14, మే 2009, గురువారం

ఆర్దిక మాంద్యంలో ఆంధ్రలో బాబు గారి పాలన ఉండింటే?


బాబు గారు తిరిగి అధికారం లోకి వస్తే అంతే.ఈ రోజు ఆర్థిక మాంద్యంలో కూడా ప్రజలు అంతో ఇంతో బాగున్నారంటే అది కాంగ్రెస్స్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలవలనే.ఒక వేళ బాబు గారు ఈ అర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అధికారంలో ఉండింటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొనేవారో.ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక శాతం ప్రజలకు ఉపయోగపడే ఐ .టి గురించి మాత్రమే మాట్లాడే వాడు.ఆయన హై క్లాసు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వాడు.ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పాల పరిశ్రమ ,వ్యవసాయం పెట్టు కొని స్వయం సమ్రుద్ది సాధించి సంతోషంగా ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా మారలేదు.అన్నీ ఫ్రీ గా ఇస్తానని అంటున్నాడు.ఎంతసేపు ప్రజలను భిక్షగాల్లను చేసి ఆయన పబ్బం గడుపు కోవాలని చూస్తున్నాడు.
ఈ ఆర్థికమాంద్యం రోజుల్లో బాబు గారు అధికారం లో ఉండింటే అని ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నువ్వు ఎక్కడూ Bangalore లొ వుండి, ఆంధ్రా పల్లెల్లొ పాడి, వ్యవసాయం గురించి బాగానె వ్రాస్తున్నావు. ఇది అంతా ప్రత్యక్ష ప్రసారమా లెక దూరదర్షనా?

మరి ఎవరు ప్రభుత్వం ఎర్పాటు చెయాలి? చెపితె బాగుండెది.

Praveen Mandangi చెప్పారు...

చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకోవడానికి MIM పార్టీ ఉంది. BJP, MIM లాంటి మతతత్వ పార్టీలని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను కానీ చంద్రబాబు నాయుడు పాలన మాత్రం మతతత్వవాదుల పాలన కంటే ప్రమాదకరమైనది.

Unknown చెప్పారు...

కాంగ్రెసోళ్ళు ఈ అయిదేళ్ళూ నాటకమాడింది బాబు గారు సృస్టించిన "బూం" వల్లనే... 99-2004 మధ్యలో ఉన్న కరువు కాలంలో కాంగ్రెసోళ్ళు ఉండి ఉంటే ఎలా ఉండేదో తలుచుకుంటే భయమేస్తోంది.. ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుని ఉండేవాళ్ళో?

Praveen Mandangi చెప్పారు...

వ్యవసాయం వేస్టు అని ప్రకటించి ఆ తరువాత నాలుక మార్చిన చంద్రబాబు నాయుడు మాత్రం గొప్ప నాటకాల రాయుడు కాదా? YSR లాంటి ఫాక్షనిస్టులు, BJP, MIM లాంటి మతతత్వ గూండాలు కంటే చంద్రబాబు నాయుడే ప్రమాదకరం.

koumudi చెప్పారు...

your analysis absolutely illogical. It has got no sense

Praveen Mandangi చెప్పారు...

హిట్లర్, గోబెల్స్ ల కంటే పచ్చిగా అబద్దాలు ఆడేవాళ్ళలో చంద్రబాబుని మించిన అబద్దాల రాయుడు ఎవరు?

మయూఖ చెప్పారు...

బాబూ అజ్ఞాతా నేను ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న పల్లెటూరుకు చెందిన రైతు కుటుంబానికి చెందిన వాన్ని.నేను తరచుగా ఊరెలుతుంటాను.అక్కడ ప్రజల పరిస్థితులను పరిశీలించిన తర్వాతే ఈ పోస్ట్ వ్రాశాను.నాకేమీ వై.ఎస్ ప్రభుత్వం అంటే ఏమీ ప్రత్యేక మైన అభిమానం లేదు.కానీ వాస్తవ పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా ఒప్పుకోవాలి. వై.ఎస్.ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచింది.టి.డి.పి. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుండి ఋణాలు తెచ్హింది.ఏదీ చంద్రబాబు గారిని ఆ డబ్బుతో చేసిన శాశ్వత పథకాన్ని ఒకటి చూపించమనండి.పని ఏమీ చేయకుండా ప్రచారంతో నెట్టుకు రావాలని చూసాడు.వై.ఎస్.ప్రభుత్వం మెజారిటీ ప్రజల కోసం ఆరోగ్యశ్రీ,ముసలివాళ్ళకు పింఛను,పిల్లల చదువులకోసం ఫీజు రీ ఇంబర్సుమెంటు,రైతు పంటలకు మద్దత్తు ధర,రైతుల ఋణ మాఫీ ఈ పథకాలన్ని ప్రజల ఇంటిముందుకు తీసుకొని వెళ్ళారు.టి.డి.పి. ప్రభుత్వ హయాంలో ముసలివాళ్ళకు ఇచ్హే పించను అదీ 75 రూపాయలు ఎప్పుడో జన్మభూమి పెట్టినప్పుడు ఇచ్హేవాళ్ళు,అదీ కూడా గ్యారెంటీ ఉండేది కాదు.కాని ఇప్పుడు ప్రతినెలా నెలకు 200 రూపాయలు జీతం ఇచ్హినట్లు నెల మొదటి వారంలోనే ఇస్తున్నారు.చాలా ,ఇంకా ఏమైనా ఉదాహరణలు ఇవ్వాలా.చంద్రబాబు గారు చేసిన ప్రజా సంక్షేమ పథకం ఒకటి చెప్పండి చాలు.