16, మే 2009, శనివారం

జయహో ఓటరు మహాశయా!


ఈ ఎన్నికలలో దేశ ప్రజలు ,ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చినారు.ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు.

  • ముఖ్యంగా చంద్రబాబు గారి మోసపూరితమైన హామీలను నమ్మలేదు.అన్ని పార్టీలను కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రజాసేవ కంటే అధికారమే పరమావధి గా పని చేసినారు.ఆయన విశ్వసనీయతను , చిత్తశుద్ది ని ప్రజలు ఎవరూ నమ్మలేదు."ముఖ్యంగా నాయకులు విశ్వసనీయత,చిత్తశుద్ది ఒక సారి కోల్పోతే ప్రజలు వారిని నమ్మరని తేలిపోయింది."
  • సామాజిక న్యాయం అంటూ వచ్చి రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న ఇంకొక ఆయనను చిత్తుగా ఓడించినారు. ముఖ్యంగా మార్పు అంటూ వచ్చిన ఆయన లోకసత్తా లాగా నిజాయితీ పరులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేదేమో.ఈయన కూడా అధికార పేఠమే పరమావధిగా ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాడు.సభలకు వచ్చిన ప్రజలను చూసి అదంతా తన బలుపు అనుకొని ఆయన గాల్లో తేలిపోయినాడు.చివరికి అది వాపు అని తేలిపోయింది.చివరకు పాలకొల్లులో ఒక మామూలు మహిళ చేతిలో మెగాస్టార్ తలవంచ వలసింది. ఓట్ల కంటే ముందే ముఖ్యమైన నాయకుల ను కోల్పోయిన ప్రజారాజ్యం పార్టీ ,ఈ వాళ ఓట్లలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ,పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది."ఈ వాళ ప్రజారాజ్యం తరుపున గెలిచిన వాళ్లు కూడా తమ సత్తాతో గెలిచిన వాళ్ళే,చిరంజీవి చరిష్మా ఏమీ పని చేయలేదని తేలిపోయింది."
  • కమ్యూనిస్టులు అధికారాన్ని ఆశిమ్చ కుండా ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వాలకు చేస్తూ ,ప్రతిదినమూ ఒక పార్టీ తో అధికారంకోసం జట్టు కట్టేది మానుకొని వాళ్లు స్వంతం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి.విశ్వసనీయత లేని పార్టీలతో వీళ్ళు జట్టు కడితే వీళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.
  • సినిమా వాళ్లు కూడా ,వాళ్ల గురించి వాళ్లు ఎక్కువగా ఊహించు కునేది మానుకోవాలి.నిన్న గాక మొన్న సినిమాలలోకి వచ్చి రెండు మూడు సినిమాలు విజయవంతమైన హీరోలందరూ కూడా ,ప్రజలు వీళ్ళు ఏది చెపితే అది వినే వెర్రి వాళ్లు అనుకొని జనాన్ని చూస్తూనే పూనకం వచ్చిన వాళ్ళలా ఇష్టమొచ్చిన డైలాగులు చెప్పి ,తొడలు కొట్టి ,మీసాలు తిప్పి నానా హంగామా చేసినారు.ప్రజా సేవ అంటే మూడు గంటల సినిమా కాదని ప్రజలు తేల్చేసారు.
  • చివరగా కాంగ్రెస్స్ పార్టీ కి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని ,ఓటరు తీర్పు ఇచ్చినాడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేత్తప్పుడు ఆ భూమి కోల్పోయే పేద రైతు ల కడుపు మంటను గుర్తు పెట్టుకొని పని చేయాలని ,ప్రభుత్వ పతకాలను ప్రజలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరవేయాలని,ఊర్లలో ఉండే చోటా లీడర్లను అదుపులో పెట్టుకొని ప్రజలకు ప్రభుత్వ పతకాలు నేరుగా అవినీతి లేకుండా చేరవేస్తే తిరిగి అయిదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్స్ వాళ్ళదే అవుతుంది.
  • ఒకసారి ఎన్నికవగానే సేవకులనే మాట మరిచిపోయి ప్రభువులమని అనుకుని ప్రజాసేవపట్టని నాయకులను ,మంత్రులను ఓడించి,ఓటరు వారికి ఒక మంచి గుణపాఠం చెప్పినాడు.
  • లోకసత్తా నాయకుని గెలిపించి ప్రజలు తమకు మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని ,అవినీతి రహిత సమాజం కావాలని ,ప్రజాస్వామ్య పునాదులు ఇంకా గట్టి పదాలని,ఓట్లను డబ్బు తో కొనే విధానం పోవాలని చాలా బలంగా ,గట్టిగా కోరుకున్నారు.

25 కామెంట్‌లు:

సూర్యుడు చెప్పారు...

Good one

శరత్ కాలమ్ చెప్పారు...

చక్కగా చెప్పారు.

సుజాత వేల్పూరి చెప్పారు...

Good one!

bphanibabu చెప్పారు...

చాలా బాగా చెప్పారండి

పానీపూరి123 చెప్పారు...

nice...

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

"ప్రభుత్వ పతకాలు నేరుగా అవినీతి లేకుండా చేరవేస్తే"
ఇది మనదేశంలో సాధ్యమేనంటారా!

Praveen Mandangi చెప్పారు...

లోక్ సత్తా తెలుగు దేశం అనుకూల పార్టీ. అయినా ఆ పార్టీ అభ్యర్థులలో జె.పి. తప్ప ఎవరూ గెలవలేదు. లోక్ సత్తా ఓడిపోయినందుకు నన్నపనేని రాజకుమారి లాంటి తెలుగు దేశం నాయకులు కూడా విచారం వ్యక్తం చేస్తూ నిన్న TV9లో ప్రకటించారు. తెలుగు దేశం పార్టీ ఏజెంట్ కి జరగాల్సిన శాస్తే జరిగింది.

asha చెప్పారు...

మయూఖ గారు
నన్ను ఈ బ్లాగును ఈ క్రింది విధంగా ఉపయోగిస్తున్నందుకు దయచేసి క్షమించండి. నిజంగా నా సహనం చచ్చిపోయి ఇలా మాట్లాడుతున్నాను.

@ప్రవీణ్
ఏంటి మీ ప్రాబ్లం? ఎన్నో రోజులుగా చూస్తున్నాను. మీకు జే.పీ అంటే ఎందుకంత కోపం?
- అతను మాట్లాడినంత నిష్కర్షగా తెలుగుదేశం మ్యానిఫెస్టో గురించి ఎవరైనా మాట్లాడారా?
- అతను కమ్మ వాళ్ళకు సీట్లు ఇస్తే? ఇప్పటికి చాలామంది కులాల రిజర్వేషన్ల ప్రకారం ఇచ్చారుగా. ఈ బీసీలూ, యెస్సీలూ...వీళ్ళ పరిస్థితి ఎందుకలా ఇలానే ఉండిపోయింది. ఎందుకు అభివృద్ధి కాలేదు? అంటే ఒక 104 బీసీలకో, యెస్సీలకో టికట్లిచ్చేస్తే ఆ కులాలవాళ్ళు బాగుపడిపోతారా? లేకపొతే కనీసం 104 మందైనా(కేవలం ఆ కులంలో పుట్టారు కాబట్టి) బాగుపడితే చాలు అనుకుంటున్నారా? మీరు మాట్లాడేదాంట్లో అర్ధంపర్ధం ఉందా?
- అసలు లోక్‌సత్తా మ్యానిఫెస్టో చూశారా మీరు? ఏ కులానికైనా అనుకూలంగా ఒక్క పధకం చూపించండి? వాళ్ళ మ్యానిఫెస్టోలో లేని కులం మీకెక్కడనుండి కనిపిస్తుంది?
- అతను కమ్మ కులానికి చెందినవాడవటం అతను చేసిన తప్పా? అతనెంత నిజాయితీపరుడైనా మీకతని కులం తప్ప ఇంకేం కనిపించదా?

why are you so eclipsed by caste? who told you that ridiculing people of higher caste improves the situation of lower castes? Don't lose your credibility by saying such illogical things. It's hightime you correct your thoughts. Your caste fanaticism has lead you to talk against a party that has stood by honest and clean politics. Don't you think you are being ridiculous?
I know i am not supposed to advise you. But i could not stand your words.

Praveen Mandangi చెప్పారు...

గతంలో జె.పి. ఓపెన్ గానీ చంద్రబాబుని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు లోక్ సత్త ఎన్నికలలో పోటీ చెయ్యడం వల్ల కొన్ని విషయాలలోనైనా తెలుగు దేశాన్ని విమర్శించాల్సి వచ్చింది వాళ్ళకి. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే నోమ్ చామ్స్కీ పుస్తకాలు చదివి సామ్రాజ్యవాదుల ఏజెంట్లలో ఒకడైన జె.పి.ని నమ్మే స్థితిలో ఉన్నారు. జె.పి. ఫ్రీ మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ లాంటి కొన్ని ఐడియాలని వ్యతిరేకించిన మాట నిజమే కానీ చాలా విషయాలలో అతను తెలుగు దేశం వైపే ఉన్నాడు.

మయూఖ చెప్పారు...

ప్రవీణ్ గారూ Bhavaani గారు చెప్పినట్లు మీరు జె.పి. లాంటి నాయకునికి కులాన్ని ఆపాదించడం నేను జీర్ణించు కోలేను.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో సమాజ మార్పు కోసం లోకసత్తా ఒకటే మనకు వేగు చుక్కలాగా కనిపిస్తున్నది.ఆయన మాత్రమే అధికారంకోసం ప్రాకులాడకుండా ధైర్యంగా నిజాయితీగా మంచి అభ్యర్థులను నిలబెట్టి ఆయన నిజాయితీని,ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్దతను చాటుకున్నారు.అటువంటి ఆయనను మనలాంటి చదువుకున్న వాళ్ళందరూ కులాలకు,మతాలకు అతీతంగా ప్రోత్సహించాలి.చిరంజీవి గారు కూడా ఆయన లాగా కొత్త రాజకీయం చేస్తారనుకున్నాను.కానీ ఆయన కూడా మూస రాజకీయాలలోకి వెళ్ళినారు.అందుకే ఈ రోజున ఫలితం ప్రజారాజ్యానికి ఆశనిపాతం అయ్యింది.నిజంగా చిరంజీవిగారు మార్పు కోసం రాజకీయాలలోకి వచ్హి ఉంటే ఆయన జె.పి. గారి తో జత కట్టి ఉంటే ఈ రోజున అధికారం వాళ్ళదే అయి ఉండేది.ఈ రోజున జె.పి.గారు ఓడిపోయిఉంటే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండేది కాదు.కావున కూకటపల్లి నియోజకవర్గ ప్రజలకు నా హౄదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.కావున మనమందరం కుల,మతాలకు అతీతంగా ఎదిగి లోకసత్తా లాంటి పార్టీని బలపరిచి ,మన ప్రజాస్వామ్య పునాదులను బలపపరచుకొని,మన పిల్లలకు అందమైన సమాజాన్ని అందిద్దాం.

సుజాత వేల్పూరి చెప్పారు...

ప్రవీణ్,
నిన్న టీవీ సరిగా చూసే మాట్లాడుతున్నారా? లోక్ సత్తా వల్ల వోట్లు చీలి కాంగ్రెస్ గెలిచిందని నన్నపనేని ఏడ్చినంత పని చేసి దుమ్మెత్తి పోసింది. కమ్మ వాళ్ళకు సీట్లిచ్చారు అదీ ఇదీ అంటూ! ఇస్తే? లోక్ సత్తాలో ఇంతవరకూ కులాల గొడవలు లేవు. పార్టీ విధానాల ప్రకారం భవిష్యత్తులో అన్ని స్థానాలకూ పోటీ చేసినపుడు, అంత బలపడ్డాక ఈ కులాల వారీగా సీట్లిచ్చేప్రసక్తి వస్తుందేమో కానీ! పోటీ చేసింది ఏ కులం వాళ్ళని పార్టీ కోసం పని చేసిన వాళ్ళూ చూడలేదు,వోట్లు వేసిన జనమూ చూడలేదు.

తెలుగుదేశం ఏజెంటే అయితే పరిస్థితి మరోలా ఉండేది. ఏవో నాలుగు పుస్తకాలు చదివి వాటిని ఎవరెవరికో అన్వయించడం మీకు బాగా అలవాటైపోయింది ప్రవీణ్! ఇలా మాట్లాడానని ఏమీ అనుకోకండి! సామ్రాజ్య వాదుల ఏజెంట్ జేపీ! కొంచెమైనా ఆలోచించి రాస్తే బాగుంటుందేమో వ్యాఖ్య?

asha చెప్పారు...

అంటే తెలుగుదేశం ఏం చేసినా వ్యతిరేకించేయాలన్నమాట.
మీలా అందరూ ఉండరు మార్తాండగారు. వర్గాలు ఏదో
ప్రాతిపదికన నిర్ణయించేసుకొని అవసరమున్నా, లేకపోయినా వ్యతిరేకించటం అందరూ చేసే పని కాదు.
ఈ కులాలకూ, మతాలకూ అతీతంగా
అందరికీ విద్య, ఆరోగ్యం అందించటం మీ దృష్టిలో సామ్రాజ్యవాదాన్ని సమర్ధించటమా?
అయినా మీ కాన్స్పిరసీ థియరీకి ఏమిటర్ధం?
అతనికి తెలుగుదేశం ఇష్టమైతే అతను ఆ పార్టీలో
చేరకుండా వేరే పార్టీ పెట్టి మరీ తెలుగుదేశాన్ని
ఎందుకు బలోపేతం చెయ్యాలనుకుంటున్నారు?
Please don't say illogical things.

Praveen Mandangi చెప్పారు...

కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు వ్రాసిన ఆర్టికల్ చదవండి:
http://mlmedia.net.in/images/ls.tifఆర్టికల్ ని GIMP ద్వారా ఎడిట్ చెయ్యడం వల్ల PDFలో సేవ్ చెయ్యడం సాధ్యం కాలేదు. TIF ఇమేజెస్ విండోస్ పిక్చర్ & ఫాక్స్ వ్యూవర్లో కూడా ఓపెన్ అవుతాయి. ఫైల్ డౌన్ లోడ్ చేసి చూడండి.

మయూఖ చెప్పారు...

విజయ మోహన్ గారూ మన దేశం లో అసలు అవినీతి లేకుండా పథకాలు ప్రజలకు చేరతాయనుకోవడం అత్యాశ అవుతుంది.చిన్న దిద్దుబాటు,వీలైనంత తక్కువ అవినీతి తో.ధన్యవాదములు.

రాజ మల్లేశ్వర్ కొల్లి చెప్పారు...

భవానీ గారు / సుజాత గారు / రమణారెడ్డి గారు,
"He" has already proved his "credibility", almost everyone here knows about it. So, please just ignore him.

BTW, your responses are nice.

Praveen Mandangi చెప్పారు...

శ్రీనివాస రెడ్డి గారి ఆర్టికల్ కి సమాధానం చెప్పలేక ఈ అసహనపు వ్యాఖ్యలా? తాడేపల్లి గారి బ్లాగ్ లో సమతలం గారు చెప్పిన తరువాతే నేను శ్రీనివాస రెడ్డి గారి ఆర్టికల్ చదివి దాన్ని నా వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేశాను.

Praveen Mandangi చెప్పారు...

ఐదేళ్ళ క్రితం కూడా జె.పి.ని విమర్శిస్తూ "వార్తా" దిన పత్రికలో వ్యాసాలు వచ్చాయి. నేనేమీ కొత్తగా విమర్శించడం లేదు.

చదువరి చెప్పారు...

ప్రజలు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వరి వోట్లు ప్రతిపక్షాలకు మధ్య పంపకమై, కాంగ్రెసుకు లాభించింది.
------------------
ప్రవీణ్ టాక్స్: "గతంలో జె.పి. ఓపెన్ గానీ చంద్రబాబుని పొగిడిన సందర్భాలు ఉన్నాయి." - ఎప్పుడో చెప్పండి. ముడి చమురు ధరలు పెరిగినపుడు పెట్రోలు ధరలు పెంచడాన్ని నిన్న జరిగిన చర్చలో కూడా జేపీ సమర్ధించాడు. మరి, జేపీ కాంగ్రెసు అనుకూల పార్టీయా? 60 వేల కోట్ల అప్పులను మాఫీ చెయ్యడం సరైన పని కాదు అనీ అన్నాడు. ఆయన రైతు వ్యతిరేకియా? తెలుఇగుదేశం నాయకులు గోలెడుతున్నారు.. 29 స్థానాల్లో కేవలం లోక్‌సత్తా కారణంగా ఓడిపోయాం అని. లోక్‌సత్తా ఓడినందుకు ఆమెవరో విచారం ప్రకటించిందని చెబుతున్నారు, మీరు. నమ్మేట్టుగా ఉందా అసలు?

మీ వాదనలో పస లేదు. అయితే, మీ వ్యాఖ్యలో జోకొకటుంది. లోక్‌సత్తాకు శాస్తి చేసారని అన్నారు చూసారూ, అదే.. పెద్ద జోకు!

పెదరాయ్డు చెప్పారు...

చ౦ద్ర బాబును పొగడట౦ నేర౦ లాగు౦దే. కాగల కార్య౦ గ౦ధర్వులు తీర్చినట్లు, ప్రజారాజ్య౦, లోక్ సత్తాలు కా౦గ్రెస్కు గొప్ప ఉపకార౦ చేసి పెట్టాయి. అ౦త మాత్రాన వైయస్ గొప్పే౦ కాదు. అతనూ ప్రజలను వీలైన౦తగా ప్రలోభ పెట్టాడు. ఆ కృతఙ్ఞతతోనే ప్రజలు అతనికి ఓటేశారు. మరో ఐదేళ్ళు తన అస్మదీయులకు సేవచేసుకునే సదవకాశాన్ని కల్పి౦చారు.

ఎవరేమన్నా సమకాలీన రాజకీయాల్లో జెపి కొత్త ప్రయత్న౦ చేస్తున్నారు. అతని సమర్ఠతని మనమి౦కా అ౦చనా వేయలేక పోయినా, తను చెబుతున్న సిద్దా౦తాల పట్ల అతని నిబద్దత శ౦కి౦చరానిది. ప్రవీణ్ చెబుతున్న "కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు " ఎవరో గాని ఆ ఆర్టికల్ లో అతనికి లోక్ సత్తాలో టికెట్ రాని విషయ౦, ఆ అక్రోశ౦తో అతను లోక్ సత్తాను ని౦దిస్తున్నతీరు చాలా స్పష్ట౦గా అవగతమవుతు౦ది. నాకు తెలిసి ఎ౦తోమ౦ది సామాన్యులు లోక్ సత్తా టికెట్ సాధి౦చారు. అ౦తకన్నా ముఖ్య౦గా ఎ౦తో మ౦ది ధనబల౦ ఉన్నా చివరి నిమిష౦లో వచ్చిన అనేక మ౦దికి టికెట్ నిరాకరి౦చారు. ఈ విషయ౦ తెలిసాకే నాకు లోక్ సత్తా మీద మరి౦త గౌరవ౦ పెరిగి౦ది.

విమర్శలు అ౦దరూ చేయగలరు. కానీ దాని వుద్దేశ్యాలను గమని౦చ౦డి. సదరు ఆర్టికల్లో తనకు టికెట్ లేని అక్కసే ఎక్కువ కనిపిస్తు౦ది. ఈ సారి మార్ప౦టూ వచ్చిన ఇద్దరు నేతలు (జెపి, చిరు) వ్యవహరి౦చిన తీరే వారి నిబద్దతకు ఉదాహరణలు. చిరు మార్ప౦టూ వచ్చి ఆ గాలి వాటులో తనూ కలిసిపోయాడు. జెపి అదే మార్పుకోస౦ ఏటికి ఎదురీదుతున్నాడు. గాలివాటుకు చిరుకు వచ్చిన 19 సీట్లకన్నా తను నమ్మిన సిద్దా౦త౦తో జెపి సాధి౦చిన ఒక్క సీటే విలువైనది. ఈ ఒక్క సీటే మన భవిష్యత్తు మారుతు౦దనే నమ్మకానికి ఇరుసు.

కడివెడైననేమి ఖరము పాలు, గరిటెడైనను చాలు గోవు పాలు.

Praveen Mandangi చెప్పారు...

మా జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టులు పూర్తవ్వాలి కనుక నేను కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాను. తెలుగు దేశం పరాన్నభోగులు అవినీతి పేరు చెప్పి ఇరిగేషన్ ప్రోజెక్టులని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను తెలుగు దేశంకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చాను. In fact, I am not Congress activist. I am fan of Mao Zedong.

అజ్ఞాత చెప్పారు...

@Praveen's:

All the Bloggers know that you are a agent of కిరస్తాని మిషనరి Samuel Rajashekar.

With your sinister ideology, yo can not destroy Democracy in India. Stop your hatred towards Hindus. And you can not divide Hindus on Caste lines.

Praveen Mandangi చెప్పారు...

You are also one of the conspirators who are trying to stop irrigation projects. ఇరిగేషన్ ప్రోజెక్టులని ఎవరు అడ్డుకోవడానికి ప్రయత్నించినా, వాళ్ళని చంపి ఇరిగేషన్ కాలువల గట్ల మీద సమాధులు కడతాం.

Praveen Mandangi చెప్పారు...

పెండింగ్ ఇరిగేషన్ ప్రోజెక్టులు పూర్తి చేసేవాడు హిందువైనా, క్రిస్టియన్ అయినా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మతం పేరు చెప్పి ఇరిగేషన్ ప్రోజెక్టులని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డు సమాధులు ఇరిగేషన్ ప్రోజెక్టుల గట్ల మీద వెలుస్తాయి.

ramana reddy చెప్పారు...

ప్రవీణ్ గారూ మీ కామెంట్లలో దయచేసి హింసను చొప్పించకండి.ఈ చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు.ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం.

Praveen Mandangi చెప్పారు...

నేనేమీ హింసావాదిని కాను. నన్ను క్రైస్తవ మిషనరీ ఏజెంట్ అంటూ బురద జల్లిన వ్యక్తిలోనే మతం పేరుతో హింసావాదాన్ని నమ్మే లక్షణాలు ఉంటాయి. నేను నాస్తికుడిని. మా కుటుంబం హిందూ కుటుంబం. నేను ఇక్కడ మతం గురించి మాట్లాడకపోయినా మతం పేరు చెప్పి నన్ను దూషించడమేమిటి?