వై .ఎస్. జగన్ నే సి.యం.చేయాలి.ఈ వాళ ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజాకర్షణ ఉన్నది జగన్ కే .రాష్ట్రం అంతా అనుచర గణం జగన్ కు ఉంది.రాష్ట్ర కాంగ్రెస్స్ లో ఎవరికీ అంతటి ప్రజాకర్షణ ,అనుచర గణం లేదు.జూనియర్ అని జగన్ ను పక్కన పెట్టకూడదు.జూనియర్ అని రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి , చాలా రోజులు ప్రజలలో అభిమానం లేని ముసలి నాయకులు అదికారాన్ని అనుభవించారు.చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అదే జూనియర్ పార్టీ ని అధికారంలోకి తీసుకు వచ్చి ప్రజా రంజకంగా పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయినాడు.పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీనియర్లంతా ఏం చేసారు.వారసత్వం అనే దాన్ని అనర్హతగా చూడకూడదు.కాబట్టి జగనే సి.యం .పోస్టు కు సరి అయిన వ్యక్తి .
4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
2 కామెంట్‌లు:
వరల్డ్ బ్యాంక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇచ్చిన రోశయ్యనే ముఖ్యమంత్రిని చెయ్యడం క్షేమకరం. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు అతను చాలా విషయాలలో రోశయ్య సలహాలు పాటించడం వల్లే అతను గొప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్థికాంశాలలో అనుభవం ఉన్న రోశయ్యకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.
అనుభవం అనేది వయస్సు తో రాదు.ప్రజల సమస్యలపై స్పందించే మనస్సు ఉండాలి.చెన్నారెడ్డి,విజయభాస్కరరెడ్డి లాంటి అనుభవం ఉన్న వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి లాగా ఎందుకు ప్రజారంజకంగా పరిపాలించి ప్రజల మనసులలో నిలవలేక పోయినారు.చంద్రబాబు అంత అనుభవం ఉండి ప్రజలు తొమ్మిది సంవత్సరాలు అధికారం ఇచ్హినా కూడా ఎందుకు ప్రజల మెప్పు పొందలేక ప్రజా దాడి కి గురైనారు.మానవత్వం మనసు నిండుగా ఉండి,రాష్ట్రం అంతా అనుచర గణం ఉన్న జగనే ఆ పదవికి అన్ని విధాలుగా అర్హుడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి