ్రాసే పాటలు కూడా తెలంగాణా మాండలికంలో లేవు.దీనికితెలంగాణా వాదులు ఏమంటారో ? అలా అనుకుంటూ పోతే చివరికి పాఠ్య పుస్తకాలలో కూడా తెలంగాణా మాండలికాన్నిప్రవేశ పెట్టాలని డిమాండ్ రావచ్చు.

5 కామెంట్‌లు:

Andhra Bidda చెప్పారు...

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ

Indian Minerva చెప్పారు...

పాఠ్యపుస్తకాలు ఆయా మాండలీకాల్లో వుండటం తప్పని నాకైతే అనిపించట్లేదు. నిజంచెప్పాలంటే అప్పుడు పిల్లవాడికి ఇంట్లోమాట్లాడే భాషలోనే, తాను ఇతర విదార్ధులతో వ్యవహరించేభాషలోనే విద్యార్జన సాధ్యమౌతుంది. ఇది ప్రస్తుతం ఆయా ప్రాంతాల విద్యార్ధులు ఎదుర్కొంటున్న "భాషాపరమైన దూరాలని" కొంతవరకు తగ్గిస్తుంది. ఇప్పటివరకూ మనం చేస్తుందల్లా ఒక ప్రాంతపుమాండలీకాన్ని ప్రామాణికంగా భావించి మిగతా ప్రాంతాలపై రుద్దడం మాత్రమే.

Unknown చెప్పారు...

అసలు సమస్యను వదిలేసి అనవసరపు చర్చలెందుకు.
అన్న దమ్ముల్లా న్యాయంగా కలిసుండే సంస్కారం మీకు లేదు.
అన్న దమ్ముల్లా సామరస్యంగా విడిపోయే సహ్రుదయమూ మీకు లేదు. !
మా ఖర్మ.

Nrahamthulla చెప్పారు...

పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి పాఠ్య పుస్తకాలతో పాటు అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసం.

Nrahamthulla చెప్పారు...

ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః

* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.