11, నవంబర్ 2009, బుధవారం

2012 లో యుగాంతం -మార్కెట్ వర్గాల కుట్ర

2012 లో యుగాంతం గురించి మధ్యన మీడియా లో చాలా హడావిడి కనిపిస్తుంది.ప్రతిదినమూ విషయాన్ని ప్రసారంచేస్తూ ,ప్రజలను చాలా భయానికి గురి చేస్తున్నారు.దీన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక మార్కెట్ వర్గాల కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆర్ధిక మాంద్యం పరిస్థితులలో మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి ,ప్రజలను ఎలాగోలా భయపెట్టి వాళ్ల దగ్గరఉన్నడబ్బు బయటికి తీయించి ఖర్చు పెట్టించాలనే యోచన కనిపిస్తున్నది. విధంగా ఆర్ధిక మాంద్యం నుండి బయటపడాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తున్నది.

6 కామెంట్‌లు:

Praveen Mandangi చెప్పారు...

ఇలాంటి డూమ్స్ డే ప్రవచనాలు బోలెడు వచ్చాయి. వీటికి వెంట్రుక విలువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.

jeevani చెప్పారు...

మంచి కోణం ! అయ్యుండచ్చు.

నాగప్రసాద్ చెప్పారు...

అవును. నిజమే. ఇది మార్కెట్ వర్గాల కుట్ర మాత్రమే. మన కాలమానం ప్రకారం కలియుగం 4,32,000 సంవత్సరాలు నడుస్తుంది. ప్రస్తుతం మనం కలియుగాబ్ది 5100 వ సంవత్సరంలో ఉన్నాం. కలియుగం అంతం అవ్వడానికి ఇంకా 4,26,900 సంవత్సరాలు ఉంది.

Praveen Mandangi చెప్పారు...

ఈ సింగినాదం జీలకఱ్ఱ ప్రకటనల గురించి డిస్కషన్ అవసరమా? నా చెవులతో లక్ష అబద్దాలు విన్న అనుభవం ఉంది. నా దృష్టిలో ఈ అబద్దాలకి వెంట్రుక విలువ కూడా ఉండదు. ఈకలూ, వెంట్రుకలూ గురించి ఆలోచించడం అంత అవసరమా?

Unknown చెప్పారు...

I thought of telling this from yesterday, what you said is correct.

Praveen Mandangi చెప్పారు...

దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టెయ్యమన్నాడట! డూమ్స్ డే ప్రవచనాలు జోకులని తెలిసి కూడా నమ్మడం ఇలాంటిదే.