వై.ఎస్ కుటుంబం మీద బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది.తొంబైలలో హైదరాబాదు నగరంలో మత కలహాలు జరిగినపుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారిని దించడానికి రాజశేఖరరెడ్డి గారే మతకలహాలు సృష్టించారని దుష్ప్రచారం గావించారు.దానిపైన ఒక కమిటీ ని కూడా వేసారు.చివరికి ఆ కమిటీ రాజశేఖరరెడ్డి హస్తం లేదని తేల్చింది. రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానాన్ని, రాజకీయ గ్లామర్ ను చూసి ఓర్వలేని కొన్ని పత్రికలు ,కాంగ్రెస్స్ పార్టీ లోని సోకాల్డ్ సీనియర్ నాయకులు ,ప్రతిపక్షాలు కలిసి ఆయనను ఫాక్షనిష్టు అని హత్యలు చేయిస్తారని విష ప్రచారం గావించాయి.ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో,ప్రజలను ఎంతగా ప్రేమిస్తారో ,సామాన్య ప్రజలు ఎంత సులభంగా ఆయనను కలుసుకోవచ్చో తెలిసింది.అదే ఆయన మీద విష ప్రచారం లేనట్లయితే ఆయన ఇరవై సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి అయి ఉండేవారు.అప్పుడు రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.ఈ వాళ ఉన్న ప్రాంతీయ వాదాలు తలెత్తేవి కావు.ఆయన చనిపోయిన తర్వాతకూడా ఆయనను శత్రువులు కూడా తలుచుకుంటున్నారు,ఆయన ఉంటే ఈవాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించేది కాదని.
ఈ వాళ హైదరాబాదు లో మత కలహాలు జరిగితే దానికి కూడా పరోక్షంగా జగన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు.జగన్ రాజ కీయ గ్లామర్ ను ఎదుర్కోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ,ప్రతిపక్షం వాళ్ళు ,జనాకర్షణ లేని నాయకులు రాజశేఖరరెడ్డి గారిని దెబ్బతీసినట్లుగా దెబ్బ తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినారు.దీన్ని జగన్ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ నాన్న లాగ రాజకీయాలలో రాటుదేలి ,తిరుగు లేని నాయకుడుగా ఎదుగుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.