మొదటి సంతకం రైతు ఋణ మాఫీ మీద అని ఎన్నికల ప్రచారం లో ఊదర గొట్టేసిన టి.డి. పి వాళ్ళు మరియు వారి అనుకూల మీడియా తీరా ప్రమాణ స్వీకారం సమయం వచ్చేటప్పటికి ఋణ మాఫీ మీద ఏర్పాటు చేసిన కమిటీ మీద సంతకం చేసి రైతులను ఉసూరుమనిపించారు.కిరణ్ గారి ప్రభుత్వం లోకూడా డెల్టా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆందోళనలు చేస్తుంటే ,వివిధ మీడియాలలో చర్చలు పెట్టి చివరికి ఒక మోహన్ కందా కమిటీ వేసారు. అది ఏమయ్యిందో ఇంత వరకూ తెలియదు. ఇది కూడా అలాంటి కమిటీ కాకుంటే బాగుంటుంది . అయినా ఇప్పుడు రైతులకు అర్జెంటుగా ఋణాలు కావాలి. సీజన్ మొదలైంది. కమిటీ ల తో కాలయాపన చేస్తే అదును తప్పి పోతుంది. కావున ప్రభుత్వం కమిటీ ల తో కాలయాపన చేయకుండా ఋణమాఫీ యుద్దప్రాతిపదిక మీద అమలు చేయాలి.
9, జూన్ 2014, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
బాబా మజాకా. ఎన్నికల హామీలకు కానీ ఇతర వాగ్దానాలకు కానీ (ఉ. మద్యనిషేదం, తెలంగాణకు మద్దతు, బీసీ డిక్లరేషన్, షెడ్యూల్డు కులాల వర్గీకరణ వగైరా) కట్టుబడడం వారి ఇంటా వంటా లేదు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కృష్ణయ్య గారిని ఊరించి కనీసం శాసనసభ నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి