27, సెప్టెంబర్ 2009, ఆదివారం

కాంగ్రెస్స్ పార్టీ "సో కాల్డ్ "సీనియర్ల రాజ్యాంగ ద్రోహం

కాంగ్రెస్స్ పార్టీకి సంభందించి నాయకులకు ప్రజలలో ఎవరికి ఎంత పలుకు బడి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలాబాగా తెలుసు. రోజు రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత సో కాల్డ్ సీనియర్ లనే ప్రజా బలం లేని వృద్ద నాయకులఅర్థం లేని ప్రకటనలు చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది.ముఖ్యమంత్రి ఎంపికలో ముఖ్య పాత్ర వహించాలిసిందిఎం.ఎల్. లు మాత్రమే అనే ప్రాథమిక రాజ్యాంగ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధిష్టానం ,లేక సీనియర్లు అనే వితండవాదాన్ని తెర పైకి తెచ్చి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారు .ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న ఎం.ఎల్. లుమాత్రమే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే ప్రజాభిప్రాయం ప్రతిఫలిస్తుంది,లేకపొతే తెలుగు వాడిఆత్మగౌరవ నినాదం తిరిగి తెరపైకి వచ్చి కాంగ్రెస్స్ పార్టీ తిరిగి రాష్ట్రంలో భ్రష్టు పట్టి పోతుంది. రాష్ట్రం లో రాజశేఖర రెడ్డిగారి విశ్వసనీయత ను చూసి ప్రజలు కాంగ్రెస్స్ పార్టీకి ఓట్లు వేసినారు గాని సోనియా గాంధిని,సోకాల్డ్ సీనియర్లను చూసికాదు. విషయాన్ని కాంగ్రెస్స్ పార్టీ అధిష్టానం గుర్తించి ,ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే పార్టీ రాష్ట్రంలోబట్టకడుతుంది,లేకపొతే అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి వేరే పార్టీ కి ఇచ్చిన వాళ్ళవుతారు.

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

రాజశేఖరరెడ్డికి మీరనుకుంటున్నంత విశ్వసనీయత లేదు. ఆయన పార్టీకి ఈ ఎన్నికల్లో 64 శాతం మంది ఓటర్లు వ్యతిరేకంగా వోట్ చేశారు. స్ట్రెయిట్ ఫైట్ లేకపోవడం చేత లెక్కల గారడీలో అనుకోకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అయితే ఆయనైనా తనంతట తాను ముఖ్యమంత్రి కాలేదు. ఆయన కూడా రోశయ్యలాగే అధిష్ఠానం చేత నియమించబడ్డవాడే. నియమించాక సీయెల్పీలో అధిష్ఠానం ఆదేశాల మేరకు అతన్ని శాసనసభా పక్ష నాయకుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అప్పుడు అవసరం లేని రాజ్యాంగం ఇప్పుడు దేనికి ?

anagha చెప్పారు...

రమణ గారు
మీరు చెప్పినదాంట్లో సగంవరకు బాగుంది .ప్రజాప్రతినిదులు ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి ,కానీ ప్రతివొక్కరు హై కమాండ్ (ఈ మాట వినలేక పోతున్నాము )అని మాట్లాడుతున్నారు .మీరన్నట్లు రాజ్యాంగం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు .నిజానికి వారసత్వంగా ఇవ్వడమనేది తప్పు .కానీ ,ఇక్కడ ప్రజా ప్రతినిధులు అందరు జగన్ కోరుకుంటున్నారు,వారు కోరుకున్నవారిని చెయ్యడం మంచి పద్ధతి . దానిలో తప్పేమీ లేదు అన్పిస్తుంది .జగన్ కి ఇవ్వకపోతే కాంగ్రెస్ కి ఏమి అవదు ,కాకపోతే గ్రూప్ రాజకీయాలు వస్తాయీ .ఇదువరకు లాగా సి .ఎం లు చేంజ్ అవుతవుంటారు .

మయూఖ చెప్పారు...

సుఫిజెన్ గారు 2004 మరియు 2009 లో ముఖ్యమంత్రి పీఠం గురించి అడిగే దమ్ము ఎవరికూండేదండి.ఎందుకంటే గెలుపుకు ఈ సీనియర్లు అనబడే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటో వాళ్ళకు,మరియు ప్రజలకు తెలుసు.సోనియా గాంధి గారు రాజశేఖర రెడ్డి కి ఈ పదవి ఊరకనే ఇవ్వలేదు.ఆమెకు తెలుసు,గెలుపు ఎవరి వల్ల వచ్హిందో.రాజశేఖర రెడ్డి గారు ఆమెకు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించారు.అన్ని పార్టీ లు ఏకమైనప్పటికి ,మరియు చిరంజీవిగారి సినిమా గ్లామరు ముందు రాజశేఖరరెడ్డి గారు ఒంటిచేత్తో కాంగ్రెస్స్ పార్టీని గెలిపించారు.

అజ్ఞాత చెప్పారు...

"...ఇక్కడ ప్రజా ప్రతినిధులు అందరు జగన్ కోరుకుంటున్నారు,వారు కోరుకున్నవారిని చెయ్యడం మంచి పద్ధతి...."

అనఘా గారూ ! రాజ్యాంగం ప్రకారం ప్రజా ప్రతినిధులకి తమలో ఒకరిని ఎన్నుకునే హక్కు మాత్రమే ఉంది. శాసనసభకి ఎన్నిక కాని బయటి వ్యక్తిని నాయకుడుగా ఎన్నుకునే హక్కు వారికి లేదు. కనుక ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ, మంత్రులూ జగన్ కావాలనడం తప్పు.

"...సుఫిజెన్ గారు 2004 మరియు 2009 లో ముఖ్యమంత్రి పీఠం గురించి అడిగే దమ్ము ఎవరికూండేదండి..."

GVRR గారూ ! సరిగా గుర్తుచేసుకోండి. రాజశేఖరరెడ్డిక్కూడా ఆరోజుల్లో అలా అడిగే దమ్ము లేదు. తదనంతర కాలంలో ఆ దమ్ముని అతనికి కల్పించినది అధిష్ఠానమే. అతను అధిష్ఠానం సృష్టించిన బొమ్మ. ఆ బొమ్మ స్థానంలో ఇంకో బొమ్మని పెట్టాలని అధిష్ఠానం అనుకుంటే అడ్డుకోగలిగేదెవరు ?

గతకొద్దికాలంగా రాజశేఖరరెడ్డి మూలంగా పూర్తిగా తన చేయి జారిపోయిన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్ని అధిష్ఠానం మళ్ళీ తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటోంది. రాజశేఖరెడ్డి & ఫ్యామిలీ పరపతిని సమూలంగా దెబ్బ కొట్టాలనే ఒక దృఢనిశ్చయానికొచ్చింది. అందుకోసం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోవడానిక్కూడా వాళ్ళు సిద్ధమే. అన్నిటికీ మానసికంగా సిద్ధమయ్యే, రోశయ్యగారిని ఆంధ్రరాష్ట్ర సింహాసనాధిష్ఠితుణ్ణి చేశారు, అందుకే తనని కలవడాకొచ్చిన ఆంధ్ర ఎమ్పీలతో సోనియా "పార్టీ 120 ఏళ్ళుగా ఉంది. ఇక్కడ నాక్కూడా ప్రాముఖ్యం లేదు" అని తెగేసి చెప్పింది. ఆమె నోరు తెరిచి ఆ మాట అన్నాక కూడా అందులోని అంతరార్థాన్ని పట్టుకోలేనివాళ్ళు నిజంగా మూర్ఖులే.

జగన్ ని తొక్కిపారెయ్యడం అధిష్ఠానానికి మరో ప్రత్యామ్నాయం లేని చావుబతుకుల సమస్య. ఉపేక్షించడానికీ, రాజీపడడానికీ వీల్లేని వ్యవహారం. పోనీలే అని ఇక్కడ జగన్ ని సింహాసనం ఎక్కనిస్తే అన్ని రాష్ట్రాల్లోని ఇలాంటి ప్రాంతీయ బాస్ లు తయారవుతారు. ప్రతిచోటా ఒక రాజశేఖరరెడ్డో, జగనో పుట్టుకొస్తారు. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న విధివిధానాల ప్రకారం - ప్రాంతీయంగా ఏ కాంగ్రెస్ నాయకుడూ/ ఏ కుటుంబమూ సొంతంగా బలపడడానికి వీల్లేదు. ఎవరైనా సరే, నెహ్రూ-గాంధీ కుటుంబ నామజపం చేసి బతకాల్సిందే. లేకపోతే అధిష్ఠానానికే ఎసరొస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీకి మరణశాసనమౌతుంది. బహుశా దేశానిక్కూడా !

ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. నా వ్యక్తిగత అభిప్రాయం చెబుతున్నానంతే. ఇక్కడ జగన్ గురించి బాధపడేవాళ్ళు ముఖ్యంగా రెడ్డికులస్థులూ, క్రైస్తవులూ. రాజశేఖరరెడ్డి చనిపోయినందుకు బాధపడుతున్నది కూడా వీరే. జగన్ గురించి జరుగుతున్న గొడవంతా ఈ రెండువర్గాల సృష్టే. తతిమ్మా జనసామాన్యానికి రాజశేఖరరెడ్డి చావు పట్ల పెద్దగా సానుభూతీ లేదు, జగన్ భవిష్యత్తు పట్ల ఆందోళనా లేదు. ఎందుకంటే వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలుసు.

కార్తీక్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కార్తీక్ చెప్పారు...

naadoka chinna vinnapam emi anukoakandi aalochinchandi ....

sir please mee blog archive background color blue theesee vere pettandi eni kanipiunchadamledu sari kadaa kachchitamgaa viewrs kallu debbathinela unnay