27, సెప్టెంబర్ 2009, ఆదివారం

అదే బ్లాగు పేరు ఇతరులు పెట్టుకోవచ్చా..

బ్లాగు కు మనం పెట్టిన పేరు ఇతరులు పెడితే అది మార్చడానికి ఏమి చేయాలి.అదే పేరు ఇతరులు కూడా పెట్టుకోవచ్చా. వాళ్ళకు ఈ విషయాన్ని తెలియ చెప్పినా మార్చాక పొతే ఏమి చేయాలి.ప్రొఫైల్ లో ఎవరు ముందు బ్లాగు మొదలు పెట్టినారు అని క్లియర్ గా ఉన్నా మార్చక పొతే ఎవరికీ కంప్లైంట్ చేయాలి దయ చేసి తెలపగలరు.

6 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఈ టాపిక్ కూడా చదవండి. ఇతర బ్లాగర్ల పేర్లని కూడా ఇమిటేట్ చేసి చీప్ టెక్నిక్ లు ప్రదర్శించే గ్రూప్ ఒకటి ఉంది. http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html ఈ చీప్ టెక్నిక్ లతో పోలిస్తే బ్లాగ్ పేరుని ఇమిటేట్ చెయ్యడం చాలా చిన్న విషయమే.

ప్రవీణ్ ఖర్మ చెప్పారు...

please read the comments particualry made by 'MALAKPET MENTAL' ....

He does not have basic common sense and values.

Please dont allow his comments in ur blog its a request

అజ్ఞాత చెప్పారు...

ఒకే పేరు ఉండటం ఏమీ తప్పు కాదు.అలా ఉండటం వలన ఇమిటేట్ చేసినట్టు ఎలా అవుతుంది..లోపల ఉన్న కాంటెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా..
మీకు తెలుపు అంటే ఎస్తం అలా ఆ రంగు అంటే ఎస్తమున్న వాళ్ల మే అభిరుచి ని కాపీ కొట్టినాట్ట..

కొత్త పాళీ చెప్పారు...

ఇటువంటి సమస్యలు (ఇది సమస్య అయితే) పరిష్కరించే authoritative body అంటూ ఏమీలేదు. బ్లాగు నిర్వహణలో ఏమన్నా సాంకేతిక సమస్యలు కానీ, లేదా ఇతరత్రా ఇబ్బందులు గానీ ఎదురైతే, తెలుగు బ్లాగుల గూగుల్ గుంపులో చర్చించొచ్చు. ఇతర సభ్యులు తమకి తోచిన పరిష్కారాలు సూచిస్తారు.
ఒక బ్లాగుకున్న పేరుని తెలియక ఇంకొకరు తమ బ్లాగుకి పెట్టుకోవడం జరిగింది ఇంతకు ముందు. వారి దృష్టికి తెచ్చినప్పుడు, కోందరు మార్చుకున్నారు. కొందరు మార్చలేదు. ఒకే పేరుతో రెండు బ్లాగులుండడం కొద్దిగా అయోమయం క్రియేట్ చేస్తుంది తప్ప అంతకంటే పెద్ద సమస్య కాదు. కొన్ని చోట్ల ఒక బ్లాగరుని ఎద్దేవా చెయ్యడం కోసమనే ఇటువంటి ఇమిటేషన్లు జరిగాయి, జరుగుతున్నావి. ఇలాంటి పిల్ల చేష్టలు ఎవరికీ పనికిరావని వారి వారికి వివేకం పుట్టాలి తప్ప ఎవరూ వారిని బలవంతపెట్టి మాంపించేదేమి లేదు.

జ్యోతి చెప్పారు...

ఇక్కడ ఏ పేరుమీద కూడా ఎవరికి కాపీరైటు హక్కులు ఉండవు. అప్పుడప్పుడు ఇలా ఒకే పేరుతో బ్లాగులు ఉంటే ఎవరో ఒకరు మార్చుకున్నారు. మీరు చెప్పినా మార్చకుంటే మీరే మార్చుకోండి.లేదా అలాగే కంటిన్యూ ఐపోండి.ఎవరి రాతలు వారివి. దాన్నిబట్టే చదివరులు వచ్చేది.గొడవలు, కంప్లైంట్లు ఎందుకు?? ఎవరిష్టం వారిది...

అజ్ఞాత చెప్పారు...

blog name okate aina URL veruga untundi kanuka problem evundi?

ps; mayukha ane peruto mikante mundu inko blog vundi :)

http://vaagdevi.wordpress.com/