11, మార్చి 2009, బుధవారం

వీళ్ళా మన పాలకులు

ఎల'క్షణాలు ' తిరిగి మొదలయ్యాయి.ఊరు వాడా అంతా హోరెత్తిస్తున్నారు.ప్రజాసేవ చేయడానికి పరుగులు పెడుతున్నారు.

కాని ఏ అభ్యర్థి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో ఇంకొక బటన్ పెడితే బాగుంటుంది.నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు ఇష్ఠం లేని బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.

ఇలా చేస్తే పార్టీలు కొంచమైనా మంచివాల్లను తమ అభ్యర్థులుగా నిలబెడతాయి.ఇలాగైనా ప్రజాస్వామ్యం కొంతైనా మెరుగు పడవచ్చు.దీనిమీద ఎలెక్షన్ కమిషన్ దృష్టి పెడితే బాగుంటుంది.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ సూచన బాగుంది.
కాని ఇప్పుడున్నవాళ్ళలో కూడా కొంతమంది మంచివాళ్ళున్నారేమో.
పార్టీలకతీతంగా అట్లాంటివాళ్ళను గెలిపించవచ్చు కదా.

అజ్ఞాత చెప్పారు...

బొనగిరి గారు

ఇప్పుడు వున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు.గంజాయి వనంలో తులసి మొక్కలా మంచివాళ్ళు వున్నారు.వాళ్ళను మనం ఖచ్హితంగా గెలిపించు కోవాలి.నేను చెప్పింది నిలబడిన అభ్యర్థులు సరైన వాళ్ళు లేకుంటేనే.