ఈ మధ్యన మేము మా కుటుంబం తో కలిసి వారణాసి ,అలహాబాద్,అయోధ్య వెళ్లి వచ్చాము .మన దక్షిణ భారత దేశం ,ఉత్తర భారత దేశం తో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది అని మనం అనుకుంటూ ఉంటాము.కాని మనం నేర్చు కోవలసినవి చాలా ఉన్నవి.ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి.అక్కడ ప్లాస్టిక్ వాడకం చాలా తక్కువ.ముఖ్యంగా టీ,కాఫీ,లస్సి లు వాళ్లు మట్టి పాత్రలలో ఇస్తున్నారు .ప్లాస్టిక్ కప్పు లు అస్సలు కనబడలేదు.దీని వలన గ్లోబలైసేషన్ వలన కుంటుపడిన మన చేతి వృత్తులను కా పా డిన వాళ్లము అవుతాము.దీని వలన మట్టి పాత్రలు తయారి మీద ఆధారపడిన కుమ్మరులను ఆదుకున్నట్లవుతుది.
అభివ్రిద్ది అంటే సాఫ్టు వేరు ఉద్యోగాలు,కార్లు మాత్రమే కాదు.భవిష్యత్తు తరాలకు వీలైనంత స్వచ్చమైన ప్రక్రుతి ని మిగల్చడం కూడా .అప్పుడే మనకు నిజమైన నాగరికత ఉన్నట్లు.
5, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
లాలూ ప్రసాద్ రైల్వేలలో మట్టి కప్పులు ప్రవేశ పెట్టాలనుకున్నాడు. ప్లాస్టిక్ కప్పుల కంటే మట్టి కప్పులు బరువుగా ఉన్నాయని వంక చూపించి కొంత మంది ఆ ప్రొపోజల్ ని వ్యతిరేకించారు.
ఎంతమంది మట్టికప్పులలో టీ తాగగలరు?
అలవాటు లేకపోతే చాలా కష్టం.
మనం గాజు గ్లాసుల్లో తాగినప్పుడు కూడా వాళ్ళు మట్టి పాత్రలలోనే తాగేవాళ్ళు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి