ఎన్నికలప్పుడు వివిధ రకాలైన ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత అవి తీర్చ లేక వాటి నుండి తప్పించు కోవటానికి ప్రభుత్వాలు రక రకాల షరతులు విధిస్తూ ఉంటే, హామీలు నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు తమ గోడు ను ఎవరికీ చెప్పు కోవాలనో అర్థం కాక తెల్ల మొకం వేసికొని బిత్తర చూపులు చూస్తున్నారు .
ఇలా ఇంత సులభంగా ఉచిత హామీలు ఇచ్చి అధికారం లోకి రావచ్చు అనుకుంటే ఇంకొకాయన వచ్చి తలా ఒక కిలో బంగారం ఇస్తానంటాడు(ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ) . ఓట్లు వచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత తాను నియోజకవర్గానికి ఒక కిలో ఇస్తానన్నా నని ,ఒక కారెట్ బంగారం కిలో ఇస్తానన్నాని , బంగారం పూత పూసినది ఒక కిలో ఇస్తానన్నాని ఇలా రకరకాలుగా చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తమ పబ్బం గడుపుకొని వెళ్తారు . చివరికి ఓటర్లు తాము మోస పోయామని గుర్తిస్తారు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత మోసం చేయడానికి కొత్త హామీల తో వస్తారు.
రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !
ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .
ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి దిగి పోయే రాజకీయ పార్టీ నుండి వసూలు చేయాలి . ఆ అసత్యపు హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి .
అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి